అన్వేషించండి

Packed Vs Fresh Coconut Water: ప్యాక్డ్ కొబ్బరి నీళ్లు తాగొచ్చా? తాజా కొబ్బరి నీటికి, దానికి తేడా ఏమిటీ?

కొబ్బరి నీళ్లు అలసిన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే ప్యాక్డ్ కొబ్బరి నీళ్ళు తాగితే కూడా తాజా కొబ్బరి నీళ్ళ వల్ల కలిగే ప్రయోజనాలు పొందుతారా?

ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత చల్లటి కొబ్బరి నీళ్ళు తాగితే పొట్టకి హాయిగా అనిపిస్తుంది. వేసవి తాపం నుంచి రక్షించడంలో కొబ్బరి నీళ్ళ తర్వాత ఏదైనా. అయితే కొన్ని ప్రాంతాల్లో తాజా కొబ్బరి బోండాలు కాకుండా క్యాన్డ్ లేదా ప్యాక్డ్ కొబ్బరి నీళ్ళు అందుబాటులో ఉంటాయి. అయితే ఏవైనా ఒకటే కదా అని తాగేస్తున్నారా? కానీ ఈ రెండింటికీ చాలా తేడా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్ళు

ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్ళలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 330 ఎంఎల్ క్యాన్ లో 15 గ్రాముల చక్కెర ఉంటుంది. అంటే దాదాపు 4 స్పూన్ల చక్కెర. ఇవి పాశ్చరైజ్ చేయబడతాయి. ఆస్ట్రేలియన్ చట్టం ప్రకారం ఈ నీటిని ప్యాక్ చేసే ముందు పాశ్చరైజ్ చేయాలి. ఇది భద్రతకు చాలా అవసరం. ఎందుకంటే కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత ఆక్సీకరణం చెందుతుంది. బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. అందుకే, పాశ్చరైజేషన్ ద్వారా బ్యాక్టీరియాను తొలగిస్తారు. అయితే, ఈ ప్రక్రియ.. తాజా కొబ్బరి నీళ్ళ నుంచి మాత్రమే లభించే పోషకాలు, ఎలక్ట్రోలైట్ లను కూడా ఇది నాశనం చేస్తుంది. ఎందుకంటే ప్యాక్ చేసే ముందు కొబ్బరి నీళ్ళని ఒక నిమిషం పాటు వేడి చేస్తారు. కొన్ని కంపెనీలు అయితే కనీసం వాటిని నాలుగు నిమిషాల పాటు వేడి చేస్తారు. ఇలా చేయడం వల్ల షుగర్ కంటెంట్ మరింత పెరుగుతుంది. 

తాజా కొబ్బరి నీళ్ళ ప్రయోజనాలు

  • తాజా కొబ్బరి నీళ్ళలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, జింక్, సెలీనియం ఉంటాయి. ఇవి క్లోరైడ్ సీలు చేసిన కంటైనర్ కొబ్బరి నీళ్ళలో కనిపించే దానికంటే ఎక్కువగా ఉంటాయి.
  • తాజా కొబ్బరి నీళ్ళలో విటమిన్ బి2 ఉంటుంది. ఇది ప్రాసెస్ చేసిన కొబ్బరి నీటిలో ఉండదు. ఎందుకంటే విటమిన్ బి2 నీటిలో కరిగేది, కాంతి తగిలితే సులభంగా నాశనం అవుతుంది.
  • తాజా కొబ్బరి నీళ్ళలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉంటాయి. ఇక వాటి చక్కెర కంటెంట్ కొబ్బరి బోండాం వయసుని బట్టి ఆధారపడి ఉంటుంది.
  • క్యాన్డ్ కొబ్బరి నీళ్ళలో సుక్రోజ్ ఎక్కువగా ఉంటుంది.
  • కొబ్బరి నీళ్ళు పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
  • కొబ్బరి నీరు సెక్స్ హార్మోన్ ని ప్రేరేపించే ఎండోక్రైన్ ని విడుదల చేస్తుంది. ఇది స్త్రీ, పురుషుల పునరుత్పత్తి అవయవాలపై సానుకూల ప్రభావం చూపుతుందని తేలింది.
  • కొబ్బరి నీళ్ళను తాగడం వల్ల లైంగిక పనితీరు మెరుగుపడుతుంది. ఇందులోని ఖనిజాలు పొటాషియం, జింక్, మాంగనీస్, విటమిన్లు రక్తప్రసరణ వ్యవస్థ మెరుగ్గా పని చేయడంలో సహాయపడతాయి.

రెండింటిలో ఏది మంచిది?

ఈ విషయంలో ఎటువంటి సందేహం లేకుండా తాజా కొబ్బరి నీళ్ళు ఆరోగ్యకరమైనవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఎలక్ట్రోలైట్స్ కణాలు, కండరాలు, మెదడు, నరాల ఆరోగ్యకరమైన పనితీరుకు సహాయపడతాయి. ఎలక్ట్రోలైట్ తో పాటు కొబ్బరి నీళ్ళలో ఇతర ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు కూడా ఉన్నాయి. విటమిన్లు, బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. జీర్ణక్రియకు సహాయపడుతుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది. గుండెకి చాలా మేలు చేస్తాయి. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన పానీయాలలో కొబ్బరి నీళ్ళు ఒకటి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: వేసవిలో గుడ్లు తినొచ్చా? రోజుకి ఎన్ని తింటే ఆరోగ్యానికి మంచిది

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
Snake Gourd Dal : పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు
పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు
Yoga Poses for Lower Back : నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
Dussehra Navratri Day 4 :దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు నైవేద్యం.. శ్రీ మహాచండీ దేవికి ఇలా లడ్డూలు చేసి పెట్టేయండి
దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు నైవేద్యం.. శ్రీ మహాచండీ దేవికి ఇలా లడ్డూలు చేసి పెట్టేయండి

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget