News
News
X

మీ గోర్లు ఇలా మారితే యమ డేంజర్.. వెంటనే చెక్ చేసుకోండి

మీ చేతి గోర్లు రంగు మారినా, మచ్చలు ఏర్పడినా.. చివరికి బొడిపెలు, గీతలు వంటివి ఏర్పడినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

FOLLOW US: 

మనం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. వైరస్‌లు దాడి చేస్తున్న ఈ రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే.. మన శరీరంలో వివిధ వస్తువులను తాకేది మన చేతులే. చేతికి అంటుకొనే మలినాలు చాలా సులభంగా వ్యాధులు కలిగిస్తాయి. గోళ్లల్లో తిష్ట వేసి ఆహారం తీసుకొనేప్పుడు చేతుల ద్వారా శరీరంలోకి చేరతాయి. విదేశీయులు ఆహారాన్ని చేతి ద్వారా తీసుకోకపోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే. కాబట్టి.. ఎప్పటికప్పుడు గోర్లను తొలగించుకోవాలి. మట్టి, మలినాలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అయితే, మీ చేతి గోళ్ల ద్వారా మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో కూడా తెలుసుకోవచ్చనే సంగతి మీకు తెలుసా? ఔనండి.. మీ చేతి గోర్లు రంగు మారినా, మచ్చలు ఏర్పడినా.. చివరికి బొడిపెలు, గీతలు వంటివి ఏర్పడినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలి. ఎందుకంటే.. మీ గోర్లు శరీరంలోని అంతర్లీన సమస్యలను సూచిస్తాయి. మరి చేతి వేళ్ల గోళ్లలో కనిపించే మార్పులు, అవి ఏయే సమస్యలకు సంకేతామో తెలుసుకుందామా. 

గోర్ల ఎదుగుదల నిలిచిపోవడం: కొంతమందికి గోర్లు పూర్తిగా ఎదగకుండా పాలిపోయి కనిపిస్తాయి. ఇది గుండె, కాలేయ సమస్యలకు సంకేతం. రక్తహీనత, పోషకాహర లోపంతో బాధపడేవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. 


గోళ్లపై తెల్ల మచ్చలు: చాలామంది గోర్లపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. కొన్నిసార్లు గాయాల వల్ల కూడా అలాంటి మచ్చలు ఏర్పడతాయి. బియ్యం గింజ తరహాలో సన్నగా, తెల్లగా ఉండే ఈ మచ్చలు గోళ్లపై కనిపిస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి.. వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. 

పసుపు రంగు గోళ్లు: కొంతమంది గోళ్లు పసుపు రంగులో మారుతాయి. ఇది డయాబెటిస్, శ్వాసకోశ వ్యాధులకు సంకేతం. అలాగే, నెయిల్ పాలిష్ ఎక్కువగా ఉపయోగించినా, అతిగా స్మోకింగ్ చేసినా.. ఈ సమస్య ఏర్పడుతుంది. వయస్సు పెరిగేవారిలో కూడా గోళ్లు పసుపు రంగులోకి మారతాయి.  

News Reels

గోళ్లపై గుంతలు: గోళ్ల మధ్య చొట్టలుగా ఉంటాయి. అంటే చిన్న గుంటలా ఏర్పడతాయి. ఇలాంటి గోర్లు కలిగిన వ్యక్తులు రీటర్స్ సిండ్రోమ్ అనే కణజాల రుగ్మతతో బాధపడే అవకాశాలు ఉంటాయి. సొరియాసిస్ సమస్యతో బాధపడేవారి గోళ్లపై కూడా ఇలాంటి గుంతలు ఏర్పడతాయి.  

గోర్లపై గీతలు: ఎవరైనా చేతిని తొక్కినప్పుడు గీతల్లాంటివి ఏర్పడతాయి. ఒట్టి చేతులతో మట్టి తవ్వినప్పుడు ఏర్పడే గీతల తరహాలో అవి ఉంటాయి. దీన్నే ‘నెయిల్ పీలింగ్’ అని కూడా అంటారు. నిత్యం మీ  గోర్లు అలా మారిపోతుంటే.. మీకు ఐరన్ లోపం ఉన్నట్లు. కాబట్టి.. వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం బెటర్. గోళ్లపై నీలం రంగు గీతలు కనిపిస్తే శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గినట్లు తెలుసుకోవాలి.

గోర్లపై నిలువు గీతలు: మీ గోర్లపై స్కేలుతో గీసినట్లుగా నిలువుగా లేదా అడ్డంగా గీతలు కనిపిస్తున్నట్లయితే అప్రమత్తంగా ఉండాలి. అది మూత్రపిండాల వ్యాధికి సూచిక కావచ్చు. ఆందోళన, అలసట, బరువు తగ్గడం, మధుమేహం, అధిక మూత్రవిసర్జన వంటి సమస్యలను కూడా ఇది సూచిస్తుంది.

గోర్లు విరగడం: కొంతమంది గోర్లు చాలా సున్నితంగా, పెళుసుగా ఉంటాయి. కొంచె పెరిగినా విరిగిపోతాయి. గోరుకు ఒక కొన వైపు నుంచి సన్నగా చీలకలు ఏర్పడతాయి. విటమిన్లు లేదా బయోటిన్ సప్లిమెంట్ల సమస్యల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. చేతులను ఎక్కువగా నీటిలో ముంచేవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. కాల్షియం, విటమిన్-డి, జింక్ లోపం ఉన్నా సరే గోళ్లు విరిగిపోతాయి. 

Also Read: కన్యత్వాన్ని తిరిగి పొందవచ్చా? వర్జినిటీ రిపేర్ పేరుతో వైద్యులు ఏం చేస్తున్నారు?

గోర్లపై నల్ల మచ్చలు లేదా గోర్లు నల్లగా మారడం: ఇది పైన పేర్కొన్న అన్ని సమస్యల కంటే ప్రమాదకరమైనది. గోర్లపై నల్ల మచ్చలు ఏర్పడటం లేదా గోర్లు నల్ల రంగులో మారుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆ గోర్ల నుంచి ఒక్కోసారి రక్తం కూడా కారుతుంది. ఇది మెలనోమా అనే ఒక రకమైన క్యాన్సర్‌కు ముందస్తు సంకేతం కావచ్చు.

Also Read: 3 రకాల కోవిడ్ వ్యాక్సిన్లను 5 సార్లు తీసుకున్నాడు, చివరికి ఏమైందంటే..

Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?

గమనిక: ఈ కథనంలోని వివరాలను కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడినా.. వైద్యుడి సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఈ కథనానికి ‘ఏబీపీ దేశం’ బాధ్యత వహించదని గమనించగలరు. 

Published at : 01 Sep 2021 07:35 AM (IST) Tags: LifeStyle Health Health News Nails Nails Colour

సంబంధిత కథనాలు

Dental Care: టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ చెయ్యొచ్చా? నిపుణులు ఏం సూచిస్తున్నారు?

Dental Care: టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ చెయ్యొచ్చా? నిపుణులు ఏం సూచిస్తున్నారు?

అల్ బుకరా పండ్లు కనిపిస్తే కచ్చితంగా తినండి, ఈ సమస్యలనీ దూరం అయిపోతాయి

అల్ బుకరా పండ్లు కనిపిస్తే కచ్చితంగా తినండి,  ఈ సమస్యలనీ దూరం అయిపోతాయి

Kids: శీతాకాలంలో పిల్లలకి కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవే

Kids: శీతాకాలంలో పిల్లలకి  కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవే

Hair Care: కరివేపాకులతో ఇలా చేస్తే జుట్టు సమస్యలు దూరం

Hair Care: కరివేపాకులతో  ఇలా చేస్తే జుట్టు సమస్యలు దూరం

Ragi Cake: మధుమేహుల కోసం రాగిపిండి కేకు, ఇంట్లోనే ఇలా చేయండి

Ragi Cake: మధుమేహుల కోసం రాగిపిండి కేకు, ఇంట్లోనే ఇలా చేయండి

టాప్ స్టోరీస్

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!