Ayurvedic Remedies : మీ ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే చాలు వర్షాకాలంలో ఎలాంటి రోగాలు మీ దరి చేరవు
Home Remedies For Cold And Flu : వర్షాలు పడుతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా ఫ్లూ, దగ్గు, జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లను రాకుండా ఉండేందుకు ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి.
Ayurvedic Remedies : వర్షాకాలం అంటువ్యాధులను మోసుకువస్తుంది. ఈ కాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచుకోవాలి. లేదంటే రకరకాల ఇన్ఫెక్షన్ల సోకితే..ఆసుపత్రులు మనల్ని ఆహ్వానిస్తుంటాయి. కాబట్టి ఈ సీజన్ లో వచ్చే జలుబు, ఫ్లూ ప్రమాదం నుంచి తప్పించుకునే ఉపాయాలెన్నో ఉన్నాయి. పర్యావరణ పరిస్థితులు, వాతావరణ మార్పుల వల్ల ఈ ఇన్ఫెక్షన్లు తీవ్రమవుతుంటాయి. పరిశుభ్రతను పాటించడంతోపాటు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను మెయింటైన్ చేయడం చాలా ముఖ్యంగా.
వైరల్ ఇన్ఫెక్షన్లు, గొంతులో నొప్పి, దగ్గు, జలుబు, ఇవన్నీ కూడా వాతావరణంలో మార్పులు వల్ల ప్రతీసారి ఎదుర్కొవల్సిన సమస్యలే. మీర ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయి. వీటితోపాటు వైరల్ ఫీవర్లు, ఫ్లూ, కడుపు నొప్పి వంటి ఇన్ఫెక్షన్లను కూడా ఈ కాలం మరింత ఎక్కువగా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ అనేది అత్యంత సాధారణ జ్వరం. జ్వరం అనేది ఒక రకమైన బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ తో పోరాడటానికి ప్రయత్నిస్తుందనే దానికి సంకేతం ఇస్తుంది. ఈ వర్షాకాలంలో జలుబు, ఫ్లూ వంటి సాధారణ జబ్బుల నుంచి త్వరగా కోలుకునేందుకు సహాయపడే అనేక ఆయుర్వేద చిట్కాలు ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో వేధించే జలుబు, ఫ్లూ కోసం కొన్ని ఆయుర్వేద టిప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.
తులసి:
తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్‌లతో పోరాడే లక్షణాలు తులసిలో పుష్కలంగా ఉన్నాయి. మీరు జలుబు, దగ్గు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే తులసి ఆకులను తింటే ఉపశమనం ఉంటుంది. తులసి యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. కాలానుగుణ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
అల్లం టీ:
అల్లం టీ ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే షోగోల్స్, జింజెరాల్స్ వంటి సమ్మేళనాలు వాటి ఔషధ గుణాలను శరీరంలోకి విడుదల చేస్తాయి. ఫ్లూ, సాధారణ జలుబు లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తాయి. తాజా అల్లం ముక్కలను వేడినీటిలో వేసుకుని తాగవచ్చు లేదంటే అల్లంతో తయారు చేసిన టీని తాగవచ్చు.
పసుపు:
పసుపు సహజ హోం రెమెడీ. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గోరువెచ్చని పాలలో చిటికెడ్ పసుపు కలుపుకుని తాగితే.. మంట, కీళ్ల అసౌకర్యం, కడుపు సమస్యలు, ఫ్లూ, సాధారణ జలుబులతో సహా అనేక రకాల వ్యాధులను నయం అవుతాయి.
ఉసిరి:
ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి రోగనిరోధక శక్తిని, జీవక్రియను బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గుకు కారణమయ్యే సూక్ష్మక్రిములను దూరం చేస్తాయి.అనేక అనారోగ్యాలను దూరం చేయడానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. శరీరం మరింత తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహిస్తుంది.
అవిసె గింజలు:
అవిసెగింజల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి ఫ్లూ, జలుబుకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ..బాక్టీరియా, ఫ్లూ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. మీరు ఒక కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలను ఉడకబెట్టి పానీయం తీసుకుంటే ఎంతో ఉపశమనం ఉంటుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు అధ్యయనాలు, జర్నల్స్ నుంచి సేకరించిన అంశాలను యథావిధిగా ఇక్కడ అందించాం. ఇలాంటి సమస్యలపై నిపుణులను సంప్రదించాలని మనవి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’ లేదా ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.