అన్వేషించండి

Nettle Leaf Benefits : మధుమేహాన్ని, కీళ్లనొప్పులను దూరం చేసే హెర్బల్ టీ.. దీనిని ఎలా తయారు చేయాలంటే

Nettle Leaf in Telugu : హెల్త్ బెనిఫిట్స్ కోసం నేటిల్స్ లీఫ్(రేగుట ఆకుల)ను ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. రెగ్యూలర్​గా నేటిల్స్ లీఫ్ టీని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

Nettle Leaf Tea Health Benefits in telugu : ఉదయాన్నే లేచి టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే అలాంటివారు రోటీన్​ టీలకు బదులు కొన్ని హెర్బల్స్ టీతో రోజును ప్రారంభించి.. హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. అలాంటి హెర్బల్ టీలలో నేటిల్స్ లీఫ్ టీ ఒకటి. దీనినే తెలుగులో రేగుట ఆకుల టీ అని కూడా అంటారు. నిజం చెప్పాలంటే.. ఇది చైనా నుంచి ఫేమస్ అయింది. వందల ఏళ్లుగా దీనిని వివిధ ప్రయోజనాల కోసం తీసుకుంటూ ఉంటారు. దీని రుచి, లక్షణాలు, ప్రయోజనాలు.. ఈ టీని ఎలా తయారు చేసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

నేటిల్స్ లీఫ్ టీ తయారీ విధానం

ముందుగా స్టౌవ్ వెలిగించి.. దానిపై ఓ గిన్నెలో నీటిని పోసి మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు దానిలో ఒక టేబుల్ స్పూన్ రేగుట ఆకులు వేయాలి. వాటిని పది నిమిషాలు మరగనివ్వాలి. అనంతరం వడకట్టి సర్వ్ చేసుకోవాలి. దీనిలో మీరు అవసరమనుకుంటే ఓ స్పూన్ తేనెను, నిమ్మరసం వేసి కలిపి తీసుకోవచ్చు. ఈ ఆకులలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ముఖ్యంగా రేగుట ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ కె ప్రధానంగా ఉంటుంది. 

రేగుట ఆకుల టీతో ప్రయోజనాలు ఇవే

ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. కీళ్ల నొప్పులు, రక్తహీనత, తామర వంటి స్కిన్ సమస్యలను నయం చేయడంలో ఇది ఎన్నో మంచి ఫలితాలు ఇస్తుంది. నేటిల్స్ లీఫ్​లలో కాల్షియం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల వ్యాధి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇతర ప్రయోజనాల కోసం కూడా దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటారు. దీనిలోని విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా వివిధ రకాల క్యాన్సర్ల నుంచి కూడా రక్షిస్తుంది. దీనిలోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనాలు అందిస్తుంది. 

రక్తపోటును కంట్రోల్​లో ఉంచడంలో ఈ హెర్బల్ టీ మంచి ప్రయోజనాలు అందిస్తుంది. మూత్రనాళం నుంచి.. హానికరమైన బ్యాక్టీరియాను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. పురుషులలో ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు ఉంటే.. ఇది మంచి పరిష్కారాన్ని అందిస్తుంది. ఆర్థరైటిస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు, నొప్పి, కండరాల సమస్యలు ఉన్నవారు ఈ రేగుట టీతో ఉపశమనం పొందుతారని.. ఆర్థరైటిస్ ఫౌండేషన్ తెలిపింది. మధుమేహంతో ఇబ్బంది పడేవారు కూడా ఈ టీని రెగ్యూలర్​గా తీసుకువోచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్​లో ఉంచుతుంది. ఊబకాయం, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. 

ఎంత పరిమాణంలో తీసుకోవాలి?

నెటిల్ లీఫ్​ టీని తీసుకోవడానికి ప్రత్యేక పరిమాణం ఏమి లేదు. కానీ 1 కప్పు టీని రోజుకు మూడుసార్లు, క్యాప్యూల్స్​గా తీసుకుంటే.. రోజుకు 1,300 మిల్లీగ్రాముల వరకు తీసుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. అయితే ఈ ఆకులను నేరుగా పట్టుకోవాలనుకుంటే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాటికి చిన్న, మెత్తని ముళ్లు మాదిరిగా ఉంటాయి. ఆకును పట్టుకున్నప్పుడు అది మీకు అలెర్జీలను కలిగించే అవకాశముంది. వీటిని మీరు తీసుకునే ముందు వైద్యులను సంప్రదిస్తే మంచిది. వీటివల్ల మీకు అలెర్జీలు వస్తాయా? లేదా? అనే విషయాలు అడిగి తెలుసుకుంటే మంచిది. 

Also Read : రెండు లక్షల మందితో ప్రారంభమైన ఉద్యమాన్నే ఇప్పుడు ప్రపంచమంతా మేడేగా చేసుకుంటుంది.. ఈ ఏడాది థీమ్​ ఏంటో తెలుసా? 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget