అన్వేషించండి

Chandra Grahanam 2024: సెప్టెంబర్‌లో ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం - ఎక్కడెక్కడ కనిపిస్తుంది, ఆ రాశులవారు జాగ్రత్త!

Lunar Eclipse Of 2024 | ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఆరు నెలల కిందట మార్చి నెలలో ఏర్పడింది. సెప్టెంబర్ నెలలో ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం పట్టనుంది. కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది.

Lunar Eclipse 2024: ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం హోలీ రోజున ఏర్పడింది. 2024లో మొదటి చంద్రగ్రహణం (Chandra Grahan 2024) మార్చి 25న ఏర్పడింది. సెస్టెంబర్ నెలలో రెండో చంద్రగ్రహణం ఏర్పడనుందని మీకు తెలుసా. ఇది పాక్షిక చంద్ర గ్రహణం అని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇదే చివరి చంద్రగ్రహణం కానుంది. చంద్రగ్రహణం సమయంలో ఎలాంటి తీసుకోవాలి, ఎప్పుడు ఏర్పుడుతుందన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి నెలాఖరులో ఏర్పడగా, చివరిదైన రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ లో మరికొన్ని రోజుల్లో ఏర్పడుతుంది. చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న భాద్రపద పూర్ణిమ రోజు ఏర్పడుతుంది. ఈ సెప్టెంబర్‌లో పాక్షిక గ్రహణం పడుతుంది. ఈ పాక్షిక గ్రహణం ప్రభావం ప్రపంచంలోని పలు దేశాలపై పడనుంది. కొందరు గ్రహణాలను అశుభ సూచకంగా భావిస్తారు. గ్రహణం సంభవించిన సమయలో జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. రాహువు, చంద్రున్ని మింగిన సమయంలో గ్రహణం పడుతుందని సైతం ప్రచారంలో ఉంది. 

చంద్రగ్రహణం అంటే ఏమిటీ?
సూర్యుడు, చంద్రుడికి మధ్య భూమి వచ్చిన సమయంలో సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడకుండా ఉండే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీన్నే సాధరణంగా మనం గ్రహణం పట్టింది అంటాం. 

చంద్రగ్రహణం టైమింట్స్..
ఈ ఏర్పడే చివరి చంద్రగహణం సెప్టెంబర్ 18న ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఆరోజు ఉదయం 6:11 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఉదయం 10:17 గంటలకు గ్రహణం తొలగిపోతుంది. అంటే గ్రహణం కాల వ్యవది 4 గంటల 6 నిమిషాలు. చంద్రగ్రహణం పట్టడానికి ముందు సమయాన్ని సైతం అశుభ సమయం అంటారు. అయితే పగటిపూట సంభవించే  చంద్రగ్రహణానికి ఈ సూతక్ కాలం అనేది వర్తించదు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, కంటికి సాధారణంగా కనిపించే గ్రహణాల కోసం సూతక్ కాలం పరిగణిస్తారు. 

గ్రహణం పట్టడానికి 9 ముందు సుతక్ కాలం మొదలవుతుంది. అయితే త్వరలో ఏర్పడనున్న చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఉదయం వేళ పట్టే ఈ గ్రహణం మనకు కనిపించదు. కనుక సూతక్ కాలాన్ని సైతం ఎవరూ పాటించరు. 

చంద్రగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది..
భారత్ లో చంద్రగ్రహణం కనిపించదు. మన దేశంలో పగలు ఉంటే, అదే సమయంలో రాత్రి ఉండే చోట గ్రహణం కనిపిస్తుంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, పసిఫిక్ మహాసముద్రం,  హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటికా అట్లాంటిక్ మహాసముద్రం ప్రాంతాలవారికి ఈ గ్రహణం కనిపిస్తుంది. 

ఏ రాశులపై ప్రభావం చూపుతుంది..
సాధరణంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో అన్ని రాశులపై కచ్చితంగా గ్రహణాల ప్రభావం ఉంటుందని జ్యోతిష్కులు చెబుతుంటారు. అయితే కొన్ని రాశులవారిపై అధిక ప్రభావం ఉంటుంది. సెప్టెంబరు 18న ఏర్పడనున్న చంద్రగ్రహణం మేష రాశి, కర్కాటక రాశి, తులా రాశి, మకర రాశుల వారిపై అధిక ప్రభావం చూపుతుంది. ఈ రాశులవారు చంద్రగ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

 

[Disclaimer: The content of this article is based solely on astrological predictions, and should be taken as general guidance. Individual experiences may vary. ABP Desam does not assert the accuracy or validity of any claims or information presented. It is strongly recommended to consult a qualified expert before considering or implementing any information or belief discussed herein.]

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

రెండో వన్డేలో టీమిండియాలో భారీ మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
రెండో వన్డేలో టీమిండియాలో మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
Donald Trump Tariffs: ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం

వీడియోలు

Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు
Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రెండో వన్డేలో టీమిండియాలో భారీ మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
రెండో వన్డేలో టీమిండియాలో మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
Donald Trump Tariffs: ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
Bhartha Mahasayulaku Wignyapthi OTT : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వచ్చేది ఆ ఓటీటీలోకే - ఈ టీవీ ఛానల్‌లో రవితేజ మూవీ చూసెయ్యండి
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వచ్చేది ఆ ఓటీటీలోకే - ఈ టీవీ ఛానల్‌లో రవితేజ మూవీ చూసెయ్యండి
యూజ్డ్‌ Hyundai Venue కొనాలనుకుంటున్నారా? ముందుగా ఇవి తెలుసుకోకపోతే మీరు మోసపోతారు!
సెకండ్‌ హ్యాండ్‌ Hyundai Venue కొనే ముందే కారులో ఇవి చూడండి, లేదంటే బోల్తా పడతారు!
Andhra Pradesh News: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
Human Immortality: మనిషికి మరణం లేకుండా అమృతం తయారు చేస్తున్నారా? ఈ పనిలో ఏయే దేశాలు నిమగ్నమై ఉన్నాయో తెలుసా?
మనిషికి మరణం లేకుండా అమృతం తయారు చేస్తున్నారా? ఈ పనిలో ఏయే దేశాలు నిమగ్నమై ఉన్నాయో తెలుసా?
Embed widget