Vitamin D Deficiency : పిల్లల్లో ‘విటమిన్ - D’ లోపం చాలా డేంజర్ - ఇలా చేస్తేనే సేఫ్!
Vitamin D Deficiency : శరీరంలో తగినంత విటమిన్ డి లేకపోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్, అలసట, మధుమేహం వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
Vitamin D Deficiency in Children : విటమిన్-D లోపం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విటమిన్ సూర్యరశ్మి, గుడ్లు, మొక్కలు, చేపలు, మాంసం మొదలైన వాటి నుంచి లభిస్తుంది. అయితే పలు కారణాల వల్ల విటమిన్-D లోపం కేసులు ఈ మధ్య కాలంలో చాలా పెరుగుతున్నాయి. శరీరంలో విటమిన్-D తగినంత మోతాదులో లేకపోవడం వల్ల అలసట, వెన్నునొప్పి, గాయాలు నయం కాకపోవడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంట్లోనే కూర్చోవడం, ఎక్కువగా సన్ స్క్రీన్ రాయడం, ఇవన్నీ కూడా విటమిన్-D లోపానికి కారణాలు అని చెప్పవచ్చు. ఎముక ఆరోగ్యానికి నేరుగా ప్రభావితం చేసే కాల్షియం తయారీతో సహా పలు విధులను నిర్వహించడానికి శరీరానికి విటమిన్-D అవసరం. తరచుగా అలసటకు గురవ్వడం, అనారోగ్య సంబంధ సమస్యలు చుట్టుముడుతుంటే విటమిన్-D స్థాయిలను టెస్టుల ద్వారా తెలుసుకోవాలి.
విటమిన్-D అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సూర్యరశ్మి నుంచి UV-Bకి బహిర్గతమైన తర్వాతే డి-విటమిన్ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. విటమిన్-D ఎముక పెరుగుదల, జీవక్రియ ప్రక్రియలో ఒక స్టెరాయిడ్ హర్మోన్ గా ఉపయోగపడుతుంది. అవయవాలు, మూత్రపిండాలు, కాలేయానికి ఎంతో క్రీయాశీలకమైంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మధ్య విటమిన్-D లోపం అనేది కూడా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. బహిరంగంగా ఆటలు లేకపోవడం, ఇండోర్ గేములు, మొబైల్ ఫోన్లకు అతక్కుపోవడం, కంప్యూటర్ లపై గంటల తరబడి కూర్చోవడం వల్ల పిల్లల్లో ఈ లోపం తలెత్తుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
విటమిన్-D ప్రమాదంలో ఎవరు ఉన్నారు?
ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు విటమిన్-D లోపం బారిన పడుతున్నారు. వృద్ధులు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు కూడా ఈ ప్రమాదం ఉంది. కాలేయ వ్యాధి, మూత్ర పిండాల వ్యాధి, జన్యుపరమైన కారణాలతో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా విటమిన్-D లోపానికి గురవ్వుతున్నారు.
పిల్లల్లో విటమిన్-D లోపం ప్రమాదాన్ని తగ్గించే చిట్కాలు:
☀ విటమిన్-D లోపం వైద్యపరంగా, సీరం కాల్షియం, సీరం ఫాస్పేట్, ఆల్కలీన్ ఫాస్పేటేస్, సీరమ్ విటమిన్-D స్థాయిలు, రేడియోలాజికల్ తో సహా బయోకెమికల్ పరీక్షల ద్వారా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ పోషక లోపాన్ని నివారించడానికి సాధారణ చిట్కాలు ఇవే.
☀ విటమిన్-D లోపాన్ని ఫార్మకోలాజికల్, నాన్ ఫార్మకోలాజికల్ పద్దతుల ద్వారా నివారించవచ్చు.
☀ నాన్ ఫార్మకోలాజికల్ పద్దతుల్లో సూర్యరశ్మికి గురికావడం, పిల్లలను అవుట్ డోర్ తీసుకెళ్లడం, విటమిన్ డి ఎక్కువగా ఉండే చేపలు, గుడ్లు, పాలు, పుట్టగొడుగులు, జ్యూసులు ఇవ్వడం చాలా ముఖ్యం.
☀ విటమిన్-D మంచి మోతాదులో లభించాలంటే ఉదయం సూర్యరశ్మిలో ఉండటం చాలా మంచిది. గర్బిణీలు, పాలిచ్చే తల్లులు, శిశువులు ఎండలోకి వెళ్లడం వీలు కాకపోవచ్చు. కాబట్టి వీరికి సప్లిమెంట్స్ ఉంటాయి. శరీరం సూర్యరశ్మి కారణంగా విటమిన్-Dని ఉత్పత్తి చేస్తుంది. విటమిన్ అనేక రకాలైన ఆహారాలు, సప్లిమెంట్లరూపంలో కూడా లభిస్తుంది.
Also Read : పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.