Michigan Lottery: భార్య చెప్పిన మాట వింటే ఇదిగో ఇలా రూ. 1.5 కోట్ల లాటరీ గెలవొచ్చు!
భర్త భార్య మాట వింటే చాలా లాభాలు ఉంటాయని పెద్దవాళ్లు చెప్తుంటారు. ఒక్కోసారి అది నిజమే అనిపిస్తుంది. భార్య చెప్పిన పనికి వెళ్లి ఓ వ్యక్తి ఏకంగా కోటిన్నర లాటరీ గెలిచి ఆశ్చర్యపరిచాడు.
ఓ వ్యక్తి ఆఫీస్ కు వెళ్లాడు. అక్కడ పని పూర్తి చేసుకుని.. సాయంత్రం ఇంటికి బయల్దేరాడు. మధ్యలోకి రాగానే భార్యా ఓ మెసేజ్ పంపింది. అందులో తనకు ఓ పని చెప్పింది. నేరుగా తను భార్య చెప్పిన పని కోసం వెళ్లాడు. అక్కడే లాటరీ టికెట్లు అమ్మడాన్ని చూశాడు. ఎందుకైనా మంచిదని 5 టికెట్లు కొనుగోలు చేశాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాడు. పొద్దున్నే లేచి చూసే సరికి తను కొన్న లాటరీ టికెట్లు ఏకంగా $190,736 (రూ. 1.5 కోట్లు) గెలిచాయని మెసేజ్ వచ్చింది. ఇక తన ఆనందానికి అవధుల్లేవు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
మిచిగాన్ రాష్ట్రానికి చెందిన 46 ఏండ్ల ప్రెస్టన్ మాకి.. భార్య చెప్పిన పని చేయడం మూలంగా ఏకంగా కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడు. తను ఆఫీస్ కు వెళ్లి వస్తుండగా ఇంట్లోకి కిరాణా సామాన్లు తీసుకుని రావాలని భార్య చెప్తుంది. తను దారిలో ఓ సూపర్ మార్కెట్ కు వెళ్తాడు. అక్కడ భార్య చెప్పిన వస్తువులను తీసుకుంటాడు. బయటకు వెళ్లే సమయంలో అక్కడ లాటరీ టికెట్లు అమ్మడాన్ని గమనిస్తాడు. అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తాడు. అనుకున్నదే ఆలస్యంగా 5 లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తాడు. వాటిని తీసుకుని ఇంటికి వెళ్తాడు.
మరుసటి రోజు ఉదయాన్నే తన లాటరీ టికెట్లను పరిశీలిస్తాడు. ఫోన్ ఓపెన్ చేసి సదరు టికెట్లను స్కాన్ చేస్తాడు. ఆ స్కాన్ లో వచ్చిన ఫలితాన్ని చూసి తను అవాక్కవుతాడు. లాటరీ టికెట్లు ఏకంగా $190,736 (రూ. 1.5 కోట్లు) గెలుపొందినట్లు గుర్తిస్తాడు. వెంటనే తన భార్యకు విషయాన్ని చెప్పి సంబురాల్లో మునిగిపోతాడు.
“ఈ లాటరీ గెలవడానికి అసలు కారణ నా భార్య. తను ఈ లాటరీ టికెట్లు కొనాలని చెప్పలేదు. కానీ, ఇంట్లో సమాన్లు తీసుకురమ్మని నాకు చెప్పకపోతే.. నేను లాటరీ టికెట్లు అమ్మే ప్రదేశానికి వెళ్లేవాడిని కాదు. ఈ టికెట్లు కొనేవాడిని కాదు. లాటరీ గెలిచే వాడిని అసలే కాదు. నేను గెలిచిన ఈ డబ్బును కుటుంబ సభ్యల అవసరాల కోసం వినియోగిస్తాను. అందులో కొంత డబ్బును చిన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతాను. మరికొంత తబ్బును దాచిపెట్టుకోవాలని భావిస్తున్నాను” అని మాకీ వెల్లడించాడు.
ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఓ వ్యక్తి ఇలాగే భార్య చెప్పిన పని కోసం వెళ్లి రూ. 1.5 కోట్ల లాటరీ గెలిచాడు. సౌత్ కరోలినాలో ఈఘటన జరిగింది. పొద్దున్నే ఓ వ్యక్తి పాలు అయిపోయాయని భార్య చెప్పడంతో.. తీసుకురావడం కోసం వెళ్లాడు. పాలు తీసుకుని వస్తుండగా.. కస్టమర్ సర్వీస్ కౌంటర్ వైపు చూశాడు. అక్కడ పవర్ బాల్ టిక్కెట్ ను కొనుగోలు చేశాడు. తన టిక్కెట్‌పై ఉన్న ఐదు సంఖ్యలు డ్రాయింగ్‌లో ఎంచుకున్న వాటితో సరిపోలాయి. ఇంకేం తను ఏకంగా రూ. 1.5 కోట్లను గెలుపొందాడు. తనకు దక్కిన ఈ అదృష్టం పట్ల ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు.