By: ABP Desam | Updated at : 23 Feb 2022 04:24 PM (IST)
Representational Image/Pexels
Memory Loss With Cold | జలుబు వస్తే జ్వరం వస్తుంది. లేదా తలనొప్పి వస్తుంది. కానీ, మరీ మెమరీ లాస్ కావడం ఏమిటీ, అది కూడా 20 ఏళ్ల గతాన్ని మరిచిపోవడం ఏమిటీ, విడ్డూరం కాకపోతే అని అనుకుంటున్నారా? అయితే, ఇది సినిమా కథ కాదు. నిజంగానే జరిగింది.
లండన్‌లో నివసిస్తున్న క్లైర్ మఫెట్ అనే 43 ఏళ్ల విలేఖరికి ఎదురైన భయానక అనుభవం ఇది. క్లైర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2021లో ఓ రోజు ఆమె కొడుకుకు బాగా జలుబు చేసింది. ఆ తర్వాతి రోజు క్లైర్‌కు కూడా బాగా జలుబు చేసింది. అయితే, అది రాత్రి మరింత ఎక్కువైంది. చివరికి ఆమె కోమాలోకి జారుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ఆమెకు వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాసను అందించారు. దాదాపు ఆమెను చావును జయించి వచ్చింది. కానీ, తనని తాను మరిచిపోయింది. దాదాపు 20 ఏళ్ల నాటి మెమరీ మొత్తం లాస్ అయ్యింది.
తాజాగా ఆమె తన భర్త స్కాట్‌తో కలిసి ‘చానల్ 4’ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె తన చేదు అనుభవాన్ని వెల్లడించింది. తనకు ఇప్పటికీ చాలా విషయాలు గుర్తు రావడం లేదని చెబుతోంది. ఆ రోజు జలుబు తీవ్రం కావడం వల్ల ఆమెను రాయల్ లండన్ హాస్పిటల్‌లో చేర్చారు. అయితే, ఆమెకు జలుబు వల్ల మెదడు వాపు (encephalitis) సమస్య ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. దాని ప్రభావం వల్ల ఆమె సుమారు 16 రోజులు కోమాలోనే ఉంది.
కోమా నుంచి కోలుకున్న తర్వాత ఆమెకు ఏదీ గుర్తులేదు. ఆమె భర్త స్కాట్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా నా కొడుక మాక్స్‌కు జలుబు చేసింది. ఆ తర్వాత నా భార్య క్లైర్‌కు జలుబు సోకింది. సుమారు రెండు వారాల నుంచి ఆమె జలుబుతో బాధపడింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్రమేనా క్షీణించడం మొదలుపెట్టింది. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఆమె మూర్ఛపోయింది. దీంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. క్లైర్ మెదడులో రక్తస్రావం జరిగినట్లు వైద్యులు తెలుసుకున్నారు. అది మెదడువాపుకు దారి తీయడంతో ఆమె కోమాలోకి జారుకుందన్నారు’’ అని తెలిపాడు.
Also Read: ఉదయాన్నే శృంగారంలో పాల్గోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
రెండు వారాల తర్వాత క్లైర్ కోమా నుంచి బయటపడింది. కానీ, తన జ్ఞాపకశక్తిని కోల్పోయింది. చిత్రం ఏమిటంటే.. క్లైర్ తన కుటుంబ సభ్యుల ముఖాలను గుర్తించగలిగింది. కానీ, తన వివాహం, గర్భం, భర్త-పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసిన హాలీడేస్.. ఇలా 20 ఏళ్ల కిందట విషయాలన్నీ మరిచిపోయింది. చివరికి తన భర్త పెళ్లికి ఎలా ప్రపోజ్ చేశాడో కూడా తనకు గుర్తులేదని క్లైర్ చెప్పింది. మెదడులో రక్త స్రావం వల్లే ఆమెకు ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు వెల్లడించారు. మెదడు వాపు వ్యాధిని తక్కువ అంచనా వేయొద్దని వైద్యులు చెప్పారు. మెదడువాపు వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చని పేర్కొన్నారు. మెదడు వాపు లక్షణాలు, అది ఎందుకు ఏర్పడుతుంది? తదితర పూర్తి వివరాలను మీకు తెలుసుకోవాలని ఉంటే.. కింది లింక్‌ను క్లిక్ చేయండి.
Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!
Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్
Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!
Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం
Airtel Network Issue: ఎయిర్టెల్ వినియోగదారులకు నెట్వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!
Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?
IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్ బట్లర్ ఫెయిల్యూర్! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!