Covid 19 Vaccine: వీడెవడండి బాబు! ఒకే రోజు 10 కోవిడ్ వ్యాక్సిన్లు వేయించుకున్నాడు.. ఉన్నాడా? పోయాడా?
ఒక్క డోసుకే జ్వరంతో విలవిల్లాడతాం. కానీ, ఓ వ్యక్తి ఒకే రోజు ఏకంగా 10 వ్యాక్సిన్లు వేయించుకుని అధికారులను ఆశ్చర్యపరిచాడు.
కోవిడ్-19 వ్యాక్సిన్(Covid 19 Vaccine) ఎంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందో తెలిసిందే. అందుకే వైద్యులు.. వ్యాక్సిన్‌కు వ్యాక్సిన్‌కు మధ్య కనీసం రెండు నుంచి మూడు నెలలు గ్యాప్ ఉండాలని చెబుతారు. మోతాదు పెరిగితే.. రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అలాంటిది ఓ వ్యక్తి ఒకే రోజు 10 వ్యాక్సిన్లు వేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరి, అతడి పరిస్థితి ఎలా ఉంది? ఉన్నాడా.. పోయాడా?
న్యూజిలాండ్(New Zealand)కు కోవిడ్-19 వ్యాక్సిన్ల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రజలంతా క్రిస్ట్‌మస్ లోగా వ్యాక్సిన్లు వేసుకుని.. పండగ చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అయితే, కొందరు వ్యాక్సిన్లను తీసుకోకుండా.. కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సేవలను పొందేందుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్లు తప్పనిసరి అని స్థానిక సర్కారు రూల్ పెట్టింది. దీంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో వ్యాక్సిన్లు తీసుకుని సర్టిఫికెట్‌ను పొందుతున్నారు. అయితే, కొందరు అతి తెలివి ప్రదర్శించి.. తమకు బదులుగా వేరే వ్యక్తులను పంపుతున్నారు. దీంతో కొందరు దీన్ని సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బులిచ్చే వ్యక్తికి బదులుగా వ్యాక్సిన్లు పొందుతున్నారు. ఇలా ఓ వ్యక్తి ఒకే రోజు 10 వ్యాక్సిన్లు తీసుకున్నాడు.
న్యూజిలాండ్‌కు చెందిన ఓ వార్త సంస్థ తెలిపిన వివరాలు ప్రకారం.. ఓ వ్యక్తి ఆక్లాండ్(Auckland)లోని వివిధ వ్యాక్సిన్ సెంటర్లకు వెళ్లి.. వేరే వ్యక్తులకు బదులు వ్యాక్సిన్లు తీసుకున్నాడు. ఇందుకు ఆయా వ్యక్తుల నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు. అదేంటీ.. మన ఇండియాలో ఆధార్ ఉంటేగానీ వ్యాక్సిన్ వేయరు. అలాంటిది.. న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఒకరికి బదులు మరొకరికి వ్యాక్సిన్ ఎలా వేసేస్తారనేగా మీ సందేహం? ఎందుకంటే.. అక్కడి హెల్త్ వర్కర్లు కేవలం వ్యక్తి పేరు, పుట్టిన రోజు, చిరునామా చెబితే చాలు. ఫొటో గుర్తింపు కార్డు అవసరం లేదు. దీంతో వాళ్లను సులభంగా మోసం చేస్తున్నారు. అయినా.. ఒకే వ్యాక్సిన్ అన్నిసార్లు ఎవరు తీసుకుంటారులే అనే లాజిక్ కూడా ఈ నిర్లక్ష్యానికి కారణమైంది.
Also Read: ఒమిక్రాన్‌పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!
అంతేగాక.. అక్కడ చాలామంది నిరాశ్రయులకు ఐడెంటీ కార్డులు లేవు. దాని వల్ల.. ఫొటో ఐడీ తప్పనిసరే అనే రూల్ పెట్టి.. వారిని వ్యాక్సినేషన్‌కు దూరం పెట్టకూడదని ప్రభుత్వం భావించింది. దీన్ని కొందరు అవకాశంగా తీసుకుని ఈ విధంగా చీట్ చేస్తున్నారు. మరి అన్ని వ్యాక్సిన్లు తీసుకున్న అతడి పరిస్థితి ఎలా ఉందనేగా మీ సందేహం? దీనిపై అతడికి వ్యాక్సిన్లు వేసిన హెల్త్ వర్కర్లు స్పందిస్తూ.. ‘‘అన్ని వ్యాక్సిన్లు తీసుకున్న అతడి ప్రాణాలకు ప్రమాదం లేదు. అయితే, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఇతర సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇంకా ఇలా పదే పదే వ్యాక్సిన్లు తీసుకున్నవారి వివరాలు కనుగొని.. వారిని అబ్జర్వేషన్లో ఉంచాలి’’ అని తెలిపారు. హమ్మయ్య.. అతడు మొత్తానికి బతికే ఉన్నాడు. ఇప్పుడు ఒమిక్రాన్ సోకినా.. అతడిని తట్టుకోలేదేమో!
Read also: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు.. ఆపండ్రా మీ అరాచకం!
Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి