News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Potato Curry: చికెన్ రుచిని మించి పోయేలా ఆలూ దమ్ కర్రీ ఇలా చేసేయండి

చికెన్, మటన్ తర్వాత ఎక్కువ మంది ఇష్టపడే వంటకం ఆలు కర్రీనే.

FOLLOW US: 
Share:

చికెన్ కర్రీ రుచికి పోటీ ఇచ్చేలా ఉంటుంది ఆలూ దమ్ కర్రీ. వెజిటేరియన్లకు ఇది ఎంతో నచ్చే కూర. చేయడం పెద్ద కష్టమేం కాదు. ఎప్పుడూ ఒకేలా బంగాళాదుంప కూర వండుకునే వారు ఓసారి ఇలా ప్రయత్నిస్తే రుచి కొత్తగా ఉంటుంది. 

కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు - అర కిలో 
టమాటా - ఒకటి 
ధనియాల పొడి - అర స్పూను 
గరం మసాలా - అర స్పూను 
జీలకర్ర - అర స్పూను 
లవంగాలు - మూడు 
ఉల్లిపాయ - ఒకటి 
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను 
పెరుగు - అర కప్పు
యాలకులు - రెండు 
ఉప్పు - రుచికి సరిపడా 
దాల్చిన చెక్క - చిన్న ముక్క 
జీడిపప్పులు - మూడు 
కారం - ఒక స్పూను 
పసుపు - పావు స్పూను 
కొత్తిమీర - అరకట్ట 
నూనె - తగినంత

తయారీ ఇలా
1. ముందుగా బంగాళదుంపల్ని బాగా ఉడికించుకోవాలి, తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి.
2.  ఇప్పుడు కళాయిలో నూనె వేసి, నూనె వేడెక్కాక యాలకులు, లవంగాలు, జీడిపప్పు ముక్కలు, దాల్చిన చెక్క వేయించాలి.
3. అవి మాడిపోకుండా చూసుకోవాలి. తరువాత ఉల్లిపాయ తరుగు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగాక టమాటా ముక్కలను కూడా వేసి బాగా వేయించాలి. 
4. అవి మెత్తగా ఉడికాక స్టవ్ కట్టేయాలి. వాటిని చల్లార్చి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. 
5. ఇప్పుడు బంగాళదుంప ముక్కలను మరీ చిన్నగా కాకుండా, పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి.
6.  పెద్ద ముక్కలకి టూత్ పిక్ తో రంధ్రాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కడాయిలో నూనె వేసి, పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, కారం వేసి కలపాలి.
7. ఈ పెద్ద బంగాళదుంప ముక్కలను అందులో వేసి రంగు మారేవరకు వేయించాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
8. అదే కళాయిలో జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర వేగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి. 
9. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయి సువాసన వస్తున్నప్పుడు, ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్టును కలపాలి. అది గ్రేవీలా అవుతుంది. 
10. ఒక ఐదు నిమిషాలు ఆ గ్రేవీ వేగాక పెరుగు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
11. మీడియం మంట మీద ఉంచి, మూత పెట్టేయాలి. కాసేపటికి తీస్తే నూనె పైకి తేలేలా అవుతుంది.
12. అప్పుడు ముందుగా వేయించుకున్న బంగాళదుంపలను వేసి కలపాలి.
13.  గ్రేవీ మరి కొంచెం ఎక్కువ రావడం కోసం ఒక గ్లాసు నీళ్లు పోయాలి. అలా ఓ పది నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మంచి సువాసన రావడం మొదలవుతుంది.
14.  చివరగా స్టవ్ కట్టేయడానికి ఐదు నిమిషాల ముందు తరిగిన కొత్తిమీరను చల్లుకోవాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి. 
15. అన్నంతో తిన్నా బాగుంటుంది. చపాతీ, పులావ్‌లకు  ఇది మంచి జోడీ. దీన్ని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు.
16.  చికెన్ కర్రీ కి కూడా పోటీ ఇచ్చేలా ఉంటుంది ఈ ఆలూ దమ్ కర్రీ.

Also read: టమోటో కెచప్ ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోండి, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అవసరం లేదు

Published at : 18 Jan 2023 07:35 AM (IST) Tags: Telugu Curry recipes Aloo Dum curry Recipe Potato Curry Recipe Potato Recipes in Telugu

ఇవి కూడా చూడండి

Chicken Pakodi Recipe : సండే స్పెషల్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ పకోడి.. టేస్టీ టేస్టీ రెసిపీ ఇదే

Chicken Pakodi Recipe : సండే స్పెషల్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ పకోడి.. టేస్టీ టేస్టీ రెసిపీ ఇదే

Kanchipuram Idly Recipe : కాంచీపురం ఇడ్లీ.. రెసిపీ వెరీ డెడ్లీ

Kanchipuram Idly Recipe : కాంచీపురం ఇడ్లీ.. రెసిపీ వెరీ డెడ్లీ

Ways to Reduce Spice in Curries : కూరలో కారం, ఉప్పు ఎక్కువైందా? ఈ సింపుల్ చిట్కాలతో తగ్గించేయండి

Ways to Reduce Spice in Curries : కూరలో కారం, ఉప్పు ఎక్కువైందా? ఈ సింపుల్ చిట్కాలతో తగ్గించేయండి

Christmas Special Cake Recipe : క్రిస్మస్ స్పెషల్ డార్క్ చాక్లెట్ హాజెల్​ నట్ కేక్.. టేస్టీ రెసిపీ ఇదే

Christmas Special Cake Recipe : క్రిస్మస్ స్పెషల్ డార్క్ చాక్లెట్ హాజెల్​ నట్ కేక్.. టేస్టీ రెసిపీ ఇదే

Plum Pudding Recipe : పిల్లలకు నచ్చే ప్లమ్ పుడ్డింగ్.. ఇంట్లోనే సింపుల్​గా ఇలా చేసేయండి

Plum Pudding Recipe : పిల్లలకు నచ్చే ప్లమ్ పుడ్డింగ్.. ఇంట్లోనే సింపుల్​గా ఇలా చేసేయండి

టాప్ స్టోరీస్

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

Telangana Power Politics :  తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు -  సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

ఛత్తీస్‌గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!

ఛత్తీస్‌గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!