‘నేను మగాడిని కాదు, మహిళను’ రిటైర్మెంట్ కోసం అధికారులకు షాకిచ్చిన వృద్ధుడు, చట్టాన్ని భలే వాడేశాడు!

అక్కడి చట్టాలు.. పౌరులు తమ జెండర్‌ను ఎప్పుడు ఎలాగైనా మార్చుకోవచ్చు. దీంతో ప్రజలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

FOLLOW US: 

క ఏడాది ఆగితే అతడికి పెన్షన్ వస్తుంది. కానీ, అతడికి అంత ఓపిక లేదు. త్వరగా పెన్షన్ తీసుకోవాలనే ఆశతో ఏకంగా తన జెండర్‌నే మార్చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు(లింగ మార్పిడి సర్జరీ కాదు). కానీ, పెన్షన్‌కు, జెండర్ మార్పుకు సంబంధం ఏమిటనేగా మీ సందేహం? దీని గురించి మీకు తెలియాలంటే.. ఆ దేశంలో ప్రవేశపెట్టిన కొత్త చట్టం గురించి ముందుగా తెలుసుకోవల్సిందే. 

స్విట్జర్లాండ్‌లో ఇటీవల పెన్షన్ చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. ఆ సవరణ జరిగిన నాలుగు రోజుల్లోనే ఓ పెద్దాయన తాను పురుషుడిని కాదని, మహిళనని ప్రకటించుకున్నాడు. తన రిటైర్మెంట్‌కు అనుమతి ఇచ్చి.. పెన్షన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కొత్త చట్టం ప్రకారం.. మహిళలు 64 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుని పెన్షన్ తీసుకోవచ్చు. పురుషులు మాత్రం 65 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుని పెన్షన్ తీసుకోవాలి. దీంతో అతడు తన జెండర్‌ను మేల్ నుంచి ఫిమేల్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. స్వీట్జర్లాండ్ చట్టాల ప్రకారం.. పౌరులు తమ దరఖాస్తుల్లో తమకు నచ్చిన జెండర్‌ను రాయొచ్చు. అవసరమైతే మార్పులు కూడా చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు అధికారులకు తలనొప్పిగా మారింది. 

ఈ చట్టాన్ని ప్రవేశపెట్టే సమయంలోనే ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ జస్టీస్ మైఖెల్ మోంటిని ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ చట్టంలో లొసుగులను ఉపయోగించుకుని.. పదవీవిరమణ సమయానికి పురుషులు తమని తాము మహిళలుగా ప్రకటించుకుని ఏడాది కంటే ముందే రిటైర్మెంట్ పొందే అవకాశం ఉందని గతేడాది నవంబరు నెలలోనే చెప్పారు. చివరికి ఆయన చెప్పినట్లే జరిగింది. 

త్వరగా పదవీవిమరణ పొందేందుకు ఓ ఉద్యోగి.. తనను మహిళగా ప్రకటించుకున్నాడనే సమాచారం వైరల్‌గా చక్కర్లు కొట్టడంతో ఉద్యోగులు ఆ చట్టంలో మరిన్ని లొసుగుల గురించి వెతకడం ప్రారంభించారు. తప్పనిసరిగా సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించాలనే నిబంధనలను తమ అనుకూలంగా మార్చుకొనేందుకు లొసుగులు వెతుకుతున్నారు. ఎందుకంటే.. అక్కడ 18 ఏళ్లు దాటిన ప్రతి పురుషుడు సైన్యంలో చేరాలి. 

సైన్యంలో చేరకుండా తప్పించుకొనేందుకు అబ్బాయిలు 17 ఏళ్ల వయస్సు లోపు తమ జెండర్‌ను ఫీమేల్ అని ధరఖాస్తుల్లో మార్పు చేసుకోవచ్చయు. ఆ తర్వాత ఎప్పుడైనా మళ్లీ పురుషుడిగా మార్పు చేసుకోవచ్చు. రిటైర్మెంట్ కోసం ఈ లోసుగులను ఉపయోగించుకున్న పెద్దాయన అభ్యర్థన ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉంది. ప్రస్తుతమైతే ప్రభుత్వ అధికారులు అతడు చట్టాన్ని దుర్వినియోగం చేసే నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. కానీ, ప్రజలకు ఎప్పుడైనా సరే.. తమ ఇష్టానుసారం జెండర్‌ను మార్చుకొనే హక్కు ఉంది. మరి, కోర్టు ఆ పెద్దాయనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి. 

Published at : 04 Feb 2022 02:11 PM (IST) Tags: Switzerland స్విట్జర్లాండ్ Gender Change Man Changes Gender Gender Change For Retirement Switzerland Switzerland laws Switzerland laws

సంబంధిత కథనాలు

BreastMilk: బాలింతలకు పాలు బాగా పడాలంటే కొన్ని చిట్కాలు ఇవిగో...

BreastMilk: బాలింతలకు పాలు బాగా పడాలంటే కొన్ని చిట్కాలు ఇవిగో...

Oats Recipe: పోషకాల పుట్ట ఓట్స్ ఆమ్లెట్, ఎలా చేయాలంటే

Oats Recipe: పోషకాల పుట్ట ఓట్స్ ఆమ్లెట్, ఎలా చేయాలంటే

Tea: టీలో బెల్లం వేసుకుని తాగుతున్నారా? ఆయుర్వేదం వద్దని చెబుతోంది

Tea: టీలో బెల్లం వేసుకుని తాగుతున్నారా? ఆయుర్వేదం వద్దని చెబుతోంది

Six Ride On Activa: ఒకే స్కూటర్‌పై ఆరుగురు జర్నీ, ఒకరి భుజంపై మరొకరు ఎక్కి మరీ ప్రయాణం

Six Ride On Activa: ఒకే స్కూటర్‌పై ఆరుగురు జర్నీ, ఒకరి భుజంపై మరొకరు ఎక్కి మరీ ప్రయాణం

Eye Problems: కంటి చూపు అకస్మాత్తుగా మసకబారుతోందా? ఇది ఆ ముప్పుకు సంకేతం!

Eye Problems: కంటి చూపు అకస్మాత్తుగా మసకబారుతోందా? ఇది ఆ ముప్పుకు సంకేతం!

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!