Living Room Makeover : తక్కువ బడ్జెట్‌లో లివింగ్ రూమ్‌కి అదిరిపోయే లుక్.. సింపుల్ టిప్స్‌తో మీ ఇంటిని మార్చుకోండి
Living room : ఇంటిని అందంగా తీర్చిదిద్దాలని అందరూ కోరుకుంటారు. లివింగ్ రూమ్ ను అలంకరించడానికి ఈ చిట్కాలు పాటించండి.

Living Room Makeover : ప్రతి ఒక్కరూ తమ ఇంటికి మంచి లగ్జరీ లుక్ ఇవ్వాలనుకుంటారు. దానికి తగ్గట్లే డిజైన్ చేయించుకుంటారు. కానీ ఇప్పటికే ఇంట్లో ఉంటూ లివింగ్ రూమ్‌కు మంచి లుక్ తీసుకురావాలనుకుంటే మీరు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి. ఇది మీ లివింగ్ రూమ్‌కి మంచి లగ్జరీ లుక్‌ని ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. తక్కువ బడ్జెట్‌లో మీ లివింగ్ రూమ్‌ని ఎలా మేక్ ఓవర్ చేయాలో ఇప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్ చూడొచ్చో తెలుసుకుందాం.
పెయింటింగ్స్
లివింగ్ రూమ్‌ను అందంగా కనిపించేలా చేయాలనుకున్నప్పుడు ముందు గోడల రంగును సెట్ చేసుకోవాలి. ఇది మీ ఇంటి పూర్తి లుక్‌ని హైలెట్ చేస్తుంది కాబట్టి దానికి మంచి రంగులు వేసుకోవడం ముఖ్యం. లివింగ్ రూమ్‌లో లేత రంగులతో పెయింట్ వేయించుకుంటే లుక్ ప్రశాంతంగా ఉండడంతో పాటు.. మంచి లుక్‌ని ఇస్తుంది. పైగా లైట్ కలర్ వేసుకోవడం వల్ల మీరు గోడపై మీకు నచ్చిన పెయింటింగ్స్ వేయించుకోవడం లేదా.. ఫోటో ఫ్రేమ్‌లు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవి మీ లివింగ్ రూమ్‌కు మరింత అందాన్నిస్తాయి. డార్క్ కలర్స్ లుక్‌ని కిల్ చేస్తాయని గుర్తించుకోవాలి.
టీవీ క్యాబినేట్..
లివింగ్ రూమ్‌లో టీవీని ఉంచాలనుకుంటే.. మీరు దానికి చిన్న క్యాబినేట్ సెట్ చేస్తే బాగుంటుంది. టీవీ చుట్టూ కొన్ని అలంకరణ వస్తువులను ఉంచవచ్చు. ఈ క్యాబినేట్ కోసం మంచి ఫర్నీచర్ చేయించుకోండి. వింటేజ్ లుక్స్‌ని ఇచ్చే వస్తువులు మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు వాటిని ఈ టీవి క్యాబినేట్‌పై ప్లేస్ చేసుకోవచ్చు. ఇది లివింగ్ రూమ్‌కి మంచి లుక్‌ని ఇస్తుంది.
మొక్కలు
లివింగ్ రూమ్‌ను అందంగా తీర్చిదిద్దడానికి.. మీరు కొన్ని ఇండోర్ మొక్కలు తీసుకోవచ్చు. మంచి సువాసన ఇచ్చే మొక్కలు తీసుకుంటే మరీ మంచిది. ఇవి ఇంటికి ఫ్రెష్ లుక్‌ని ఇస్తాయి. అలాగే మీరు లివింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు తాజాగా, ప్రశాంతంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి లివింగ్ రూమ్‌లో మొక్కలను ఉంచవచ్చు. ఇవి ఇంటి అందాన్ని పెంచడంతో పాటు.. మొత్తం ఇంటిని సువాసనతో నింపుతాయి. వీటి కోసం మీరు చెక్క లేదా ఇనుముతో ఒక ఓపెన్ అల్మారాను తయారు చేయించుకోవచ్చు. అలాగే కేవలం ఇండోర్ మొక్కలనే ఎంచుకోవాలని గుర్తించుకోండి. కుదిరితే మీరు నిజమైన మొక్కలతో పాటు.. కొన్ని నకిలీ మొక్కలను మధ్యలో ప్లేస్ చేయవచ్చు.
కాంబినేషన్ కర్టెన్లు
లివింగ్ రూమ్‌లోని ఫర్నిచర్ పాతదైతే.. మీరు దానిని మార్చుకుని కొత్తది చేయించుకోవచ్చు. అయితే కొత్త ఫర్నీచర్ పాతదానికంటే కాస్త భిన్నంగా ఉండేలా చూసుకోండి. అలాగే ఫర్నీచర్ పాతదే ఉంచితే.. దానిని మంచిగా పాలిష్ చేయించుకుని.. వాటిపైన వేసే దుస్తుల రంగులు మార్చుకుంటే మంచిది. అలాగే మీ లివింగ్ రూమ్ తలుపులపై అందమైన కాంబినేషన్ కర్టెన్లను ఉపయోగించవచ్చు. ఇది గది అందాన్ని మరింత పెంచుతుంది. దిండుల నుండి సోఫాల వరకు, మీరు గోడలు, కర్టెన్లకు సరిపోయే కవర్లను ఎంచుకోవచ్చు. కర్టెన్లు లేయర్స్, నెట్టెడ్వి ఎంచుకుంటే లుక్ బాగుంటుంది.
ఈ చిన్న మార్పులు మీ లివింగ్ రూమ్‌కి మంచి లగ్జరీ లుక్‌ని ఇస్తాయి. అలాగే మీకు కూడా రొటీన్ నుంచి మంచి రిలీఫ్ ఉంటుంది. అలాగే ఇంటిని ఎంత రెడీ చేసుకున్నా.. దానిని శుభ్రంగా ఉంచుకున్నప్పుడే మంచిగా ఉంటుంది. కాబట్టి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.






















