By: Haritha | Updated at : 02 Sep 2023 02:27 PM (IST)
(Image credit: Youtube)
పనీర్ తో వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. శాకాహారులంతా పనీర్ వంటకాలను తినేందుకు ఇష్టపడతారు. వారికి అధిక ప్రొటీన్ అందేది కూడా పనీర్ తోనే. ఎప్పుడు ఒకేలాంటి వంటకాలు చేసుకుని బోర్ కొడితే ఓసారి పనీర్ కీమా కర్రీ ప్రయత్నించండి. చపాతీతో, అన్నంతో కూడా టేస్టీగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు
పనీర్ తురుము - ఒక కప్పు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - నాలుగు
బిర్యానీ ఆకు - ఒకటి
పచ్చిమిర్చి - నాలుగు
ఉల్లిపాయ - ఒకటి
టమాటా - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
కారం - ఒక స్పూన్
జీలకర్ర పొడి - ఒక స్పూను
గరం మసాలా - అర స్పూను
మిరియాల పొడి - అర స్పూను
పసుపు - అర స్పూను
నిమ్మరసం - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తురుము - రెండు స్పూన్లు
నూనె - ఒక స్పూను
నెయ్యి - ఒక స్పూను
తయారీ ఇలా
స్టవ్ మీద కళాయి పెట్టి ఒక టీ స్పూన్ నెయ్యి, టీ స్పూన్ నూనె వేయాలి. అవి వేడెక్కాక జీలకర్ర, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క అన్ని వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయల తరుగు కూడా వేసి వేయించాలి. అవన్నీ బాగా వేగాక టమాటా తురుమును వేసి మూత పెట్టి మగ్గించాలి. తర్వాత ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, పసుపు, మిరియాల పొడి, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. మూత పెట్టాక అది గ్రేవీలా తయారవుతుంది. ఆ సమయంలో పన్నీరు తురుమును వేసి బాగా కలపాలి. అప్పుడు కూర పొడి పొడిగా అవుతుంది. చివరగా కొత్తిమీర చల్లుకొని నిమ్మరసం కూడా కలుపుకుంటే పనీర్ కీమా కర్రీ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది. పనీర్ కీమాలో పచ్చి బఠానీలు కలిపి వండుకున్నా రుచిగా ఉంటుంది.
పనీర్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మహిళల్లో ఎక్కువ మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు. వారు పనీర్ అధికంగా తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. పనీర్ తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. మధుమేహులు కూడా పనీర్ అధికంగా తినవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీన్ని తినడం వల్ల కాల్షియం, విటమిన్ డి శరీరానికి అందుతాయి. ఇందులో మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లం ఉంటుంది. అందుకే పనీర్ ను తరచూ తింటూ ఉండాలి. పనీర్ మితంగా తింటే ఎంతో ఆరోగ్యం.
Also read: టీ పొడి మీ ఇంట్లో ఉంటే మీరు కోటీశ్వరులే, దీని ధర ఆ రేంజ్లో ఉంటుంది మరి
Also read: పచ్చి ఉల్లిపాయను తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు, జాగ్రత్త
Green Banana: పచ్చి అరటి పండు తినడం వల్ల ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చా?
Brain: మీ మెదడు త్వరగా ముసలవ్వకూడదనుకుంటే ప్రతిరోజూ వీటిని తినండి
Mehendi: మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?
World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!
TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు
Chandrababu Arrest: చంద్రబాబు ఓ క్రిమినల్, అందుకే అరెస్ట్ చేశారు - స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!
అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!
/body>