News
News
X

Korea Red Ink: రెడ్ ఇంక్‌, 4వ నెంబరంటే కొరియాకు టెర్రర్.. పందులు కల్లోకి వస్తే పండగే, ఎందుకో తెలుసా?

కొరియా ప్రజలకు రెడ్ ఇంక్ అంటే భయం, నెంబర్ నాలుగంటే టెర్రర్.. అక్కడి ప్రజల వయస్సు ఇతర దేశీయుల కంటే ఒక ఏడాది ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసుకోవాలని ఉందా? చూసేయండి మరి.

FOLLOW US: 
Share:

మన దేశంలో ఎన్నో నమ్మకాలు ఉంటాయి. పిల్లి ఎదురుగా వస్తే చెడు జరుగుతుందని, శవం ఎదురైతే శుభసూచకమని.. ఇలా ఎన్నో విశ్వాసాలు ఉంటాయి. వీటిని చాలామంది మూఢ నమ్మకాలని కొట్టిపడేస్తారు. అయితే, ఈ నమ్మకాలు కేవలం ఇండియాలోనే కాదు.. ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటాయి. ఏయే దేశాల్లో ఎలాంటి నమ్మకాలు ఉంటాయో తెలుసుకొనే ముందు.. దక్షిణ కొరియా చుట్టివద్దాం. అదేనండి.. అక్కడి విశ్వాసాల గురించి తెలుసుకుందాం. 

కొరియా అమ్మాయి షూ లేదా చెప్పులు గిఫ్ట్‌గా ఇచ్చిందా? అంతే సంగతులు: కొరియాలో బోలెడంత ప్రేమ దొరుకుతుంది. అంతే త్వరగా బ్రేకప్‌లు కూడా జరుగుతాయి. అయితే, ప్రేమను ఎలాగైన వ్యక్తపరచవచ్చు. కానీ, బ్రేకప్ చెప్పడానికి మాత్రం వారికి కొన్ని సంకేతాలు ఉంటాయి. అవే.. షూ, చెప్పులు లేదా బూట్లు. ఒక వేళ అమ్మాయి లేదా అబ్బాయి తన లవర్‌కు వాటినికి కానుకగా ఇచ్చినట్లయితే.. ఇక వారితో బంధాన్ని తెంచుకున్నట్లే అని అర్థం. చెప్పులను అక్కడ ‘పారిపోవడం’ లేదా ‘దూరంగా వెళ్లిపోవడం’గా భావిస్తారు. అందుకే.. తమ లవర్‌కు బ్రేకప్ చెప్పేందుకు సింపుల్‌గా వాటిని గిఫ్టుగా పంపిస్తారు. 

రెడ్ ఇంక్ అంటే.. భయం భయం..: మన స్కూళ్లు లేదా కాలేజీల్లో రెడ్ పెన్‌లు తెగ వాడేస్తుంటారు. ముఖ్యంగా మార్కులు దిద్దేందుకు, తప్పులను అండర్‌లైన్ చేసేందుకు ఆ పెన్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, కొరియాలో మాత్రం ఆ ఇంకు పెన్ అస్సలు వాడరు. అక్కడి ప్రజలకు రెడ్ ఇంక్ అంటే భయపడతారు. అందుకే, ఎక్కడా ఆ ఇంక్ పెన్నులు విక్రయించరు. ఒక వేళ వాటిని విక్రయించినా.. బొమ్మలు లేదు డిజైన్లు గీయడానికే ఉపయోగించాలి. వాటితో మనుషుల పేర్లు రాయకూడదు. అలా చేస్తే.. ఆ పేరు గల వ్యక్తిని దురదృష్టం వెంటాడుతుందని, చనిపోయే ప్రమాదం ఉందని భావిస్తారు. కొరియాలో రెడ్ ఇంక్ పెన్నులను కేవలం చనిపోయిన వ్యక్తుల పేర్లను రాసేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే, అక్కడి స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ రెడ్ ఇంక్ పెన్ వాడరు.  ఒక వేళ విద్యార్థి తన పేరు గానీ, మరో విద్యార్థి పేరునుగానీ రెడ్ పెన్‌తో రాస్తే.. వారు చనిపోయే ప్రమాదం ఉందని భయపడతారు.

గడ్డం పెంచరు: దక్షిణ కొరియా చరిత్రలోకి తొంగి చూస్తే.. అంతా గుబురు గడ్డాలతో కనిపిస్తారు. కొందరికైతే చాలా పొడవైన గడ్డం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఉన్న కొరియాలో గడ్డం కలిగి ఉండటాన్ని వికృతం లేదా అపరిశుభ్రంగా భావిస్తారు. చివరికి ఉద్యోగం సంపాదించాలన్నా అక్కడ క్లీన్ షేవ్‌తో కనిపించాలి. 

కొరియా ప్రజలు ప్రపంచం కంటే ఒక ఏడాది పెద్దవాళ్లు: కొరియాలో పుట్టినవారికి మనకంటే ఒక ఏడాది వయస్సు ఎక్కువ ఉంటుంది. కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే.. ఆ లెక్క గురించి తెలుసుకోవల్సిందే. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు బిడ్డ పుట్టిన రోజు నుంచి వయస్సు లెక్కిస్తారు. కానీ, కొరియాలో మాత్రం గర్భ నిర్ధరణ రోజు నుంచే వయస్సును లెక్కిస్తారు. అంటే 9 నెలలో పుట్టినా సరే ఆ బిడ్డకు ఏడాది వయస్సు వచ్చినట్లు లెక్కిస్తారు. ఉదాహరణకు 2020లో ఒక బిడ్డ పుట్టాడనే అనుకుందాం. కొరియా లెక్క ప్రకారం.. అతడి వయస్సును 2020 - 2021 + 1 = 2గా లెక్కిస్తారు. అంటే కొరియా ఏజ్ ప్రకారం ఏడాది ఎక్కువన్నమాట. 

4వ నెంబర్ అంటే భయం: రెడ్ ఇంక్ తరహాలోనే కొరియా ప్రజలకు 4వ నెంబరు అంటే భయం. పాశ్చాత్య దేశీయులకు నెంబరు 13ను ఎలా అశుభంగా భావిస్తారో.. కొరియన్లు కూడా నెం.4ను అశుభంగా భావిస్తారు. ఆ సంఖ్య చావును సూచిస్తుందని కొరియన్లు చెబుతారు. ఇందుకు కారణం కొరియన్ సంఖ్య ‘4’.. కొరియన్లు పలికే ‘చావు’ పదం రెండూ ఒకేలా ఉంటాయి. కొరియాలో మరణాన్ని ‘సా’ అంటారు. నాలుగును కూడా ‘సా’ అంటారు. అందుకే కొరియాలో సంఖ్యలు పలికేప్పుడు నాలుగు పలకరు. అలాగే ఎవరూ నాలుగు సంఖ్యను ఉపయోగించరు. చివరికి వారి అపార్టమెంట్లలో 4వ అంతస్తు కూడా ఉండదు. 3వ అంతస్తు తర్వాత నేరుగా 5వ అంతస్తు వస్తుంది. అయితే, లెక్క ప్రకారం.. 5వ అంతస్తు 4 వస్తుంది.. కాబట్టి అన్ని ఫ్లోర్ల కంటే ఆ అంతస్తులో ఫ్లాట్లు తక్కువ రేటుకు అమ్ముడవుతాయట. 

Also Read: చీకటి గదిలో 25 ఏళ్లు బందీ.. కూతురికి నరకం చూపిన తల్లి, శరీరం కుళ్లుతున్నా..

ఇండియా తరహాలోనే ‘మంచి రోజులు’: ఇండియాలో గృహప్రవేశం లేదా అద్దెకు దిగాలంటే ముహూర్తం చూసుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే, మనం రోజులో ఎన్ని గంటలకు వెళ్తే మంచిదని చూసుకుంటాం. అయితే, కొరియా ప్రజలు ఏ రోజు మంచిదో చూసుకుని వెళ్తారు. ఈ సందర్భంగా అక్కడి ‘మూవర్స్’ కంపెనీలు తమ వెబ్‌సైట్లలో ఇల్లు మారేందుకు, లేదా కొత్త ఇంట్లోకి ప్రవేశించేందుకు మంచి, చెడు రోజుల వివరాలను పోస్ట్ చేస్తాయి. ఒక వేళ చెడు రోజుల్లో ఇల్లు మారితే.. దుష్ట శక్తులు వెంటాడుతాయని, మరణం తర్వాత జీవితం ఉండదని నమ్ముతారు. అనుకోని అతిథులు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడతారనే నమ్మకం కూడా ఉంది. అందుకే, అక్కడ ఇల్లు మారేప్పుడు తప్పకుండా మంచి రోజులు గురించి తెలుసుకుంటారు. 

Also Read: ఈ గ్రామంలో స్త్రీ, పురుషులకు వేర్వేరు భాషలు.. మరి ఇద్దరు కలిస్తే? వీరు దేవుడు చేసిన మనుషులట!

పందులు కల్లోకి వస్తే?: కొన్ని కలలు మంచి చేస్తాయని, మరికొన్ని చెడు చేస్తాయని మనం కూడా నమ్ముతాం. కొరియా ప్రజలకు కూడా అలాంటి నమ్మకం ఉంది. కొరియన్ సంస్కృతి ప్రకారం.. కలలో పందులు కనిపిస్తే.. డబ్బు, అదృష్టం కలిసివస్తుందని నమ్ముతారు. కలలో ఎన్ని పందులు కనిపిస్తే అంత ఎక్కువ సంపద లభిస్తుందని భావిస్తారు. 

Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?

Also Read: ‘అవి’ పెంచుకొనే సర్జరీ వికటించి.. కూర్చోలేక పాట్లు, నిలబడే కోట్లు గడిస్తున్న మోడల్

Published at : 08 Sep 2021 08:36 PM (IST) Tags: Korean Traditions Korea Weird Traditions Korea Beleifs Strange Things About Korea Korea beliefs కొరియా నమ్మకాలు

సంబంధిత కథనాలు

World Autism Awareness Day: ఆటిజం అంటే ఏమిటి? పిల్ల‌ల్లో ఆటిజం ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?

World Autism Awareness Day: ఆటిజం అంటే ఏమిటి? పిల్ల‌ల్లో ఆటిజం ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?

నాకూ, నా భర్తకు మధ్యలో మా అత్తగారు - ఆవిడ ప్రవర్తన నాకు నచ్చడం లేదు

నాకూ, నా భర్తకు మధ్యలో మా అత్తగారు - ఆవిడ ప్రవర్తన నాకు నచ్చడం లేదు

Summer Foods: వేసవిలో కచ్చితంగా తీసుకోవలసిన ఆహారాలు ఇవే, బరువు తగ్గడం ఖాయం

Summer Foods: వేసవిలో కచ్చితంగా తీసుకోవలసిన ఆహారాలు ఇవే, బరువు తగ్గడం ఖాయం

Arthritis: ఈ భయంకరమైన లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు- ఆ ముప్పు బారిన పడిపోతారు

Arthritis: ఈ భయంకరమైన లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు- ఆ ముప్పు బారిన పడిపోతారు

Ayurvedam Tips: జీర్ణక్రియను మెరుగుపరిచే ఐదు ఆయుర్వేద మార్గాలు ఇవిగో

Ayurvedam Tips: జీర్ణక్రియను మెరుగుపరిచే ఐదు ఆయుర్వేద మార్గాలు ఇవిగో

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్