అన్వేషించండి

Aalim Hakim: మహేష్ బాబుకు ఆలిమ్ హకీమ్ అదిరేటి లుక్ - ఈ హెయిర్ స్టైలిష్ నేపథ్యం గుండె బరువెక్కిస్తుంది!

హెయిర్ డ్రెస్సర్ అనగా మొదట గుర్తొచ్చే పేరు జావేద్ హబీబ్. కానీ, ఆయనను మించిన ప్రతిభ ఉన్న మరో వ్యక్తి గురించి ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. ఎందరో సెలబ్రిటీలు ఆయనకు కస్టమర్లుగా కొనసాగుతున్నారు.

క వ్యక్తికి తన వృత్తి మీద అపార గౌరవం ఉంటే.. ఎప్పటికైనా తను ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ హెయిర్ డ్రెస్సర్ ఆలిమ్ హకీమ్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, క్రికెట్ మొదలుకొని బిజినెస్ వరకు ఎంతో మంది సెలబ్రిటీలు ఆయన కస్టమర్లు. తాజాగా ఆలిమ్ తన ట్విట్టర్ లో మహేష్ బాబు ఫోటో షేర్ చేశారు. స్టైలిష్ లుక్ తో మహేష్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడూ లేని సరికొత్త హెయిర్ స్టైల్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేశంలోని ఎంతో మంది అగ్ర తారల హెయిర్ డ్రెస్సర్ గా కొనసాగుతున్న ఆలిమ్ హకీమ్ తొలిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు జుట్టుకు కొత్త స్టైల్ అద్దారు. మహేష్ బాబు తాజాగా నటిస్తున్న SSMB28 సినిమా కోసం ఈ లుక్  ఎంచుకున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా  ఏప్రిల్ 2023న విడుదల కానుంది.

సెలబ్రిటీల హెయిర్ స్టైలిస్ట్

మహేష్ బాబుకు హెయిర్ డ్రెస్ చేసి ఆలీమ్ హకీమ్‌కు చాలామంది టాప్ సెలబ్రిటీలు కస్టమర్లుగా ఉన్నారు. వారందరికీ ఈయన చక్కని హెయిర్ లుక్ అందిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, క్రికెట్ సహా బిజినెస్ దిగ్గజాలకు ఈయన హెయిర్ డ్రెస్సర్ గా పని చేస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్, కన్నడ స్టార్ హీరో యష్, బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రాంపాల్, సునీల్ శెట్టి, అజయ్ దేవ్ గన్, తమిళ్ స్టార్ హీరో విక్రమ్, డైరెక్టర్ అట్లీ, టాప్ క్రికెటర్స్ సచిన్, ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, చాహల్, పాండ్యా  సహా పలువురు సెలబ్రిటీలు ఇతడి దగ్గరే హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుంటారు. ఢిల్లీ సహా పలు ముఖ్య నగరాల్లో ఈయనకు హెయిర్ డ్రెస్సింగ్ స్టూడియోలున్నాయి.

తండ్రి మరణంతో ఎన్నో కష్టాలు

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. తన కష్టాలను, కన్నీళ్లను ఎదుర్కొంటూ కొనసాగిన తన జెర్నీ గురించి వివరించారు. హెయిర్ డ్రెస్సింగ్ చేయడం అనేది తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు వెల్లడించారు. తన తండ్రి అప్పట్లోనే ప్రసిద్ధ హెయిర్ స్టైలిస్ట్ గా ఉండేవారని చెప్పారు. అమితాబ్ బచ్చన్ లాంటి బాలీవుడ్ హీరోలు తన దగ్గరే హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకునే వాళ్లని చెప్పారు. కానీ, ఆయన 39 ఏళ్లకే చనిపోయారన్నారు. ఆయన మృతి తమ జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడేలా చేసిందన్నారు.  ఆ సమయంలో తండ్రి బ్యాంక్ అకౌంట్ లో కేవలం రూ.13 మాత్రమే ఉన్నాయన్నారు.

తండ్రి కల నెరవేర్చాలని..

తన తండ్రిని చూసి.. తాను కూడా గొప్ప హెయిర్ స్టైలిస్ట్ కావాలని కలలు కనేవాడినని చెప్పాడు. ఇదే విషయాన్ని కాలేజీలో చెప్తే  చిన్న చూపు చూసేవారని, మరికొంత మంది నవ్వేవారని చెప్పారు. వారి హేళన చూసి ఆ వృత్తి వైపు వెళ్లకూడదని భావించినట్లు చెప్పారు. కానీ, తన తండ్రి వదిలిపెట్టిన దాన్ని ముందుకు తీసుకెళ్లడమే తన ధ్యేయమని ఫిక్స్ అయినట్లు చెప్పారు.  అప్పుడే తన పేరును బ్రాండ్‌గా మార్చుకోవాలనే కల పుట్టిందన్నారు. “నేను మా నాన్నగారి పేరును ముందుకు తీసుకెళ్లాలనుకున్నాను. ఆయన ఎక్కడ ఆగిపోయారో అక్కడి నుంచి మొదలు పెట్టాలనుకున్నాను. మా నాన్న పేరు హకీమ్. నేను అతడి పేరుకు నా పేరును జోడించాను. హకీమ్  ఆలిమ్ గా మారాను. ఈ పేరును బ్రాండ్ గా మార్చాలి అనుకున్నాను. మార్చాను” అని వెల్లడించారు.    

అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అలుపెరుగని పోరాటం చేస్తే, ఫలితం కచ్చితంగా ఉన్నత స్థాయిలో ఉంటుంది. అందుకు ఆలిమ్ హకీమ్ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కష్టాలకు ఎదురీదుతూ తండ్రి బాటలో నడుస్తూ.. ఆయన ఇప్పుడు ‘ఆలిమ్ హకీమ్ ది హెయిర్ గురు’ అయ్యారు.

Read Also: ఈ సిరీస్ చూస్తే గజగజ వణకాల్సిందే! ఎక్కువగా ఉలిక్కిపడే సీన్లతో ‘ది మిడ్ నైట్ క్లబ్’ గిన్నిస్ రికార్డు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget