Diabetes and cataracts: డయాబెటిస్ ఉందా? మీరు కంటి చూపు కోల్పోకూడదంటే తప్పకుండా ఇలా చెయ్యాల్సిందే
Diabetes and cataracts:డయాబెటిస్ చాలా వరకు ఇప్పటి వారిలో కనిపిస్తున్న ఆరోగ్య సమస్య. రక్తంలో చక్కెర స్థాయిల నుంచి ఉత్పన్నమయ్యే కోలుకోలేని ఆరోగ్య పరిస్థితి.
Diabetes and cataracts : డయాబెటిస్.. ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. అయితే, దీన్ని లైట్ తీసుకోకూడదు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. డయాబెటిస్ వల్ల శరీరానికి సరిగ్గా ఇన్సులిన్ అందదు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి బాగా పెరిగిపోతాయి.. లేదా తగ్గిపోతాయి. ఆ ప్రభావం వల్ల అనే సమస్యలు ఏర్పడతాయి. అవయవాలు క్రమేనా దెబ్బతింటాయి. నరాలు సైతం బలహీనమవుతాయి. కొందరికైతే.. కంటి చూపు సమస్యలు కూడా వస్తాయి. చక్కెర స్థాయిలు పెరగడం వల్ల న్యూరోపతి, నెఫ్రోపతి, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, కార్డియోవాస్కులర్ సమస్యలు వస్తాయి. రెటినోపతి వల్ల కంటి చూపు సమస్యలు వస్తాయి. భవిష్యత్తులో మీ కంటి చూపుకు ఎలాంటి సమస్యలు రాకూడదంటే.. తప్పకుండా ఈ చిట్కాలు పాటించాలి.
ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోవడం:
మందులు, జీవనశైలి మార్పులు, మీ కళ్ళతో సహా సాధారణ చెకప్‌లు ద్వారా మీ రక్తంలో చక్కెర స్థాయిలు, లిపిడ్ ప్రొఫైల్‌లు, రక్తపోటును తెలుసుకోవాలి. వాటిలో ఏమాత్రం తేడా వచ్చినా కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నట్లయితే కంటిశుక్లం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
చురుకుగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి:
మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో.. మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. కంటి ఒత్తిడిని తగ్గించడానికి మీ దినచర్యలో కంటి వ్యాయామాలను చేర్చడం చాలా ముఖ్యం.
కళ్ల కోసం వీటిని తినండి:
పండ్లు, ఆకు కూరలు, తృణధాన్యాలతో సమతుల్యమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకోండి. మీ ఆహారంలో విటమిన్లు A, C, E, యాంటీఆక్సిడెంట్లు, జింక్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోండి.
సూర్యరశ్మి నుంచి దూరంగా:
సూర్యుడి హానికరమైన UV కిరణాల నుంచి మీ కళ్ళను రక్షించడానికి సన్ గ్లాసెస్ ధరించండి. కంటిశుక్లం, మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నిపుణుడిని సంప్రదించండి:
సమస్యలను ముందుగానే గుర్తించడానికి, సకాలంలో కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. అస్పష్టమైన దృష్టి, రాత్రిపూట చూడటం కష్టం, డబుల్ దృష్టి, కాంతికి సున్నితత్వం లేదా రంగులు మారడం వంటి లక్షణాలను మీరు ఎదుర్కొంటున్నట్లయితే ఐ స్పెషలిస్టును సంప్రదించండి.
ఈ అలవాట్లను మానుకోండి:
ధూమపానం, మద్యపానం మానుకోండి. ఎందుకంటే రెండూ మీ కళ్ళను దెబ్బతీస్తాయి. కంటిశుక్లం, మాక్యులర్ డీజెనరేషన్ వంటి ఇతర సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి.
Also Read : పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెంట్ అవ్వొచ్చా? ఆ రోజుల్లో ట్రై చేస్తే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయా?