అన్వేషించండి

Groundnuts: మధుమేహం ఉన్న వాళ్లు కూడా వేరుశెనగ పలుకులు తినొచ్చు, ఎందుకంటే...

చాలామంది డయాబెటిస్‌తో బాధపడేవారు వేరుశెనగపలుకులు తినేందుకు ఇష్టపడరు.

చలికాలంలో సాయంత్రం వేడివేడి స్నాక్స్ తినేందుకు అందరూ ఇష్టపడతారు. ఓ రోజు పకోడి, మరో రోజు సమోసా, ఇంకో రోజు ఉడకబెట్టిన పల్లీలు (వేరుశెనగపలుకులు), లేదా పల్లీల పకోడి. కానీ మధుమేహం ఉన్న వారు మాత్రం పల్లీలు తినేందుకు వెనక్కి జంకుతారు. అవి తినకూడని ఆహార జాబితాలో కలిపేస్తారు. నిజానికి డయాబెటిక్ రోగులు కూడా పల్లీలు తినొచ్చు. అతిగా తింటే ఎవరికైనా కడుపునొప్పిలాంటివి కలగవచ్చు. మితంగా తిన్నంత వరకు ఎలాంటి సమస్యా రాదు.  

నట్స్ అనగానే గుర్తొచ్చేవి బాదం, వాల్‌నట్స్, జీడిపప్పులాంటివే. కానీ పల్లీలు కూడా నట్స్ కోవలోకే వస్తాయి. నిజానికి బాదం, వాల్‌నట్స్ కన్నా కూడా పల్లీల వల్లే ఆరోగ్యం ఎక్కువ. వీటి వల్ల గుండెకు జరిగే మేలు ఎక్కువే. గుండెపోటు వచ్చే అవకాశాల్ని ఇవి తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అంతేకాదు రక్తంలో గడ్డలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. 

బరువు పెరగరు
పల్లీలు తినడం వల్ల కేలరీలు అధికంగానే శరీరానికి అందుతాయి. అలాగే కొవ్వు కూడా ఉంటుంది. కానీ బరువు పెరగరు. అదే వీటి ప్రత్యేకత. రోజూ పల్లీలు తినేవారిలో ఊబకాయం వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువని చెబుతున్నాయి అధ్యయనాలు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల శరీరానికి రక్షణ కల్పించినట్టు అవుతుంది. పల్లీలలో మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నిషియం, కాపర్, నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి. 

మధుమేహులు తినొచ్చు
వేరుశెనగ పలుకుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ విలువ తక్కువగా ఉంటుంది. దీనివల్ల డయాబెటిక్ రోగులు తినొచ్చు. వీటిని తినడం వల్ల రక్తం లోని చక్కెర స్థాయులు హఠాత్తుగా పెరగవు. కాబట్టి తిన్నా ఎలాంటి ప్రమాదం లేదు. అంతేకాదు పల్లీలు తినే మహిళలు టైప్ 2 డయాబెటిస్ బారిన తక్కువగా పడతారని కొన్ని అధ్యయనాలు తెలియజేశాయి. కాబట్టి ఎలాంటి భయం లేకుండా పల్లీలను లాగించవచ్చు. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

టాప్ హెడ్ లైన్స్

DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Dussehra Navratri Day 2 : దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
AP Coalition MLAs Controversies: ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
Embed widget