అన్వేషించండి
Earphones Safe Volume : ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్నారా? అయితే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
Hearing Loss from Loud Music : సౌండ్ ఎక్కువగా పెట్టుకుని పాటలు వింటే తలనొప్పి రావడం నుంచి వివిధ సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నారు.
ఇయర్ ఫోన్స్లో ఎంత సౌండ్ పెట్టి సాంగ్స్ వినాలంటే
1/9

చాలామంది ఇయర్ ఫోన్లు లేదా హెడ్ ఫోన్లలో పాటలు వింటారు. అయితే కొందరు ఎక్కువ సౌండ్ పెట్టుకుని.. మరికొందరు తక్కువ సౌండ్‌తో వింటారు. తక్కువ సౌండ్ పర్లేదు కానీ కొందరు మోతాదుకు మించిన సౌండ్ పెట్టుకుని సాంగ్స్ వింటారు. సౌండ్ ఎంత ఉండాలో సరైన అవగాహన లేకపోతే.. చెవులకు హాని కలుగుతుందంటున్నారు నిపుణులు.
2/9

చెవులకు నష్టం కలగకుండా.. తలనొప్పి రాకుండా కూడా పాటలు వినొచ్చు. అయితే దానికోసం ఓ రూల్ కచ్చితంగా ఫాలో అవ్వాలట. అదేంటంటే... ఇయర్ ఫోన్లలో సురక్షితంగా పాటలు వినడానికి సౌండ్ కంట్రోల్ చేయాలి అంటున్నారు.
3/9

పాటలు వినేటప్పుడు సౌండ్ క్వాలిటి గరిష్టంగా 60 శాతం ఉంచాలి. అంటే 60 నుంచి 70 డెసిబెల్స్ మధ్య ఉండేలా చూసుకోవాలి. 85 డెసిబెల్స్ దాటితే ప్రమాదకరం. ఇది వినికిడి శక్తిని దెబ్బతీస్తుంది.
4/9

సౌండ్ 100 డెసిబెల్స్ మించకుండా చూసుకోండి. ఇయర్ ఫోన్లలో పూర్తి వాల్యూమ్తో పాటలు వినడం ఎప్పుడూ మంచిది కాదు. కేవలం 15 నిమిషాల్లోనే మీకు నష్టం జరగవచ్చట.
5/9

అలాగే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎంత సమయం పాటలు వింటున్నారో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో 60/60 నియమాన్ని ఫాలో అవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది.
6/9

60/60 రూల్ అంటే.. మీరు సాంగ్స్ పెట్టుకున్నప్పుడు సౌండ్ 60 దాటకూడదు. అలాగే 60 నిమిషాలకు మించి హెడ్‌ఫోన్స్ వాడకూడదని సూచించింది.
7/9

ఇయర్‌ఫోన్‌లో పాటలు ఎక్కువ సౌండ్‌తో వింటే చెవి లోపల ఉండే చిన్న హెయిర్ సెల్స్, ఈ శబ్దాలను మెదడుకు సంకేతాలుగా మారుస్తాయి. శబ్ద తీవ్రత ఎక్కువైతే హెయిర్ సెల్స్ వంగిపోవచ్చు. లేదా విరిగిపోవచ్చు. అవి మళ్లీ పెరగవట.
8/9

ప్రారంభంలో ఈ నష్టం అర్థం కాకపోవచ్చు. కానీ కాలక్రమేణా వినికిడి శక్తి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది శాశ్వత సమస్యగా మిగిలిపోతుంది. అధిక శబ్దంతో పాటలు వింటే టినిటస్ ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల చెవుల్లో నిరంతరం ఈల శబ్దం వస్తుంది.
9/9

నాయిస్ క్యాన్సలింగ్ ఇయర్ ఫోన్లు వాడినా.. వాటిలో కూడా ఎక్కువ సౌండ్‌తో పాటలు వినకపోవడమే మంచిదట. కానీ చెవిలో ఇయర్ ఫోన్లు ఎక్కువ సేపు పెట్టుకోకూడదు.
Published at : 08 Oct 2025 08:12 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కరీంనగర్
విశాఖపట్నం
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















