అన్వేషించండి

Ayushman Bharat Scheme : ఆయుష్మాన్ భారత్ పథకం వైపు మొగ్గు చూపని ప్రైవేట్ ఆసుపత్రులు.. వైద్యం పేదలకు అందదా?

Health Schemes in India : ఆయుష్మాన్ భారత్ పథకంలో ప్రైవేట్ ఆసుపత్రుల భాగస్వామ్యం తగ్గిపోతుంది. దానికి కారణాలు ఏంటి? ఈ స్కీమ్ ప్రయోజనాలు ఇకపై ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందవా?

Ayushman Bharat Scheme in India : దేశంలోని ఆయుష్మాన్ భారత్ యోజన అతిపెద్ద ఆరోగ్య పథకం. జన ఆరోగ్య యోజన ప్రతి ఒక్క అవసరమైన వ్యక్తికి అందాలని.. ఉచిత వైద్యం దక్కాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. అయితే ఇప్పుడు దాని సేవలు ప్రజలకు దూరమవుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా వెలువడిన గణాంకాలు ప్రకారం.. ఆయుష్మాన్ భారత్ యోజనపై ఉన్న విశ్వసనీయతను దూరం చేసేలా ఉన్నాయి. అలాగే ఫ్యూచర్​లో దీనిని ఉపయోగించుకోవాలనే వారికి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఆసుపత్రులు ఈ పథకంలో చేరేవి. కాని ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు ఈ పథకంపై ఆసక్తిని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.

2024–25లో తగ్గిన కొత్త ఆసుపత్రుల చేరిక

2024–25లో ఆయుష్మాన్ భారత్ యోజనలో కేవలం 2,113 ఆసుపత్రులు మాత్రమే చేరాయి. అదే 2023–24లో అయితే ఈ సంఖ్య 4,271.. దానికి ముందు సంవత్సరంలో 2022–23లో 3,124 ఆస్పత్రులు ఈ పథకంలో చేరాయి. అలా చూసుకుంటే ఈ పథకంలో ఈసారి చేరే ఆసుపత్రుల సంఖ్య స్పష్టంగా తగ్గినట్లు కనిపిస్తుంది. ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రతాపరావు జాధవ్ అందించారు.

పథకంలో మొత్తం ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి?

దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ యోజనలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 31,466 ఆసుపత్రులు చేరాయి. వీటిలో 14,194 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. అంటే పథకం పరిధి పెరిగింది.. కానీ కొత్త భాగస్వామ్యంలో తగ్గుదల ఉంది.

పథకంలో ఎన్ని చికిత్సలు ఉన్నాయి?

ఆయుష్మాన్ భారత్ పథకం కింద లభించే చికిత్సల ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీని ఇప్పటికీ ఐదుసార్లు అప్‌డేట్ చేశారు. 2022లో వచ్చిన  కొత్త ప్యాకేజీ HBP 2022, 27 వేర్వేరు ప్రత్యేకతలలో 1,961 రకాల వైద్య విధానాలను ఈ పథకం కవర్ చేస్తుంది.

ప్రైవేట్ ఆసుపత్రులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నాయి?

ఈ పథకంలో ప్రైవేట్ ఆస్పత్రులు వెనకడుగు వేస్తున్నాయనేది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. దానిపై నిపుణులు, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రకారం దానికి రెండు ప్రధాన సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది.

  • క్లెయిమ్ చెల్లింపులో ఆలస్యం – నిబంధనల ప్రకారం.. రాష్ట్రాల లోపల ఉన్న రోగులకు 15 రోజుల్లో, ఇతర రాష్ట్రాల రోగులకు 30 రోజుల్లో చెల్లింపులు జరగాలి. కానీ వాస్తవానికి ఈ సమయ పరిమితి చాలాసార్లు దాటేస్తుంది. ముఖ్యంగా పెద్ద ఆసుపత్రులు, ఖరీదైన చికిత్సల విషయంలో ఇది జరుగుతుంది.
  • ప్యాకేజీ రేటు – చికిత్సకు బదులుగా లభించే డబ్బు.. వ్యయం కంటే తక్కువగా ఉంటుందని చాలా ప్రైవేట్ ఆసుపత్రుల కంప్లైయింట్. దీనివల్ల వారికి ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.

ఈ సమస్యల కారణంగా పథకాన్ని చౌకగా ఉంచాలని చాలామంది కోరుకుంటున్నారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా సమతుల్య ఆర్థిక ప్రయోజనాలు లభిస్తే ఈ ఆయుష్మాన్ భారత్ యోజన ప్రజలకు చేరుతుందని భావిస్తున్నారు. దీనివల్ల పథకం ఎక్కువ కాలం కొనసాగుతుంది కూడా. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కల సాకారమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమస్యలు పరిష్కారమైతే.. మరిన్ని వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా లభించనున్నాయి అంటున్నారు నిపుణులు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget