అన్వేషించండి

బెడ్‌లైట్ వెలుగులో నిద్రపోతున్నారా? మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి, లేకపోతే..

అయితే చీకటి గదిలో నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. వెలుగులో నిద్ర పోవడం కంటే చీకట్లో నిద్ర పోయే వారు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.

కొంత మంది దేదీప్యంగా వెలిగిపోతున్న గదిలో నిద్రపోతారు. మరి కొందరికి బెడ్ లైట్ వెలుగులో త్వరగా నిద్ర వచ్చేస్తుంది. ఇంకొందరికి నిద్ర పట్టాలంటే గది చీకటి చెయ్యల్సిందే. కాస్త వెలుగున్నా పడుకోలేక ఇబ్బంది పడతారు. ఇలా ఒకొక్కరికి ఒక్కోరకమైన నిద్ర పట్టే అలవాటు ఉంటుంది. ఏది ఏమైనా నిద్ర చాలా ముఖ్యమనేది కాదనలేని విషయం. సరైన నిద్ర లేక పోతే తలనొప్పి నుంచి యాంక్జైటీ వరకు ఏ సమస్యైనా రావచ్చు. దీర్ఘకాలంపాటు నిద్రలేమి కొనసాగితే ఇమ్యూనిటీ తగ్గడం నుంచి హార్ట్ ఎటాక్ వరకు ఏ అనారోగ్యానికైనా కారణం కావచ్చు. ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి ఎవరికైనా.

అయితే చీకటి గదిలో నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. వెలుగులో నిద్ర పోవడం కంటే చీకట్లో నిద్ర పోయే వారు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. బెడ్ రూమ్ లోకి బయటి వెలుతురు రాకుండా జాగ్రత్త పడాలని కూడా సలహా ఇస్తున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.

  • చీకటిగా ఉండే పరిసరాలు త్వరగా నిద్ర పోవాలనే సంకేతాన్ని మెదడుకు పంపుతాయి. అందువల్ల త్వరగా నిద్రపట్టేస్తుంది. అతి త్వరగా గాఢనిద్రలోకి జారుకుంటారట. మంచి నిద్ర ఎప్పుడైనా మనసును శరీరాన్ని తాజా పరుస్తుంది.
  • చీకటి గదిలో పడుకుంటే 50 శాతం వరకు బరువు తగ్గే అవకాశం ఉంటుందట. వెలుతురులో నిద్ర పోతే జీవక్రియలు మందగించడం వల్ల నిద్రలో బరువు పెరుగతారట.
  • చీకటి గదిలో నిద్రపోతే జీర్ణక్రియ మెరుగవుతుందట. నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటి వారు జరిపిన అధ్యయనంలో చీకటి గదుల్లో పడుకునే వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువని నిర్థారించారు.
  • చీకటి గదిలో నిద్రపోతే మెలటోనిన్ హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. మహిళల్లో మెనుస్ట్రువల్ సైకిల్ కరెక్ట్ గా ఉండేందుకు ఈ హార్మోన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఓబెసిటి, డయాబెటిస్ ను కూడా నియంత్రిస్తుంది.
  • చీకట్లో నిద్ర పొద్దున్న మేల్కొన్న దగ్గర నుంచి రకరకాలుగా కాంతికి ప్రభావానికి గురైన కళ్లకు పూర్తిస్థాయిలో విశ్రాంతి దొరికి తిరిగి రెజువనేట్ అవుతాయి.
  • పెరిగే వయసు ముఖం మీద కనిపించకూడదనుకుంటే తప్పనిసరిగా మంచి నిద్ర అవసరం. నిద్రకు అనువైన వాతావరణం గదిలో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. కాస్త వ్యాయామం, రాత్రి పడుకునే ముందు పాదాలకు కొద్దిపాటి మసాజ్ ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

బాగా నిద్రపోయాక వచ్చే మెలకువ రిలాక్సింగ్ గా ఉంటుంది. నిజానికి 5,6 గంటల మంచి నిద్ర సరిపోతుంది. త్వరగా నిద్ర పోవడం, పడుకోవడానికి రెండు గంటల ముందే గాడ్జెట్స్ ఆపెయ్యడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ చూస్తూ నిద్ర పోయే వారిలో డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. స్ట్రీట్ లైట్ వెలుతురు గదిలోకి వచ్చి నిద్రా భంగం కలిగిస్తుంటే మాత్రం కిటికీలకు మందపాటి కర్టెన్లు వాడాలి. ఇలా మొత్తానికి గది చీకటి చేసుకుని నిద్రపోవడం ఆరోగ్యం, అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget