అన్వేషించండి

Multani Mitti for Glowing Skin : పండుగల సమయంలో మెరిసే స్కిన్ కోసం ముల్తానీ మిట్టిని ఇలా వాడేయొచ్చు.. ఫేస్ ప్యాక్ ఎలా వేసుకుంటే మంచిదో తెలుసా?

Multani Mitti : పండుగ సమయంలో మెరిసే, గ్లోయింగ్ స్కిన్​ కావాలనుకుంటే మిల్తానీ మట్టిని ఉపయోగించాలి. అయితే దీనిని ఏ స్కిన్ వాళ్లు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూసేద్దాం. 

Get Glowing Skin with Multani Mitti : బతుకమ్మ (Bathukamma 2024), దసరా(Dussehra 2024) వచ్చేస్తున్నాయి. ఆ వెంటనే దీపావళి. ఇలా పండుగలన్నీ వరుసలో ఉన్నాయి. ముఖ్యంగా బతుకమ్మ, దసరా మహిళలను రిప్రెజెంట్ చేస్తాయి. ఈ సమయంలో అందంగా కనిపించేందుకు అందరూ ప్రయత్నిస్తారు. దానికి తగ్గట్లు ముస్తాబవుతారు. అయితే ముఖం నిర్జీవంగా ఉండి ఎంత రెడీ అయినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి స్కిన్ కేర్​పై ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు బ్యూటీ నిపుణులు. 

హెల్తీ స్కిన్, మెరిసే చర్మం కోసం ముల్తానీ మిట్టిని ఉపయోగించవచ్చు. ఎన్నో ఏళ్లుగా చర్మాని శుభ్రం చేసే క్లీనింగ్ ఏజెంట్​గా దీనిని ఉపయోగిస్తున్నారు. ఇది మొటిమలను నివారించడంతో పాటు.. చర్మాన్ని హెల్తీగా ఉంచుతుంది. డర్ట్​ని పోగొట్టి మెరిసే స్కిన్​ని అందించడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు అందుతాయి. మరి మెరిసే చర్మం కోసం దీనిని ఎలా ఉపయోగించాలి? ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు? ఫేస్ మాస్క్ ఎలా వేసుకోవాలి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

ముల్తానీ మిట్టి వల్ల కలిగే ప్రయోజనాలు

ముల్తానీ మిట్టి సహజమైన శోషక పదార్థంగా పనిచేస్తుంది. డీప్ క్లెన్సింగ్, స్కిన్ డిటాక్స్ చేయడం కోసం దీనిని ఉపయోగిస్తారు. ఇది చర్మం నుంచి అదనపు నూనను తీయడంతో పాటు మలినాలను తొలగిస్తుంది. బ్లాక్ హెడ్స్, మొటిమలు కంట్రోల్​లో ఉంటాయి. అదనపు సెబమ్​ని గ్రహించి గేమ్ ఛేంజర్​గా పని చేసి.. మంచి మెరుపును అందిస్తుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంతో పాటు.. వాటిని దూరం చేస్తాయి. చర్మం బిగుతుగా ఉండేలా.. ఫైన్ లైన్స్, ముడతలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. 

ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ 

పొడి చర్మం ఉన్నవారు ముల్తానీ మిట్టితో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ పాలు కలిపి తీసుకోవాలి. దీనిని పేస్ట్​గా చేసి ముఖానికి, మెడపై అప్లై చేయాలి. దీనిని పదిహేను నిమిషాలు ఉంచి.. డ్రై అయిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. అనంతరం మాయిశ్చరజైర్​ అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా పోషణ అందించి.. హైడ్రేటెడ్​గా ఉంచుతుంది. 

ఆయిల్ స్కిన్ కోసం.. 

ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి,1 టేబుల్ స్పూన్ వేప పొడి, 1 టేబుల్ స్పూన్ పెరుగును కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. దీనిని ముఖానికి మెడకు అప్లై చేసి 15 నిమిషాలు ఉంచాలి. ఈ ప్యాక్ మొటిమలను కూడా కంట్రోల్ చేస్తుంది. క్లియర్​ స్కిన్​ని అందిస్తుంది. 

సెన్సిటివ్ స్కిన్ ఉంటే.. 

కొందరికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. అలాంటివారు ముందుగా ప్యాచ్ టెస్ట్ వేసుకోవాలి. పడుతుంది అనుకుంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి, 1 టేబుల్ స్పూన్ గంధపు పొడి, 1 టేబుల్ స్పూన్ కీరదోస రసాన్ని పేస్ట్​గా చేయాలి. దీనిని అప్లై చేసి పావు గంట ఉంచుకోవాలి. అనంతరం చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఇది సెన్సిటివ్ స్కిన్​ను కూల్ చేస్తుంది. రెడ్​నెస్, చికాకును తగ్గిస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చర్మం బాగా పొడిగా లేదంటే బాగా సెన్సిటివ్​గా ఉంటే ముల్తానీ మిట్టిని ఉపయోగించడం మానేస్తే మంచిది. లేదంటే స్కిన్​ మరింత డ్రై అవుతుంది. అలాగే దీనిని పావుగంటకు మించి ఎక్కువ సమయం ఉంచుకోకపోవడమే మంచిది. లేదంటే స్కిన్ ఇరిటేషన్ వచ్చే అవకాశాలున్నాయి. రెడ్​నెస్, దురద ఇంకేమైనా అసౌకర్యాలు ఉంటే వెంటనే దానిని కడిగేయండి. నిపుణుల సలహాలు తీసుకుని దీనిని ఉపయోగిస్తే మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.

Also Read : మీ వయసుకంటే పెద్దవారిగా కనిపిస్తున్నారా? ఇవి ఫాలో అయితే యంగ్​గా కనిపిస్తారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
Andhra Pradesh News: మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
Matka Trailer: వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
Tirupati News: తిరుపతిలో చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యం- సీఎం, హోంమంత్రి దిగ్భ్రాంతి- బాధితులకు సాయం ప్రకటన
తిరుపతిలో చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యం- సీఎం, హోంమంత్రి దిగ్భ్రాంతి- బాధితులకు సాయం ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
Andhra Pradesh News: మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
Matka Trailer: వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
Tirupati News: తిరుపతిలో చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యం- సీఎం, హోంమంత్రి దిగ్భ్రాంతి- బాధితులకు సాయం ప్రకటన
తిరుపతిలో చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యం- సీఎం, హోంమంత్రి దిగ్భ్రాంతి- బాధితులకు సాయం ప్రకటన
Saving Ideas: రూల్‌ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్‌ ఛేంజర్‌' ఇది
రూల్‌ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్‌ ఛేంజర్‌' ఇది
Blue Aadhaar Card: బ్లూ కలర్‌ ఆధార్ కార్డ్ కావాలా? - మీకు వస్తుందో, రాదో ఇక్కడ చెక్‌ చేసుకోండి
బ్లూ కలర్‌ ఆధార్ కార్డ్ కావాలా? - మీకు వస్తుందో, రాదో ఇక్కడ చెక్‌ చేసుకోండి
Pushpa 2 Item Song: శ్రద్ధా కపూర్, సమంత కాదు... అల్లు అర్జున్ 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ చేసేది ఈ అమ్మాయే!
శ్రద్ధా కపూర్, సమంత కాదు... అల్లు అర్జున్ 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ చేసేది ఈ అమ్మాయే!
Gold Vs Diamond: బంగారం లేదా వజ్రం - ఎందులో పెట్టుబడితో ఎక్కువ లాభం?
బంగారం లేదా వజ్రం - ఎందులో పెట్టుబడితో ఎక్కువ లాభం?
Embed widget