Diwali Cleaning Tips : దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్‌గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
Easy Diwali Home Cleaning Guide : దీపావళికి ఇంటి శుభ్రతను ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? వంటగది, పడకగది అనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ చెక్ లిస్ట్‌ని ఫాలో అయిపోండి.

- దీపావళి శుభ్రతకు ముందు అనవసర వస్తువులు తొలగించాలి.
- పడకగది, వంటగది, బాత్రూమ్‌ను దశలవారీగా శుభ్రం చేయాలి.
- లివింగ్‌రూమ్, గోడలు, బాల్కనీ శుభ్రం చేసి అలంకరించాలి.
- చివరగా పూజా సామగ్రిని సిద్ధం చేసుకుని అలంకరణ ప్రారంభించండి.
Diwali Home Cleaning Checklist : దీపావళికి ఇంటిని అలంకరించాలంటే.. ముందుగా శుభ్రం చేయాలి. ఇంటి శుభ్రతను ప్రారంభించాలనుకుంటే ఫస్ట్ ఆలోచించేంది ఎక్కడ నుంచి పని మొదలు పెట్టాలి? ఇల్లంతా ఒకేసారి శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తే.. ఆ పని మరింత కష్టంగా మారవచ్చు. కాబట్టి ఇంటిని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసి.. ప్రతి గదిని క్లీన్ చేసుకోవడం ఈజీ అవుతుంది. శుభ్రం చేయడంలో ఏ టిప్స్ ఫాలో అయితే క్లీనింగ్ ఈజీగా ఉంటుందో చూసేద్దాం.
అవసరం లేనివి ఉంచకండి..
ముందుగా ఇంట్లోని అనవసరమైన వస్తువులను తీసేసి.. ఆ తర్వాత మీ గదులు, వంటగది, స్నానాలగది, ఇతర ప్రాంతాలను సమగ్రంగా శుభ్రం చేసుకోవచ్చు. కాబట్టి పాత న్యూస్ పేపర్స్, ఉపయోగించని వస్తువులు, దుస్తులు, విరిగిన లేదా పగిలిన వస్తువులు అన్నీ తీసేయండి. ఉపయోగించేవి.. రిపేర్ చేయాల్సినవి.. బయట వేసేవిగా డివైడ్ చేసుకుంటే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది.
Also Read : దీపావళి 2025 బెస్ట్ మేకప్ ట్రెండ్స్.. అమ్మాయిలు ఇలా ముస్తాబై ఫోటోలు దిగితే అదిరిపోతారు
ముందు బెడ్ రూమ్..
పడకగది నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేయవచ్చు. ముందుగా, బెడ్‌షీట్లు, దిండు కవర్లు, కుషన్ కవర్లు, కర్టెన్ల వంటి ఉతకగలిగే వస్తువులను ముందుగా తీసివేయండి. తరువాత సీలింగ్, ఫ్యాన్లు, గోడలు, ఫర్నిచర్, ఇతర వస్తువులపై ఉన్న దుమ్ము దులపండి. కిటికీలు, తలుపులు, అద్దాలు, అల్మరాలను శుభ్రం చేయండి. అల్మరాల నుంచి వస్తువులను తీసివేసి.. అరలను శుభ్రం చేసి, బట్టలను తిరిగి సర్దండి. మంచాల కింద, ఫర్నిచర్ వెనుక శుభ్రం చేయడం మర్చిపోకండి.
నెక్స్ట్ కిచెన్
దీపావళి సమయంలో ఇంట్లో స్వీట్లు, స్నాక్స్, ఇతర రకరకాల వంటకాలు తయారు చేస్తారు. కాబట్టి వంటగదిని శుభ్రపరచడం చాలా అవసరం. క్యాబినెట్లు, షెల్ఫ్‌లలో వస్తువులు సర్దుకోవాలి. గడువు ముగిసిన ఫుడ్, పాత ప్యాకేజీలు, ఉపయోగపడని వస్తువులను పడేయండి. ఫ్రిడ్జ్ లోపలి భాగాన్ని కూడా క్లీన్ చేయండి. మైక్రోవేవ్, గ్యాస్ స్టవ్, చిమ్నీలను శుభ్రం చేసుకోండి.
Also Read : దీపావళి 2025 స్పెషల్ స్వీట్స్.. అరగంటలోపు ఈజీగా చేయగలిగే రెసిపీలు ఇవే
బాత్రూం శుభ్రత
పడకగది, వంటగది తర్వాత స్నానాలగదిని శుభ్రం చేస్తే మంచిది. ముందుగా అరల నుంచి సీసాలు, బకెట్లు, ఇతర వస్తువులను తీసివేయండి. ఆ తర్వాత వాష్‌బేసిన్, టాయిలెట్, కుళాయిలు, షవర్ ప్రాంతం, స్నానాలగది టైల్స్‌ను శుభ్రం చేయండి. అలాగే అద్దాలు, గాజు ఉపరితలాలపై ఉన్న నీటి మరకలు, మచ్చలను కూడా శుభ్రం చేయండి. మూలలు, డ్రెయిన్‌లు, కుళాయిల చుట్టూ క్లీన్ చేయండి.
గోడలు, తలుపులు, కిటికీలు
ఇంటిని శుభ్రం చేసేటప్పుడు గోడలు, తలుపులు, కిటికీలను తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటారు. శుభ్రం చేయగలిగే గోడలను, డోర్ హ్యాండిల్స్, కిటికీ ఫ్రేమ్‌లు, గ్రిల్స్, అద్దాలను కూడా శుభ్రం చేయండి.
Also Read : దీపావళి తర్వాత చర్మాన్ని కాపాడుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్.. బెస్ట్ స్కిన్ కేర్ రొటీన్
లివింగ్ రూమ్ శుభ్రత
దీపావళి సమయంలో కుటుంబ సభ్యులు, అతిథులు ఎక్కువ సమయం గడిపేది లివింగ్ రూమ్‌లోనే. కాబట్టి దానిని క్షుణ్ణంగా శుభ్రం చేయండి. అనవసరమైన వస్తువులను తీసివేయండి. సోఫా, టేబుల్, షెల్ఫ్‌లు, టీవీ యూనిట్, ల్యాంప్‌షేడ్‌లు, అలంకరణ వస్తువులపై ఉన్న దుమ్మును తుడవండి. అవసరమైతే కర్టెన్లు, సోఫా కవర్లు, కుషన్ కవర్లు, రగ్గులను ఉతకండి. ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్ వెనుక ఉన్న ప్రదేశాన్ని కూడా శుభ్రం చేయండి.
బాల్కనీ కూడా ఇంట్లో భాగమే..
గదుల శుభ్రత పూర్తి అయిన తర్వాత తుడిచి, తడిపెట్టుకోండి. బాల్కనీని, ఇంటి బయట కూడా శుభ్రం చేయండి. ఎండిన ఆకులు, దుమ్ము, అనవసరమైన వస్తువులను తీసేయండి. రెయిలింగ్‌లు, తలుపులు, బయటి ఫర్నిచర్, కిటికీ గ్రిల్స్‌ను శుభ్రం చేయండి. మీ ఇంట్లో మొక్కలు ఉంటే.. ఎండిన ఆకులను తీసివేసి.. కుండీలను సర్దుకోండి.
ఇల్లు పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత.. దీపావళి అలంకరణ ప్రారంభించవచ్చు. ప్రధాన ద్వారం, కిటికీలు, బాల్కనీ దగ్గర దీపాలు, అలంకరణ లైట్లను పెట్టండి. గుమ్మానికి పువ్వులు, తోరణాలు, రంగోలితో అలంకరించండి. పూజకు ముందుగానే సిద్ధమవ్వండి. లక్ష్మీ, గణేశ విగ్రహాలను శుభ్రం చేసి.. అగరబత్తులు, దూది వత్తులు, పువ్వులు వంటి ఇతర అవసరమైన పూజా సామాగ్రిని సిద్ధం చేసుకుంటే సెట్.
Also Read : తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో.. దీపావళికి ఇంటిని ఇలా అందంగా మార్చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















