అన్వేషించండి

Mother’s Day Gift Ideas : మదర్స్ డే స్పెషల్.. అమ్మకు ఈ గిఫ్ట్స్ ఇచ్చి హ్యాపీ మదర్స్ డే చెప్పేయండి 

Best Mother’s Day Gift Ideas : మదర్స్ డే రోజు మీరు అమ్మకి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు వీటిని ఇచ్చి హ్యాపీ మదర్స్ డే అంటూ విష్ చేసి గిఫ్ట్ ఇచ్చేయండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమ్మకు ప్రత్యేక అనుభూతిని ఇవ్వడానికి బహుమతులు ఎంచుకోండి.
  • జ్ఞాపకాలతో కూడిన ఫోటో ఆల్బమ్, స్పా ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు.
  • ఇష్టమైన వంటకాలు చేసి, సర్​ప్రైజ్ డిన్నర్ ఏర్పాటు చేయండి.
  • పర్సనలైజ్డ్ జ్యూవెలరీ, అమ్మతో సమయం గడపడం అమూల్యమైనది.

Mother’s Meaningful Gifts : అమ్మ.. ఒక్క మాటలో చెప్పలేని అనుభూతి. కోట్లల్లో థ్యాంక్స్​ చెప్పినా సరిపడని రుణానుబంధం. అందుకే అమ్మంటే అందరికీ ప్రత్యేకమైన ఎమోషనే. పొద్దున్నే లేచి వంట చేయడం నుంచి రాత్రి పడుకునే వరకు పిల్లల గురించే ఆలోచించే తల్లుల్లు ఎందరో. ఆమె చేసిన త్యాగం, చూపించే నిస్వార్థమైన ప్రేమను సెలబ్రేట్ చేయడానికి ఒక్కరోజు సరిపోదు. కాబట్టి ప్రతిరోజూ మదర్స్ డే చేసుకోవచ్చు. కానీ.. వారికి మరింత ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తూ.. మదర్స్ డే రోజు ఆమెకి విషెష్ చేయండి.

మదర్స్ డే విషెష్ ఎలాగో చెప్తాము.. కాబట్టి ఆమెకు ఏమి కావాలో తెలుసుకుని.. వాటిని ఇచ్చేయండి. ముందు వెళ్లి.. అమ్మ నీకు ఏమి కావాలి? అని అడగండి. ప్రేమగా మిమ్మల్ని దగ్గరికి తీసుకుని నాకేమి వద్దు నాన్న అని చెప్తుంది. మళ్లీ మళ్లీ అడగండి. ఏదొక చిన్న గిఫ్ట్ లేదా తనకి ఉన్న విష్ చెప్తుంది. ఈ మదర్స్ డేకి దానిని ఫుల్​ ఫిల్ చేయండి. లేదు అమ్మ ఏమి చెప్పట్లేదు. నాకేమి వద్దురా బాబు అంటోందా? కానీ మీకు గిఫ్ట్ ఇవ్వాలని ఉంటే.. ఈ గిఫ్ట్స్ ఇవ్వండి. ఇవి అమ్మను కచ్చితంగా స్పెషల్​గా ఫీల్ అయ్యేలా చేస్తాయి. 

హ్యాండ్‌మేడ్ ఫోటో ఆల్బమ్ 

అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి. వాటిలో అమ్మతో మీరు తీసుకున్న సెల్ఫీలు.. లేదా అమ్మ క్యూట్​గా అనిపించినప్పుడు తీసిన ఫోటోలు ఉంటాయి. లేదా ఫ్యామిలీ అంతా సంతోషంగా గడిపిన అందమైన క్షణాలు ఉంటాయి. ఆ ఫోటోలతో ఆల్బమ్‌ చేసి ఇవ్వండి. ప్రతి ఫోటో పక్కన మీ చేతితో ఓ చిన్న మెసేజ్ లేదా మీకు ఆ ఫోటోతో ఉన్న జ్ఞాపకాలు రాసి ఇవ్వండి. ఇది అమ్మకు మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అవుతుంది. 

స్పా లేదా వెల్‌నెస్

అమ్మ రోజంతా కష్టపడుతూనే ఉంటుంది. ట్రిప్​కి వెళ్లినా ఆమెకి రిలాక్స్ అవ్వడం తెలియదు అనుకుంటున్నారా ? అయితే ఆమెకు కాస్త విశ్రాంతిని పరిచయం చేయండి. స్పా ట్రీట్‌మెంట్, మసాజ్ సెషన్, లేదా ఇంట్లోనే అందమైన స్కిన్‌కేర్ కిట్ తయారుచేసి ఇవ్వవచ్చు. అమ్మ తనను తాను ప్రేమించుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. కుదురితే తనతో పాటు మీరు కూడా ఈ సెషన్​లో పాల్గొనండి.

సర్‌ప్రైజ్ డిన్నర్

అమ్మకు ఇష్టమైన వంట తెలుసుకుని.. మీరు దానిని ప్రిపేర్ చేయండి. టేబుల్ అందంగా అలంకరించి.. చిన్న సర్​ప్రైజ్ ఇవ్వండి. లేదా తనకి ఇష్టమైన రెస్టారెంట్​కి డిన్నర్​కి తీసుకెళ్లండి. నిజానికి బయటకు తీసుకెళ్లడం కంటే.. మీరే వండిపెడితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 

పర్సనలైజ్డ్ జ్యూవెలరీ 

అమ్మకి నచ్చిన రంగులో లేదా నప్పేలా ఓ చీర. దానికి తగ్గ గాజులు, కుదిరితే సింపుల్ జ్యూవెలరీ.. వాటితో పాటు పర్సనలైజ్డ్ జ్యూవెలరీ ఇవ్వండి. ఇవి అమ్మకు చాలా ప్రత్యేకమైన మిగిలిపోతాయి. వాటిని చూసినప్పుడు అవి మీ ప్రేమను అమ్మకు గుర్తు చేస్తాయి. కస్టమైజ్డ్ ఆప్షన్ కోసం ఆన్​లైన్​లో చూడొచ్చు. 

అమ్మతో డేట్​కి వెళ్లండి..

ఈ బిజీ టైమ్​లో అమ్మలకి మీరు ఇచ్చే అత్యంత విలువైన గిఫ్ట్ ఏంటంటే.. మీరు ఆమెతో క్వాలిటీ టైమ్ స్పెంట్ చేయడమే. ఇది డబ్బుతో కొనలేని అత్యంత విలువైన బహుమతి. అమ్మకు ఇష్టమైన ప్లేస్​కి వెళ్లండి. ఫోన్ పక్కన పెట్టి అమ్మతోనే ఉండండి. ఇది అమ్మకు అన్నిటికంటే అమూల్యమైన బహుమతి. అలాగే ఆమెకు ఓ లెటర్ రాయండి. 

మీకు గిఫ్ట్స్ ఇవ్వడంలో ఇబ్బంది ఉంటే.. ఇలాంటివి ఇచ్చి హ్యాపీ మదర్స్ డే చెప్పండి. బడ్జెట్ ఫ్రెండ్లీ, సింపుల్​ అండ్ ఎమోషనల్​ మూమెంట్స్ షేర్ చేయండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget