White Hair: తెల్ల జుట్టు వేధిస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే హెయిర్ నిగనిగలాడిపోతుంది!
వయసు తక్కువే అయినా కూడా తెల్ల జుట్టు వచ్చి నలుగురిలో ఇబ్బంది పెడుతుందా? వైట్ హెయిర్ సమస్య నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు పాటించండి.
గతంలో అయితే పెద్ద వయస్సు వాళ్ళలో మాత్రమే తెల్ల వెంట్రుకలు కనిపించేవి. కానీ ఇప్పుడు పెద్దా చిన్న అనే తేడా లేకుండా జుట్టు నెరిసి ఇబ్బంది పెడుతుంది. మారుతున్న ఆరోగ్య జీవిన శైలి, ఆహారపు అలవాట్లే అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. 20 ఏళ్ల వాళ్ళు కూడా జుట్టు తెల్లబడిపోవడంతో రంగు వేసుకోవడం, గోరింటాకు పొడి పెట్టుకోవడం చేస్తున్నారు. దీని వల్ల తాత్కాలికంగా జుట్టు రంగు మారుతుంది కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తెల్ల జుట్టు బయటకి వచ్చేస్తుంది. దాని వల్ల నలుగురిలో తిరిగేందుకు ఇబ్బంది పడుతున్నారు.
జుట్టు రంగు మారడానికి విటమిన్ బి 12 లోపం, ఒత్తిడి, ధూమపానం వంటి కారణాలు కూడా ఉన్నాయి. వృద్ధాప్యం, ఆక్సీకరణ ఒత్తిడి, యాంటీఆక్సిడెంట్ తగినంతగా తీసుకోకపోవడం, ఆహారం, జీవనశైలిలో మార్పులు, ఒత్తిడికి గురికావడం వంటివి కూడా వ్యక్తులని బట్టి కూడా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నెరిసిన జుట్టుని కప్పిపుచ్చుకోవడానికి మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. కానీ వాటిని వినియోగించడం వల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తూ ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అవి గిట్టకపోతే చర్మం మీద దాని ప్రభావం పడుతుంది. దద్దుర్లు రావడం. చర్మం మీద పచ్చలు పడటం కూడా జరుగుతుంది. దీని వల్ల లేనిపోనీ కొత్త సమస్యలు వస్తున్నాయి. అందుకే అలాంటి వాటి మీద ఆధార పడకుండా ఆహారం ద్వారానే ఈ సమస్యని అధిగమించవచ్చు. అందుకు మీరు సింపుల్ గా ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
☀ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. కూరగాయలు, పండ్లలో ఇవి పుష్కలంగా లభిస్తాయి. సహజమైన పద్ధతిలోనే కాకుండా సప్లిమెంట్స్ ద్వారా కూడా వీటిని పొందవచ్చు. ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జుట్టుకి సహజమైన కాంతి మృదుత్వం వస్తుంది. జుట్టు కూడా పెరుగుతుంది. మంచి ఆకృతిని ఇస్తుంది.
☀ తల మాడు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. లేదంటే దుమ్ము చేరి జుట్టు రాలిపోవడం, పెళుసుగా మారిపోవడం జరుగుతుంది. ఆహారంలో ముదురు ఆకుపచ్చ కూరగాయలు, నారింజ, పసుపు రంగు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. సిట్రస్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టుకి చక్కగా పోషకాలు అందుతాయి.
☀ మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. జింక్, ఐరన్, కాపర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
☀ ఆయిల్ ఫుడ్స్, రంగులు చల్లి వండిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. అవి జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తాయి.
☀ వాణిజ్యపరంగా ప్రాసెస్ చేయబడిన హెయిర్ డైని నివారించాలి. సహజ పోషణ అందించే ఉత్పత్తులు వినియోగించడం ఉత్తమం.
☀ సోడియం లారిల్ సల్ఫేట్ లాంటి కఠినమైన డిటర్జెంట్లు లేకుండా ఉండే సున్నితమైన ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది. దీని వల్ల జుట్టు మృదుత్వం కోల్పోకుండా ఉంటుంది.
☀ చేతి వేళ్ళతో మాడు వరకు కుదుళ్ళకి బాగా మసాజ్ చెయ్యాలి. ఇలా చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు సహాయపడుతుంది.
☀ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హెయిర్ ఫోలికల్స్ కి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అసలు వదిలిపెట్టరు
Also Read: గర్భిణులకు ఆకలి వేయకపోవడానికి కారణాలు ఇవే