By: ABP Desam | Updated at : 05 May 2023 06:00 AM (IST)
Image Credit: Pixabay
మెదడు పనితీరు బాగుండాలంటే రోజుకొక మూడు వాల్ నట్స్ తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇది ఇప్పుడు నిజమని మరోసారి రుజువైంది. వారానికి కనీసం మూడు సార్లు కొద్దిపాటి వాల్ నట్స్ తినే అబ్బాయిలు, అమ్మాయిల్లో ఏకాగ్రత, అభిజ్ఞా పనితీరులో మెరుగుదల కనిపించాయని స్పానిష్ పరిశోధకుల నేతృత్వంలోని ఒక అధ్యయనం సూచిస్తుంది. అదీ కూడా కౌమారదశలో ఉన్న వాళ్ళు తింటే మానసిక పరిపక్వతకు దోహదపడుతుందని తెలిపారు.
ప్రతి ఒక్కరికీ కౌమారదశ చాలా కీలకమైనది. అబ్బాయి లేదా అమ్మాయి ఆలోచన విధానం ఎలా ఉంటుందనే దాని మీద దృష్టి సారించాల్సిన సమయం. ఇటువంటి కీలకమైన టైమ్ లో మెదడు ఆరోగ్యం, చదువు మీద శ్రద్ధ, ఏకాగ్రత చాలా ముఖ్యం. అందుకోసం వాల్ నట్స్ చక్కగా పని చేస్తాయని మునుపటి అధ్యయనాలు వెల్లడించాయి. వాల్ నట్స్ లో ఆల్ఫా లినోలెనిక్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు అభివృద్ధిలో ముఖ్యంగా కౌమారదశలో ప్రాథమిక పాత్ర పోషిస్తాయి.
కౌమారదశ అనేది జీవసంబంధమైన మార్పుల సమయం. హార్మోన్లలో మార్పులు జరిగే టైమ్ ఇదే. ఫ్రంటల్ లోబ సినాప్టిక్ పెరుగుదలను ప్రేరేపిస్తుంది. మెదడులో ఈ భాగం ఉంటుంది. ఇది పరిపక్వత చెందేందుకు న్యూరాన్లకు ఈ రకమైన ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉపయోగపడతాయి. వాల్ నట్స్ లో ఉండే పోషకాలు బలమైన సినా ప్సెస్ ని ఏర్పరుస్తాయని పరిశోధకులు తెలిపారు. బార్సిలోనాలోని 12 వేర్వేరు ఉన్నత పాఠశాలల నుంచి 11-16 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 700 మంది విద్యార్థుల బృందం ఈ అధ్యయనంలో పాల్గొంది. వారికి 30 గ్రాముల వాల్ నట్స్ ఉన్న సాచెట్ ని అందించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న యువకులు ఆరు నెలల పాటు ప్రతిరోజూ వాటిని తినాలని చెప్పారు.
కౌమారదశలో ఉన్న వాళ్ళు కనీసం 100 రోజుల పాటు వాల్ నట్స్ తిన్నారు. వారిలో శ్రద్ధ, ఏకాగ్రత పెరిగింది. అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) లక్షణాలు ఉన్న వారి ప్రవర్తనలో గణనీయంగా మార్పులు చోటు చేసుకున్నాయని బృందం గుర్తించింది. నిపుణులు చెప్పిన మార్గదర్శకాలను అనుసరించిన వారిలో న్యూరోసైకలాజికల్ ఫంక్షన్లలో మెరుగుదల కనిపించినట్టు పరిశోధన బృందం తెలిపింది. వారానికి కనీసం మూడు సార్లు తింటే అభిజ్ఞా సామర్థ్యాలలో అనేక గణనీయమైన మెరుగుదల గమనించారు. యుక్తవయసులో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడంలో వాల్ నట్స్ సహాయపడతాయి.
వాల్ నట్స్ వల్ల మరిన్ని ప్రయోజనాలు
డిప్రెషన్, ఒత్తిడి బారిన పడిన వాళ్ళు తరచూ వాల్ నట్స్ తింటే మానసిక ఆరోగ్యంపై ప్రభావవంతంగా పని చేస్తాయి. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు రోజూ నాలుగు నట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల రక్తంలో చక్కెరస్థాయిలు పెరగకుండా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ,బి6, కాపర్, సెలీనియం, మాంగనీస్ మొదలైన పోషకాలు లభిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఆ విటమిన్ లోపిస్తే పిల్లలు పుట్టడం కష్టమా? దీన్ని అధిగమించడం ఎలా?
Ghee: ఈ సమస్యలు ఉంటే నెయ్యి తినడం తగ్గించాల్సిందే
Skin Glow: చర్మం మెరిసిపోవాలంటే రోజూ తినాల్సిన ఆహారాలు ఇవిగో
Chai-Biscuit: ఛాయ్‌తో బిస్కెట్స్ కలిపి తీసుకుంటున్నారా? మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందే
Air Conditioning: వేసవిలో ఏసీ లేకుండానే మీ రూమ్ ఇలా చల్లబరుచుకోవచ్చు
White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే
Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!
Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?
Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్