Kidney Cancer: రాత్రిపూట అతిగా చెమటలు పడుతున్నాయా? ఆ ప్రాణాంతక వ్యాధికి ఇది సంకేతం!
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం కిడ్నీ క్యాన్సర్ ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాదు. జీవిత కాలంలో ఈ ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం 2 శాతం కంటే తక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
కిడ్నీకి సంబంధించిన ఏదైనా వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే దీనికి వచ్చిన జబ్బు లక్షణాలు ఎవరు పెద్దగా గుర్తు పట్టలేరు. వ్యాధి చివరి దశకు చేరుకునే వరకు దీన్ని గుర్తించడం కష్టం. శరీరంలోని వ్యర్థాలని ఫిల్టర్ చేసి బయటకి పంపద్యంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకుండా శరీరాన్ని నాశనం చేసే ప్రాణాంతక వ్యాధి కిడ్నీ క్యాన్సర్. దీన్ని గుర్తించడం చాలా కష్టం. కానీ ఒకే ఒక సంకేతం ద్వారా వ్యాధిని గుర్తించగలమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాత్రిపూట ఈ లక్షణం కనిపిస్తుంది
కిడ్నీ లేదా మూత్రపిండ క్యాన్సర్ ని కనిపెట్టగలిగే ఒకే ఒక విచిత్రమైన లక్షణం రాత్రిపూట మాత్రమే కనిపిస్తుంది. వృద్ధాప్యం, ఊబకాయం, ధూమపానం, అధిక రక్తపోటు వంటివి మూత్రపిండాల క్యాన్సర్ అభివృద్ది ప్రమాదాన్ని పెంచుతాయి. రాత్రిపూట విపరీతమైన చెమటతో బాధపడుతుంటే మాత్రం అది ప్రాణాంతకమైన కిడ్నీ క్యాన్సర్ కి ప్రధాన సూచికని వైద్యులు చెబుతున్నారు.
రాత్రిపూట చెమటకి, కిడ్నీ క్యాన్సర్ కి సంబంధం ఏంటి?
చెమట అనేది సాధారణంగా శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది ప్రతి ఒక్కరికీ జరుగుతుంది. కానీ రాత్రిపూట చెమటలు పట్టడం మాత్రం సాధారణమైన విషయం కాదు. చెమటలో స్నానం చేసినట్టుగా అనిపిస్తుంది. గది చల్లగా సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ చెమటలు మాత్రం విపరీతంగా వచ్చేస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లు రాత్రిపూట చెమటలు ఎందుకు కలిగిస్తాయో స్పష్టమైన కారణం లేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. శరీరం క్యాన్సర్ తో పోరాడేందుకు ప్రయత్నించినప్పుడు ఇది జరుగుతుంది. హార్మోన్లలో మార్పులు కూడా ఒక కారణం కావచ్చు.
క్యాన్సర్ లో జ్వరం కూడా సాధారణం. ఫీవర్ తగ్గేందుకు శరీరం చల్లబడటానికి ప్రయత్నించినప్పుడు శరీరం అధిక చెమట పట్టేలా చేస్తుంది. అనేక సందర్భాల్లో కీమోథెరపీ, హార్మోన్లను మార్చే మందులు, మార్ఫిన్ వంటి క్యాన్సర్ చికిత్స వల్ల కూడా రాత్రి చెమటలు పడతాయి.
కిడ్నీ క్యాన్సర్ ఇతర సంకేతాలు
భారత్ లో మూత్రపిండాల క్యాన్సర్ రేటు పురుషులలో 10,354 కాగా, స్త్రీలలో 6507 గా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అలాగే 50-70 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు కూడా దీని బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని యూకేలోని క్యాన్సర్ పరిశోధన సంస్థ చెబుతోంది. దేశంలో ప్రతి సంవత్సరం సగం కంటే తక్కువ అంటే 42 శాతం కిడ్నీ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఊబకాయం, ధూమపానం వంటి ప్రమాద కారకాలతో ఈ క్యాన్సర్ ముడి పడి ఉంది. మూత్రపిండ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు..
☀ వెన్నునొప్పి
☀ పొత్తికడుపు, వెనుక వీపు భాగంలో నోపయి
☀ దీర్ఘకాలిక అలసట
☀ కారణం లేకుండానే బరువు తగ్గడం
☀ చీలమండల వాపు
☀ ఫ్లూ లేదా వెన్ను గాయం వంటి ఇతర అనారోగ్యాలు
☀ క్యాన్సర్ పరిశోధన ప్రకారం మూత్రంలో రక్తం లేదా హెమటూరియా. టాయిలెట్ కి వెళ్ళిన ప్రతీ సారీ రక్తాన్ని గమనించాల్సిన అవసరం లేదు కాలక్రమేణా అది మరింత ఎక్కువగా కనిపిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: కొలెస్ట్రాల్ ఎన్ని రకాలు? ఏ స్థాయి వరకు ఉంటే ఆరోగ్యంగా ఉంటారు?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial