By: ABP Desam | Updated at : 14 May 2022 12:20 PM (IST)
Edited By: Suresh Chelluboyina
Image Credit: Instagram
కజకస్థాన్లో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు ఎనిమిదో అంతస్తు కిటికీ నుంచి జారిపోయింది. లక్కీగా ఆ చిన్నారి కిటికీని పట్టుకుని వేలాడింది. కొంచెం ఆలస్యమైనా ఆ చిన్నారి పట్టుతప్పి కిందపడిపోయేది. కానీ, అప్పుడే ఓ వ్యక్తి దేవుడిలా అటువైపు వచ్చాడు. క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగాడు. తన గురించి ఆలోచించకుండా ఆ చిన్నారి ప్రాణాలు ఎలాగైనా కాపాడాలనే లక్ష్యంతో సాహసం చేశాడు. చివరికి ఆ చిన్నారిని రక్షించి హీరో అయ్యాడు.
ఆ రియల్ హీరో పేరు సబిత్ సంతన్‌బయేవ్. నుర్ సుల్తాన్‌లో నివసిస్తున్న సబీత్ తన స్నేహితుడితో కలిసి ఆఫీసుకు వెళ్తున్నాడు. ఇంతలో వారికి జనాల హాహాకారాలు వినిపించాయి. ఏం జరిగిందా అని చూస్తే.. అక్కడ ఓ చిన్నారి ఎనిమిదో అంతస్తు కిటికీకి వేలాడుతూ కనిపించింది. వెంటనే అతడు తన ఫ్రెండ్‌తో ఏడో ఫ్లోర్‌లోకి వెళ్లాడు. అతడి ఫ్రెండ్ కాళ్లను పట్టుకుంటే.. సబిత్ కిటికీ నుంచి బయటకు వచ్చాడు. పై అంతస్థులో వేలాడుతున్న చిన్నారిని అందుకోడానికి ప్రయత్నించాడు. చిన్నారి చేతికి చిక్కకపోవడంతో కిటికీ పైకి ఎక్కి మరీ కాలు పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని నెమ్మదిగా ఏడో అంతస్థు కిటికీ నుంచి తన స్నేహితుడికి అప్పగించాడు. అతడు చేసిన సాహసానికి స్థానికులు ఫిదా అయ్యారు. అంతా అతడిని ప్రశంసలతో ముంచెత్తారు. అయితే సబిత్ అవేవీ పట్టించుకోకుండా.. ఆఫీసుకు లేట్ అవుతోందని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Also Read: ఏంటమ్మా ఏంటీ? సింధూరం పెట్టుకుంటే శృంగార కోరికలు పుడుతాయా?
సబిత్ సాహసాన్ని ప్రభుత్వం గుర్తించింది. డిప్యుటీ ఎమర్సెన్సీ మినిస్టర్ సబిత్ ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ పతకంతో సత్కరించారు. సబిత్‌కు ముగ్గురు ఆడ పిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. నుర్ సుల్తాన్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడే ఒంటరిగా ఉంటూ కైజిలోర్డాలో నివసిస్తున్న తన కుటుంబానికి డబ్బులు పంపిస్తున్నాడు. ఈ ఘటనపై అతడు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆ సమయంలో నా భద్రత కోసం ఎలాంటి ఆధారం లేదు. దీంతో నా ఫ్రెండ్ నా కాళ్లు పట్టుకున్నాడు. ఆ సమయంలో నేను మరేదీ ఆలోచించలేదు. కేవలం ఆ చిన్నారికి సాయం చేయాలని అనుకున్నా అంతే’’ అని తెలిపాడు. ఏది ఏమైనా.. ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఉన్నారంటే నిజంగా మెచ్చుకోవల్సిందే కదూ.
Also Read: చాక్లెట్లు తింటే చిన్న వయస్సులోనే చనిపోతారా? తాజా అధ్యయనంలో ఏం తేలింది?
Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!
Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !