Belly Fat: ఎంత ప్రయత్నిస్తున్నా పొట్ట తగ్గడం లేదా? దానికి ఈ అలవాట్లే కారణం
అధిక బరువు ఉన్న వారిలో ఎక్కువ కొవ్వు పొట్ట భాగంలోనే ఉంటుంది.
ప్రపంచంలో ఎక్కువ శాతం మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు పెరగడంతో పాటూ అనేక ఆరోగ్య సమస్యలు కూడా దాడి చేస్తాయి. శరీరంలో కొవ్వు పెరగుతుంటే హైబీపీ, మధుమేహం, గుండె సమస్యలు వంటివి కూడా వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. నడక, ఆహారంలో మార్పులు, కొన్ని రకాల ప్రత్యేక వ్యాయామాలు చేయడం ద్వారా పొట్ట కొవ్వును కరిగించుకోవచ్చు. అయితే కొందరిలో ఎంత కష్టపడుతున్నా బరువు తగ్గరు. పొట్ట కొవ్వు కూడా అలాగే ఉంటుంది. కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కవుట్లు చేస్తున్నా ఫలితం కనిపించదు. ఇలాంటి వారు చాలా నిరుత్సాహానికి గురవుతారు. బరువు తగ్గే ప్రయాణంలో మీరు చేసే కొన్ని తప్పులే పొట్ట కొవ్వును కరగకుండా అడ్డుపడతాయి. వాటిని తప్పులు అనలేము కానీ అలవాట్లనే చెప్పుకోవాలి. కింద చెప్పిన అలవాట్లు మీకుంటే వెంటనే మార్చుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గే అవకాశం ఉంది.
చక్కెర, కార్బోహైడ్రేట్లు
తినే ఆహారంలో చక్కెర, కార్బోహైడ్రేట్ల అధికంగా ఉంటే మీరు ఎన్ని వ్యాయామాలు చేసినా పొట్ట కొవ్వు కరగదు. ఈ రెండింటినీ ఎంత తగ్గిస్తే బరువు తగ్గడం అంత సులువవుతుంది. పాస్తా, వైట్ బ్రెడ్, బర్గర్లు, డిజర్ట్ లు వంటివి ఆహారంలో తక్కువ తినాలి. ఈ ఆహారాల్లో చక్కెర, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కొవ్వు కణాలు వేగంగా పరిపక్వం చెంది మరింతగా పొట్ట దగ్గర పేరుకుపోతాయి. వీటిని దూరంగా ఉంటే కొవ్వు కరిగిపోతుంది.
చక్కటి జీవనశైలి
ఆరోగ్యకరమైన ఆహారం, వర్కవుట్స్, నడక వంటివి చక్కటి జీవనశైలిలోకి వస్తాయి. ఒకే చోట గంటలు పాటూ కూర్చొని ఉండడం బరువు పెరగడంతో పాటూ ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి. ఎక్కడైనా రెండు గంటల కన్నా ఎక్కువ కూర్చోకుండా మధ్యమధ్యలో నడవాలి. విసెరల్ కొవ్వు కరగడంలో వాకింగ్ చాలా మేలు చేస్తుంది. పొట్ట దగ్గర పట్టేది విసెరల్ కొవ్వు.
నో ఆల్కహాల్
పొట్ట దగ్గర కొవ్వు పెరగడాన్ని ఆల్కహాల్ మరింత వేగవంతం చేస్తుంది. పొట్ట తగ్గడానికి వ్యాయామం చేస్తూ, మరో పక్క ఆల్కహాల్ తాగడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరగదు సరికదా, ఇంకా పెరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే వెంటనే ఆల్కహాల్ మానేయాలి. దీన్ని తాగడం వల్ల కాలేయం కొవ్వులు, పిండి పదార్థాలను కాలేయం ప్రాసెస్ చేసే విధానం కూడా ప్రభావితం అవుతుంది. కొవ్వును కాల్చే సామర్థ్యాన్ని 70 తగ్గించేస్తుంది ఆల్కహాల్.
నిద్ర తగ్గినా...
తగినంత నిద్ర లేక పోయినా కూడా పొట్ట కొవ్వు కరిగే వేగం తగ్గుతుంది. శరీరానికి తగినంత విశ్రాంతి లేనప్పుడు ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ విడుదలవుతుంది. దీని వల్ల పొట్ట చుట్టూ కొవ్వు నిలిచిపోతుంది. కాబట్టి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం.
Also read: అమ్మను పెళ్లి దుస్తుల్లో అలా చూసి, నిజమైన ఆనందం అంటే ఇది, వీడియో చూడాల్సిందే