అన్వేషించండి

Youtuber Anvesh: 85 దేశాలు చుట్టేసిన వైజాగ్ యూట్యూబర్, అతడి నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

క్రియేటివిటీ ఏ ఒక్కరి సొంత కాదు. కాస్త కొత్తగా ఆలోచిస్తే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఇదే సూత్రాన్ని పాటించాడు ఓ వైజాగ్ కుర్రాడు. ఇప్పటి వరకు 85 దేశాలు చుట్టేసి యూట్యూబర్ గా సత్తా చాటాడు.

సోషల్ మీడియా ద్వారా పాపులరైన వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయితే, మరికొంత మంది పేదలకు సాయం చేస్తూ క్రేజ్ సంపాదించారు. వీరందరితో పోల్చితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే కుర్రాడు చాలా చాలా స్పెషల్. వైజాగ్ కు చెందిన ఈ యువకుడు యూట్యూబర్ గా మారి ప్రపంచాన్ని ఇట్టే చుట్టేసి వస్తున్నాడు. యూట్యూబ్ నుంచి కళ్లు చెదిరే ఆదాయాన్ని అందుకుంటున్నాడు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు? అతడి కథేంటి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంతకీ ఎవరు ఈ అన్వేష్?

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన యువకుడే ఈ అన్వేష్. మొదటి నుంచి విదేశాల్లో తిరగడం అంటే చాలా ఇష్టం. అందుకే, ట్రావెలింగ్ అండ్ టూరిజం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. 2019లో ‘నా అన్వేషణ’ అనే ఓ యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రపంచం మీద దండయాత్ర చేయడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటి వరకు ఏకంగా 85 దేశాలు తిరిగాడు. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. తను చూడటమే కాదు, తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఇక్కడి వాళ్లకు అక్కడి విశేషాలను చూపిస్తున్నాడు కూడా. ప్రస్తుతం అతడి యూట్యూబ్ చానెల్ కు 1.39 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అన్వేష్ షేర్ చేసే వీడియోల కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తారంటే ఆశ్చర్యం కలగకమానదు.    

కిలిమంజారో పర్వతారోహనణతో పాపులర్

అన్వేష్ బాగా పాపులర్ కావడంలో కిలిమంజారో పర్వతారోహణ వీడియో కీలకపాత్ర పోషించింది. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వతాన్ని ఆయన విజయవంతంగా అధిరోహించాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరానికి చేరుకున్నారు. ఆ తర్వాత భారతీయ జెండాను ఎగురవేసి, 'జై జవాన్ జై కిసాన్', 'వందేమాతరం'తో పాటు ‘జనగనమణ’ గీతాలను ఆలపించాడు. ఈ వీడియో నెట్టింట్లో బాగా పాపులర్ కావడంతో పాటు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు పెరిగారు. అప్పటి నుంచి ప్రపంచ యాత్రను మరింత స్పీడప్ చేశాడు. భారత పరిసర దేశాలతో పాటు సుదూర ప్రాంతాల్లోనూ పర్యటించారు. నార్త్ కొరియా లాంటి ప్రమాదకర దేశాల్లోనూ అడుగు పెట్టాడు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా , అమెరికా, ఐరోపా దేశాల్లో తిరిగి వచ్చాడు. ఇప్పటి వరకు ప్రపంచంలోని సగానికి పైగా దేశాల్లో అతడు పర్యటించాడు. తన యూట్యూబ్ ద్వారా ఎంతో మందికి ఆయా దేశాల్లోని విశేషాలను చూపించాడు.    

యూట్యూబ్ నుంచి భారీగా సంపాదన

ప్రపంచ పర్యటనల ద్వారా ఆయా దేశాల్లోని వింతలు  విశేషాలు తెలుసుకోవడంతో పాటు ఆన్వేష్ ఆ వీడియోను యూట్యూబ్ లో పెట్టి భారీగా ఆదాయాన్ని పొందుతున్నాడు. ప్రస్తుతం నెలకు సుమారు రూ. 60 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడంటే ఆయన రేంజి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి పాపులర్ టీవీ చానెళ్లు కూడా ఇంత మొత్తం సంపాదించలేవు. కానీ, అన్వేష్ ఎంజాయ్ చేస్తూ.. ఈజీగా సంపాదించేస్తున్నాడు. తెలుగులోని పలువురు యూట్యూబర్లతో పోల్చితే తక్కువ సబ్ స్ర్కైబర్లు ఉన్నా, ఆదాయంలో మాత్రం దుమ్మురేపుతున్నాడు. తాజాగా చైనాలో పర్యటించిన ఆయన అక్కడి విశేషాలను ప్రజల ముందు ఉంచాడు. ఈ వీడియోలకు ఊహించని రేంజిలో వ్యూస్ రావడంతో భారీగా ఆదాయం లభించింది. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా అతడి నెల ఆదాయం రూ. 60 లక్షలకు కాస్త అటు ఇటుగా ఉంటుంది.   

 

Read Also: సరిహద్దుల్లేని అభిమానం - ‘జైలర్’ కోసం చెన్నైకి వచ్చిన జపాన్ దంపతులు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
Naga Chaitanya Fitness Routine : నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
Kakinada Port Issue News: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
Earthquake In Hyderabad List: 50ఏళ్లలో  హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్
50 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే. ఇంతకు ముందు వచ్చింది ఎక్కడంటే..
RGV on Pushpa 2 Ticket Rates: తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
Embed widget