Kidney Transplantation: మెడికల్ మిరాకిల్ - కోతికి పంది కిడ్నీ, రెండేళ్లుగా హాయిగా జీవించేస్తోన్న వానరం
జంతు అవయవ మార్పిడి మీద జరుగుతున్న ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
అసాధ్యాలని సుసాధ్యం చేయడంలో పరిశోధకులు ఎప్పుడు ముందుంటారు. జంతువుల కిడ్నీలు మనిషి శరీరంలో ఏ విధంగా పని చేస్తాయనే దాని మీద ఇప్పటికే విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిలో ఇప్పటికే పంది కిడ్నీ పెట్టగా రెండు నెలలకు పైగా విజయవంతంగా పని చేస్తుందని తెలిపారు. తాజాగా మరొక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది.
పంది కిడ్నీ అమర్చిన కోతి రెండు సంవత్సరాలుగా జీవించే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అవయవ మార్పిడికి చేసిన తర్వాత అత్యంత ఎక్కువ కాలం జీవించి ఉన్న ఘటన ఇదే. జంతువుల అవయవాల ఉపయోగించి మానవుల ప్రాణాలు రక్షించడం కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. మానవ అవయవాల కొరత తగ్గించే లక్ష్యాన్ని నెరవేర్చడమే ఈ పరిశోధనల ప్రయోగాలు. ఈ విధానాన్ని జెనోట్రాన్స్ ప్లాంటేషన్ అంటారు.
మానవేతర ప్రైమేట్స్ లో జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన జంతువుల అవయవాలు ఏ విధంగా పని చేస్తాయని, అవి ఎంత సురక్షితంగా పని చేస్తాయనేది చెప్పేందుకు ఇది రుజువుగా నిలిచాయని పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం నేచర్ జర్నల్ లో ప్రచురించారు. ఈ అధ్యయనం యూఏస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేటర్ కి మరింత డేటాని అందిస్తుంది. మానవేతర అవయవ మార్పిడికి సంబంధించి ఎంతవరకు ఫలితాలు ఇస్తాయనేది, పందులని ఎంత వరకు ఉత్పత్తి చేయడం సాధమవుతుందని తెలుసుకోవడం ముఖ్యం.
పంది నుంచి మనిషికి మార్పిడి
గత కొన్ని సంవత్సరాలుగా పరిశోధకులు పంది హృదయా, మూత్రపిండాలు ఇద్దరు వ్యక్తులకి అమర్చారు. వారిలో ఒక వ్యక్తి గుండె మార్పిడి చేయించుకున్న కొన్ని రోజులకి ఇన్ఫెక్షన్ కారణంగా మరణించాడు. అయితే గుండెకి ముందుగానే ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల అలా జరిగిందని వైద్యులు వెల్లడించారు. మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న వ్యక్తి ముందుగానే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. వైద్యుల పరిశోధనల కోసం తన శరీరాన్ని ఇవ్వమని కుటుంబ సభ్యులకి చెప్పడంతో ఈ పరిశోధనకి ఆయన శరీరాన్ని ఉపయోగించుకున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతంగా చేశారు. కిడ్నీలు అమర్చిన రెండు నెలలుగా బాగానే పని చేస్తున్నాయని ఇటీవలే వైద్యులు ప్రకటించారు.
జెనోట్రాన్స్ ప్లాంటేషన్ పరిశోధన ప్రధానంగా పందులపై దృష్టి సారించింది. ఎందుకంటే వాటి అవయవాలు మానవులతో పోల్చదగిన పరిమాణం, శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటున్నాయి. మానవుల రోగనిరోధక వ్యవస్థలు, పంది కణాల ఉపరితలాలపై మూడు అణువులకి ప్రతి స్పందిస్తాయి.
మానవులకి ఉపయోగపడుతుందా?
అవయవ మార్పిడి చేసిన తర్వాత రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించిన ఘాట్ మాత్రం అసాధారణమైంది. జన్యుమార్పిడి చేసిన పందుల అవయవాలు మానవులలో మెరుగ్గా పని చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోతుల కంటే మానవుల చాలా ఎక్కువ బరువు కలిగి ఉంటారు. అధిక రక్తపోటు ఉంటుంది. అందుకే పంది అవయవాలు మానవ శరీరంలో తట్టుగోలవో లేదో విస్తృతంగా పరిశోధనలు చేయాల్సి ఉంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: గుడ్లు తింటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయా?