అన్వేషించండి

Tips and Tricks to Look Young : మీ వయసుకంటే పెద్దవారిగా కనిపిస్తున్నారా? ఇవి ఫాలో అయితే యంగ్​గా కనిపిస్తారు

Easy Ways to Stay Young : కొన్ని సందర్భాల్లో వివిధ కారణాల వల్ల చాలామంది తమ వయసుకంటే పెద్దవారిగా కనిపిస్తారు. అయితే కొన్ని టిప్స్​తో మీరు యవ్వనంగా కనిపించవచ్చు అంటున్నారు. 

Look Younger Secrets : లైఫ్​స్టైల్​లో మార్పుల వల్ల.. లేదంటే ఇతర మేకప్, హెయిర్ స్టైల్​వల్ల కొందరు తమ వయసుకంటే పెద్దగా కనిపిస్తారు. కొందరు మొహమాటం లేకుండా కూడా దానిని మొహంపై చెప్పేస్తారు. కొన్నిసార్లు మీరు వేసుకునే డ్రెస్​లు కూడా మిమ్మల్ని వయసుకంటే పెద్దగా కనిపించేలా చేస్తాయి. అందుకే ఈ సమస్యను దూరం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. ఇవి మిమ్మల్ని యంగ్​గా కనిపించడంలో సహాయం చేస్తాయి. పైగా ఇవి మీ వయసుకున్నా మీరు చిన్న వయసులా కనిపించేలా చేస్తాయి. ఎలా అంటే.. 

లైఫ్​స్టైల్..

కొందరు ఏది పడితే అది తింటూ.. శరీరంపై కొంచెం కూడా శ్రద్ధ వహించరు. అలాంటివారు తినే విషయంలో బరువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు ఎక్కువగా ఉన్నారనిపిస్తే దానిని తగ్గించుకునేందుకు ట్రై చేయండి. ఎందుకంటే అధిక బరువు మిమ్మల్ని మీ వయసుకంటే మీరు పెద్దవారిలా కనిపించేలా చేస్తుంది. రెగ్యూలర్​గా వ్యాయామం చేస్తే.. బరువు తగ్గడంతో పాటు.. మొహంలో సహజమైన గ్లో వస్తుంది. ఇది యవ్వనంగా ఉండేలా చేస్తుంది. 

హెయిర్ స్టైల్.. 

మీ లుక్స్​ని హెయిర్​ స్టైల్స్ బాగా డామినేట్ చేస్తాయి. ఎందుకంటే.. మీరు అందంగా కనిపించాలన్నా.. వికృతంగా కనిపించాలన్నా వీటితోనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన స్టైల్స్​లో హెయిర్​పై ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మీ ముఖానికి ఏ హెయిర్ స్టైల్​ బాగా నప్పుతుందో గుర్తించి.. వాటిని ట్రై చేయండి. జుట్టును స్టైల్ చేయడం, కర్ల్స్ చేయడం వంటివి చేస్తూ ఉంటే.. ఇవి మీరు యంగ్​గా కనిపించేలా చేస్తాయి. మధ్యపాపిడి తీస్తే.. మీరు వయసుకన్నా పెద్దవారిగా కనిపిస్తారని గుర్తించుకోండి. సైడ్ పార్టీషన్స్ కాస్త యంగ్​లుక్ ఇస్తాయి.

మేకప్..

ట్రెండీగా ముస్తాబయ్యేవారు కచ్చితంగా మేకప్​పై దృష్టి పెట్టాలి. అలాగే ట్రెడీషనల్​గా ఉండేవారు కూడా కొన్ని రెగ్యూలర్​గా ఫాలో అవ్వాలి. ఇండియన్ వేర్ వేసుకున్నప్పుడు ముఖానికి కచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. ఇది మీ లుక్​ని బెటర్​ చేస్తుంది. మీ ముఖానికి తగ్గట్లు బొట్టు సైజ్ ఉండేలా చూసుకోండి. పెద్ద బొట్టు పెట్టుకుంటే అది హుందాగా ఉండొచ్చు కానీ.. మిమ్మల్ని పెద్దవారిగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి చిన్న బొట్టుకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. 

స్కిన్ కేర్ రోటీన్

ఉదయం, సాయంత్రం కచ్చితంగా స్కిన్​ కేర్ రోటీన్ ఫాలో అవ్వాలి. ఇవి ముఖంపై మురికిని, పింపుల్స్​ని దూరం చేసి.. మెరిసే, అందమైన లుక్​ని ఇస్తాయి. స్కిన్​కేర్ ఫాలో అవ్వడం వల్ల ముడతలు కూడా దరి చేరవు. కచ్చితంగా పడుకునే ముందు మీ మొహంపై మేకప్​ లేకుండా చూసుకోండి. ఇది వృద్ధాప్యఛాయలను త్వరగా ప్రేరేపిస్తుంది. వారానికి రెండుసార్లైనా ఎక్స్​ఫోలియేటింగ్ చేయడం వల్ల ముఖంలో మంచి గ్లో వస్తుంది. 

దుస్తుల ఎంపికలో..

కొన్ని దుస్తులు మీకు కంఫర్ట్​గా ఉండొచ్చు కానీ.. చూసేందుకు మీరు పెద్దవారిగా కనిపించేలా చేస్తాయి. రౌండ్ నెక్స్ మిమ్మల్ని పెద్దవారిగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి క్లోజ్డ్ నెక్ డ్రెస్​లు లేదా షర్ట్​లు ట్రై చేయండి. బాగా వదులుగా ఉండే దుస్తులు కూడా మిమ్మల్ని పెద్దవారిగా చేస్తాయి. అంతేకాకుండా మీ స్కిన్ టోన్​కి సెట్ అయ్యే రంగుల దుస్తులు ఎంచుకోవాలి. ఇవి కూడా మీరు అందంగా కనిపించండంలో మేజర్ పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే కొన్ని కలర్స్ మిమ్మల్ని డామినేట్ చేసి మీ లుక్​ని డల్ చేస్తాయి. 

ఈ టిప్స్​ని మీరు ఫాలో అయితే సహజంగా అందంగా కనిపించడం స్టార్ట్ చేస్తారు. ఈ సింపుల్ టిప్స్ కచ్చితంగా మీ లైఫ్​స్టైల్​ పెద్ద మార్పులే తీసుకువస్తాయి. 

Also Read : పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెంట్ అవ్వొచ్చా? ఆ రోజుల్లో ట్రై చేస్తే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయా?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Multani Mitti Face Pack : ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
Skin Whitening Cream: రాత్రికి రాత్రే చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో ప్రమాదం! ఆందోళన కలిగిస్తున్న పాదరసం, సీసం వాడకం!
రాత్రికి రాత్రే చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో ప్రమాదం! ఆందోళన కలిగిస్తున్న పాదరసం, సీసం వాడకం!
Scalp Oiling vs Hair Strand Oiling : స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?
స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?
Face Packs for Glowing Skin : మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget