Oats Pakora Recipe: సాయంత్రం వేళ క్రిస్పీగా ఓట్స్ పకోడీ, చిటికెలో చేసేయచ్చు
(Oats Pakora Recipe) ఓట్స్ తో చేసుకునే టేస్టీ వంటకం ఇది. సాయంత్రం వేళ తింటే భలే మజాగా ఉంటుంది.
Oats Pakora Recipe: ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలలో ఓట్స్ కూడా ఒకటి. ఓట్స్ తో చేసిన వంటకాలు రుచిగా కూడా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇలాంటివి మేలు చేస్తాయి. ఓట్స్ తో ఎప్పుడూ ఓకేలాంటి పదార్థాలు చేసుకుని తింటున్నారా? ఓసారి ఇలా ఓట్స్ పకోడి ప్రయత్నించండి. కరకరలాడుతూ క్రిస్పీగా తెగ నచ్చేస్తుంది. చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ముందుగా ఓట్స్ ను నానబెట్టుకోవాడమే పని. ఆ తరువాత అరగంటలో పకోడీ రెడీ అయిపోతుంది.
కావాల్సిన పదార్ధాలు
ఓట్స్ - ఒక కప్పు
బియ్యం పిండి - అర కప్పు
శెనగ పిండి - అర కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు
అల్లం తరుగు - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
పచ్చిమిర్చి - నాలుగు
కరివేపాకు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - రెండు స్పూనులు
నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
కావాల్సిన పదార్థాలు
1. ఓట్స్ ను వేడి నీళ్లలో గంట సేపు నానబెట్టాలి.
2. గంట తరువాత ఓట్స్ లోని నీళ్లు ఒంపేసి, అందులో శెనగపిండి, బియ్యం పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.
3. పకోడీలకు పిండి ఏ విధంగా కలుపుకుంటారో అదే విధంగా కలుపుకోవాలి.
4. అందులో ఉల్లి తరుగు, కొత్తిమీరు తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి అన్ని వేసి బాగా కలపాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కాక మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి.
6. బంగారు రంగులోకి మారాకా తీసి సర్వ్ చేయాలి.
వీటి రుచి సాధారణ పకోడీల కన్నా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు కూడా తినిపించవచ్చు.
ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం. ఓట్స్ తో చేసే వంటకాలు ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడతాయి. వీటిలో ఎముకలకు మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు దాగున్నాయి. ఓట్స్ నిజానికి మనదేశంలో పండవు. వేరే దేశం నుంచి దిగుమతి చేసుకుంటాం. వీటిని మనం 19వ శతాబ్ధం నుంచి వాడడం మొదలుపెట్టాం. అంతకుముందు వీటి గురించి భారతీయులకు అవగాహన లేదు. ఆధునిక కాలంలో వీటి వాడకం చాలా ఎక్కువైంది. బరువు తగ్గాలనుకునేవారు, గుండె జబ్బులున్నవారు, మధుమేహం ఉన్న వారు ప్రత్యేకంగా ఓట్స్ తో చేసిన వంటకాలు తింటున్నారు.
Also read: బొప్పాయి, నిమ్మరసం కలిపి తినకూడదా? విషంగా మారుతుందా?