Love Bites : అమ్మో లవ్ బైట్స్ అంత డేంజరా.. మెడ మీద ఘాటైన ముద్దు ఇచ్చే లేదా కరిచే ఫాంటసీ ఉంటే జాగ్రత్త
Love bites and health risks : బైట్ చేయడం వల్ల వచ్చే ఘాటులను లవ్ బైట్స్ అంటారు. ప్రేమలో ఉన్నవారి మెడపై ఇవి కనిపించే అవకాశం ఎక్కువ. ఈ లవ్ బైట్స్‌తో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే..
Hidden Dangers of Love Bites (Hickeys) : లవ్ బైట్స్ అంటే దాదాపు అందరికీ తెలుస్తుంది. మెడపై లేదా శరీరంలోని ఇతర ఏ భాగంపై అయినా.. గట్టిగా ముద్దు పెట్టడం, స్మూచ్ చేయడం వల్ల వచ్చే మార్క్‌ను లవ్బైట్ లేదా హిక్కీ అంటారు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా.. ఇంకొకరి మెడపై ఆ మార్క్ ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. వాళ్లకంటే లవ్ బైట్స్ ఇచ్చే వాళ్లు ఉన్నారు.. మనకి ఎవరు ఇస్తారులే అని ఫీల్ అవుతున్నారా? అస్సలు అలా అనుకోకండి. ఆ లవ్ బైట్స్ చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
లవ్ బైట్స్ లేదా హిక్కీలు ప్రేమకు, ఎఫెక్షన్కు గుర్తే. కానీ కొన్ని సందర్భాల్లో ఇది అత్యంత ప్రమాదం కావొచ్చు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్య ఫన్నీ మూమెంట్స్‌లో అయినా చేతులపై కరుస్తూ ఉంటారు. కొందరికి మాత్రం వ్యాంపైర్స్లాగా కొరికే అలవాటు ఉంటుంది. చేతులపై కాకుండా.. మెడపై కరిచే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ సమయంలో ఇది మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు.
మెడపై యమ డేంజర్
మెడ అనేది సెన్సిటివ్ ఏరియా. ఆ ప్రాంతంలో చర్మం కాస్త డెలికేటెడ్‌గా ఉంటుంది. అక్కడ కరిచినప్పుడు లేదా సక్ చేసినప్పుడు బ్లడ్ వెజెల్స్పై ప్రెజర్ పడి బ్రేక్ అవుతాయి. అలా బ్రేక్ అయినప్పుడు కొందరికి పెటెచీ అని బ్లడ్ స్పాట్ ఏర్పడుతుంది. దానినే హిక్కీ, లవ్ బైట్ అంటున్నాము. ఇక్కడివరకు ఓకే కానీ.. కాస్త గట్టిగా మెడపై కరికినప్పుడు డేంజర్లో పడే అవకాశముంది.
ఇన్ఫెక్షన్ రావొచ్చు..
గట్టిగా మెడపై కరిచినప్పుడు అక్కడ వాపు రావొచ్చు. కొందరికి అది నొప్పిని, వాపును కలిగిస్తుంది. ఇది తగ్గడానికి ఎక్కవ సమయం పడుతుంది. మరికొందరికి ఈ బైట్ ద్వారా బాక్టీరియా శరీరంలోనికి ప్రవేశించి ఇన్ఫెక్షన్కి గురించేస్తుంది. ఇది గాయంగా మారి మరింత ప్రమాదం కావొచ్చు. మరికొందరికి ఆ ప్రాంతంలో దురద ఎక్కువగా వచ్చి.. గాయంగా మారే అవకాశం ఎక్కువ అవుతుంది.
ప్రాణాంతక సమస్యలు
బ్లడ్ బ్రోన్ సమస్య ఉన్న వాళ్లు.. హెచ్ఐవీ లేదా హెపటైటీస్ సమస్య ఉన్నవారు మీకు లవ్ బైట్ ఇచ్చినప్పుడు.. వారి పంటి ద్వారా మీకు ఆ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. మరికొందరిలో బ్లడ్ క్లాట్ అయిపోతుంది. కొందరిలో ఇది డిసార్డర్‌గా మారుతుంది. మరికొందరిలో అలెర్జీలు కూడా వస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీ పార్టనర్‌కి లవ్ బైట్ ఓకేనో కాదో తెలుసుకోండి. వారి కన్సర్న్ లేకుండా ఎలాంటి బైట్స్ ఇవ్వొద్దు. అలాగే హైజీన్‌గా ఉండేలా చూసుకోండి. ముద్దు పెట్టుకునే ముందు లేదా లవ్ బైట్ ఇచ్చే ముందు బ్రష్ చేసుకోవడం, మౌత్ వాష్ చేసుకోవడం చేయాలి. అలాగే లవ్ బైట్ తర్వాత ఆ ప్రాంతాన్ని సోప్ లేదా నీటితో కడగాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. బ్లడ్ బ్రోన్ డీసీజ్ ఉన్నవాళ్లు లవ్ బైట్స్ చేయకపోవడమే మంచిది. చివరిగా.. లవ్ బైట్ అనేది ఘాటుగానే కాదు.. కాస్త ప్రేమగా స్మూచ్ చేసిన సరిపోతుంది. కరిచేయాల్సిన పని లేదని గుర్తించుకుంటే.. లవ్ బైట్ బెస్ట్ మెమోరీని ఇస్తుంది.
Also Read : మచ్చలందు లవ్బైట్ వేరయా? దీనిని ఎలా తగ్గించుకోవచ్చంటే