IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Mothers Day 2022 Wishes: మాతృ దినోత్సవం 2022: ఈ అందమైన కోట్స్‌తో ‘అమ్మ’ను అభినందిద్దామిలా!

ఈ నెల 8వ తేదీన (ఆదివారం) మదర్స్ డే. ఈ అందమైన కోట్స్‌తో ‘అమ్మ’ సేవలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలపండి.

FOLLOW US: 

టా ప్రతి మే రెండో ఆదివారాన్ని అంతర్జాతీయ మాతృ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 8వ తేదీన ‘మదర్స్ డే’ సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో మనకు ఈ లోకాన్ని పరిచయం చేసిన ‘అమ్మ’ను అభినందించడం మన బాధ్యత. అందమైన గిఫ్టులతోనే కాదు, అందమైన మాటలతో కూడా ‘అమ్మ’కు శుభాకాంక్షలు చెప్పవచ్చు. ఈ మాతృ దినోత్సవ శుభకాంక్షలను మన మాతృభాషలోనే చెప్పేద్దాం.  

ననం నీవే.. గమనం నీవే..
సృష్టివి నీవే.. కర్తవు నీవే..
కర్మవు నీవే.. ఈ జగమంతా నీవే..
అందుకే భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక..
‘అమ్మ’ను సృష్టించాడు. 
అమ్మా.. నీకిదే మా వందనం.
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 

సృష్టికి ప్రతి సృష్టినిచ్చి.. ప్రేమతో ప్రాణం పోస్తుంది ‘అమ్మ’
నవమాసాలు మోసి, తన ప్రాణాలను ఫణంగా పెట్టి జీవం పోస్తుంది ‘అమ్మ’
తమ బిడ్డలను కంటికి రెప్పలా పెంచుతుంది ‘అమ్మ’
తొలి అడుగు తానై నడిపిస్తుంది ‘అమ్మ’
ఓర్పుకు, నేర్పుకు, ఓదార్పుకు మార్గదర్శి ‘అమ్మ’
తెగువకు, త్యాగానికి నిదర్శనం ‘అమ్మ’
ఇంటికి వెలుగు ‘అమ్మ’
అబల కాదు సబల ‘అమ్మ’
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 

దాలు తెలియని పెదవులకు.. 
అమృత వ్యాఖ్యం అమ్మ..
ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ..
ఓ మాతృమూర్తి.. నీ త్యాగం ఎప్పటికీ మరులేం.. 
అందుకే ఈ వందనాలు అందుకోమ్మా..
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 

మ్మను పూజించు
భార్యను ప్రేమించు..
సోదరిని దీవించు..
అందరిలో ‘అమ్మ’ను చూడు సోదరా..
మహిళలను గౌరవించరా!
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 

‘అమ్మ’ లేకపోతే జననం లేదు
‘అమ్మ’ లేకపోతే గమనం లేదు
‘అమ్మ’ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు
‘అమ్మ’ లేకపోతే అసలు సృష్టే లేదు.
అందుకే ‘అమ్మ’ను గౌరవిద్దాం. 
కంటికి రెప్పలా కాపాడుకుందాం. 
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 

సృష్టికి కానుక ‘అమ్మ’.. 
‘అమ్మ’ అంటే అపారమైన శక్తి.. 
యుక్తి అమూల్యం ‘అమ్మ’..
ప్రేరణ ఆమే.. లాలనా ఆమే..
తల్లిగానే కాదు.. చెల్లిగా.. తోడుగా.. నీడగా.. 
‘అమ్మ’ పాత్ర అనితరసాధ్యం..
‘అమ్మ’ లేకుంటే అంతా శూన్యం..
అందుకే.. ‘అమ్మ’ నీకు శతకోటి వందనాలు..
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 

‘‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’
అంటే.. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని అర్థం.
‘అమ్మ’ను గౌరవించేవాడు.. ప్రతి మహిళతో గౌరవంగా నడుచుకుంటాడు. 
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 

‘అమ్మ’ అంతులేని సొమ్ము
అది ఏనాటికి తరగని భాగ్యము.. 
‘అమ్మతనం’లో ఉంది అమృతం..
అమ్మ ఒడిలో ఉంది స్వర్గం.. 
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 

ప్రతి ఒక్కరి ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ‘అమ్మ’
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 

నీకు చిన్న గాయమైనా..
అమ్మకు మాత్రం అది పెద్దదే..
నువ్వు ఆమెకు చేసే పెద్ద గాయం కూడా.. 
అమ్మ ‘మనసు’కు చిన్నదే.. 
అలాంటి అమ్మను బాధపెట్టడం భావ్యమా?
బిడ్డ తప్పులను భరించే ఓ అమ్మా.. నీకు వందనాలు
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

దేవుడు క్షమిస్తాడో లేదో తెలీదు..
కానీ, ‘అమ్మ’ మనసు వెన్న.. 
వెంటనే కరిగిపోతుంది..
పిల్లల తప్పులను క్షమించే ‘గుణం’ అమ్మకే సొంతం. 
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

దైవదర్శనం నీ పాపాలను కడిగేస్తుంది. 
అమ్మ పాదాలకు మొక్కితే.. పుణ్యం నీ సొంతమవుతుంది. 
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

న కోసం తన జీవితాన్ని సైతం త్యాగం చేసే ‘అమ్మ’.. 
మన నుంచి కోరుకొనేది ‘ప్రేమ’ మాత్రమే.. 
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

Also Read: భోజనం తర్వాత స్వీట్లు తింటున్నారా? ‘ఆయుర్వేదం’ ఏమిటీ ఇలా షాకిచ్చింది!

జీవిత సత్యం మీకు తెలుసా?
బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో...
‘అమ్మ’ తన అందాన్ని కోల్పోతుంది.
‘అమ్మ’ తన రూపు రేఖలు కోల్పోతుంది.
‘అమ్మ’ తన ఆరోగ్యాన్ని కోల్పోతుంది. 
మునిపంటితో నొప్పిని భరిస్తూ..
ముద్దులొలికే బిడ్డకు జన్మనిస్తుంది..
ఆ బిడ్డ ఏడుపు విని తన.. తన బాధను మరిచిపోతుంది.
- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

Also Read: ఈ కూరగాయలను పచ్చిగా అస్సలు తినొద్దు, ఎంత ప్రమాదమో తెలుసా?

Published at : 07 May 2022 10:53 AM (IST) Tags: Mothers Day Wishes in Telugu Mothers Day 2022 Wishes Mothers Day 2022 Wishes in Telugu Mothers Day Quotes Mothers Day Messages Mothers Day Telugu Quotes Mothers Day Telugu Wishes Happy Mother's Day

సంబంధిత కథనాలు

Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు

Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు

HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు

HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు

Protein Laddu: పిల్లలకు రోజూ ఒక ప్రొటీన్ లడ్డూ, ఎలా చేయాలంటే

Protein Laddu: పిల్లలకు రోజూ ఒక ప్రొటీన్ లడ్డూ, ఎలా చేయాలంటే

Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ

Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ

Asafoetida: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?

Asafoetida: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?

టాప్ స్టోరీస్

Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

Rajanna Sircilla: కలెక్టర్‌ పేరుతో ఫేక్ వాట్సాప్‌ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !

Rajanna Sircilla: కలెక్టర్‌ పేరుతో ఫేక్ వాట్సాప్‌ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే

TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే