News
News
X

Turmeric: కిడ్నీ రోగులు పసుపు తినకూడదా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి

ఎన్నో రకాలుగా మంచి చేసే పసుపు అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

FOLLOW US: 

భారతీయ సంప్రదాయానికి పెట్టింది పేరు పసుపు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండే పసుపు అన్ని విధాలా మంచే చేస్తుంది. పండగ వచ్చిందంటే చాలు పసుపుతో అమ్మవారిని చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఎటువంటి కీడు చెడులు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు భారతీయ గృహిణులు తప్పనిసరిగా గుమ్మాలకు పసుపు రాస్తారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే తప్పనిసరిగా కాళ్ళకి పసుపు రాస్తారు. ఇవే కాదు వంటలకు కూడా పసుపు ముఖ్యమే. వంటకు పసుపు అదనపు రుచిని జోడిస్తుంది. అంతే కాదు మెరిసే చర్మం కోసం కూడా పసుపే ఆధారం. పసుపు, శనగపిండి కలిపి పేస్ట్ లా ముఖానికి రాసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

జాలువు చేసినప్పుడు పసుపు వేసుకుని పాలు తాగడం, ఆవిరి పట్టడం వంటివి చెయ్యమని చెప్తారు పెద్దలు. ఎందుకంటే ఇండలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు రోగాన్ని నయం చెయ్యడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటారు. అందుకే పసుపు పాలు తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇన్ని మంచి గుణాలు కలిగిన పసుపు అతిగా వాడటం వల్ల అనార్థాలు కూడా ఉన్నాయి. పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఈ పసుపు వల్ల కిడ్నీ, కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రతికూలతలు కూడా ఉన్నాయి.

పసుపుని సూపర్ ఫుడ్ గా మార్చే ప్రధాన మూలకం కర్కుమిన్. నొప్పిని నయం చెయ్యడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇది ఉపయోగపడుతుంది. అయితే దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది.  

కిడ్నీలను ఎలా ప్రభావితం చేస్తుంది?

పసుపులోని కర్కుమిన్‌లో అధిక మొత్తంలో ఆక్సలేట్‌లు ఉన్నాయి, ఇవి మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. అంతే కాదు వాటి పనీతిరుకి కూడా ఆటంకం కలిగిస్తాయి. కర్కుమిన్ వేడి శక్తిని కలిగి ఉంటుంది. దీని వల్ల తరచుగా అతిసారం, అజీర్ణంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

కాలేయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

పసుపులో కర్కుమిన్ ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంతోపాటు ఫైబ్రాయిడ్‌ల పురోగతిని మందగించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉన్న క్యాన్సర్ నిరోధక గుణాలు కాలేయానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి అయితే అది పసుపును మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన కాలేయ పనితీరుపై జరిపిన అధ్యయనంలో కూడా అదే నిరూపితమైంది.

ఎంత మోతాదులో తీసుకోవాలి?

ఆరోగ్య నిపుణులు సూచన ప్రకారం రోజు మొత్తం మీద పసుపు వినియోగం 2000 మిల్లీ గ్రాములకి మించకూడదు. కనీసం 500 మిల్లీగ్రాముల పసుపు తీసుకోవడం తప్పనిసరి.

అతిగా పసుపు తీసుకోవడం వల్ల నష్టాలు

పసుపు అధికంగా తీసుకునే వారిలో ఐరన్ లోపం కనిపిస్తుంది. ఇది శరీరం ఇనుమును శోషించుకునే గుణాన్ని తగ్గిస్తుంది. పసుపు అధికంగా తినడం వల్ల ఇనుము శోషణ 20 శాతం నుంచి 90 శాతానికి పడిపోతుంది. ఇది పసుపులో ఉండే స్టోయికియోమెట్రిక్ లక్షణాల వల్ల జరుగుతుంది. ఈ లక్షణం వల్లే ఇనుమును శరీరంలో శోషించలేదు. పసుపు అధికంగా ఒంట్లో చేరడం వల్ల కేవలం ఇనుము లోపించడమే కాదు, జీర్ణ సమస్యలు, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి. పేగు, లేదా కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: కొలెస్ట్రాల్ తగ్గించే బ్లాక్ రైస్ - ఇది తినడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Also Read: జుట్టు చివర్లు చిట్లిపోయి ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే అద్భుత ఫలితం

Published at : 03 Sep 2022 09:09 PM (IST) Tags: Turmeric Benefits Turmeric Turmeric Side Effects Kidney Turmeric Effects Kidney

సంబంధిత కథనాలు

Viral News: వామ్మో, గిన్నిస్ రికార్డు కోసం కోడి కాళ్లను ఒక్క నిమిషంలో కసకస నమిలేసింది

Viral News: వామ్మో, గిన్నిస్ రికార్డు కోసం కోడి కాళ్లను ఒక్క నిమిషంలో కసకస నమిలేసింది

Morning Drinks: టీ, కాఫీలు కాదు - ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!

Morning Drinks: టీ, కాఫీలు కాదు - ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!

Cardiac Arrest: ఆకస్మిక గుండె నొప్పి ఎలా వస్తుంది? ఆ ముప్పు నుంచి బయటపడేదెలా?

Cardiac Arrest: ఆకస్మిక గుండె నొప్పి ఎలా వస్తుంది? ఆ ముప్పు నుంచి బయటపడేదెలా?

Meals: భోజనం తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు

Meals: భోజనం తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు

Cough Syrups Banned: దగ్గు మందు అంత ప్రమాదకరమా? ఆ పిల్లల మరణానికి కారణాలేమిటీ?

Cough Syrups Banned: దగ్గు మందు అంత ప్రమాదకరమా? ఆ పిల్లల మరణానికి కారణాలేమిటీ?

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా

Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!