Frizzy Hair: జుట్టు చివర్లు చిట్లిపోయి ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే అద్భుత ఫలితం
అమ్మాయిల అందాన్ని మరింత రెట్టింపు చేసేది వాళ్ళ జుట్టే. అయితే జుట్టు చిట్లిపోయి ఇబ్బందికి గురి చేస్తూనే ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే ఇవిగో మార్గాలు
సాధారణంగా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టేది జుట్టు చివర్ల స్ప్లిట్స్. మనం ఎంత అందంగా రెడీ అయినా కూడా జుట్టు సరిగా లేకపోతే ఆకర్షణీయంగా కనిపించము. చర్మ సౌందర్యం ఎంత ముఖ్యమో జుట్టు సంరక్షణ కూడా అంతే ముఖ్యం. అందుకే జుట్టుని రక్షించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము. కానీ ఒక్కోసారి అవి బెడిసికొట్టి జుట్టు రాలే సమస్యని తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అందుకే వంటింట్లో దొరికే వాటితోనే చాలా మంది సులభంగా తమ జుట్టుని రక్షించుకునే మార్గాలు చూసుకుంటారు. కొబ్బరి నూనెలో మందార ఆకులు, కరివేపాకు, మెంతుల పొడి వేసి బాగా మరిగించి తలకి దట్టంగా పట్టిస్తారు. ఇలా చెయ్యడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయట పడొచ్చు. అంతే కాదు జుట్టు కూడా మృదువుగా మరి పెరిగేందుకు దోహదపడుతుంది.
వర్షాకాలంలో అయితే జుట్టుని సంరక్షించుకోవడం పెద్ద సవాల్ అనే చెప్పాలి. వర్షంలో తడవడం, కాలుష్యం వల్ల జుట్టు చిట్లిపోవడం జరుగుతుంది. తడిచిన ప్రతి సారి తలస్నానం చెయ్యడం బిజీ లైఫ్ లో కుదరకపోవచ్చు. దాని వల్ల హెయిర్ నిర్జీవంగా కనిపిస్తూ పెళుసుగా మారిపోతుంది. జుట్టు చివర్ల చిట్లి పోయి రాలిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే వంటింటి చిట్కాలతోనే జుట్టును సంరక్షించుకోవాలి.
❂ కొబ్బరి నూనెతో జుట్టుకి మర్దన చేసుకోవడం అనేది పాతకాలం నుంచి వస్తున్న అద్భుతమైన రెమిడీ. అది ఇప్పటికీ అందరూ అమలు చేస్తారు. కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల జుట్టు సహజమైన మెరుపుని మృదుత్వాన్ని పునరుద్ధరిస్తుంది. అందుకే జుట్టు చివర్ల చిట్లి పోయినప్పుడు బాగా కొబ్బరి నూనెతో మసాజ్ చెయ్యడం ఉత్తమమైన మార్గం.
❂ వర్షాకాలంలో జుట్టు చిట్లినప్పుడు హీటింగ్/ స్టైలింగ్ చేసే వస్తువులు ఉపయోగించకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి జుట్టుకు మరింత హాని చేస్తాయి. తప్పని సరి పరిస్థితుల్లో బ్లూ డ్రైయర్ ని ఉపయోగించాల్సి వస్తే జుట్టుకి ముందుగా కొంచెం కొబ్బరి నూనెతో స్ప్రే ఫార్మాట్ లో కండిషన్ చేయడం మరచిపోవద్దు. ఇది జుట్టుని రక్షించి ఎటువంటి హాని కలగకుండా చేస్తుంది.
❂ మీరు ఉపయోగించే ఉత్పత్తుల్లో ప్రోటీన్, కేరాటిన్ ఆధారిత పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి జుట్టుకి కండిషనర్ గా ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల చిట్లిన జుట్టుని బాగు చేయడమే కాకుండా మెరిసేలా చేస్తుంది.
❂ డ్రై షాంపూ బాటిల్‌ని అందుబాటులో ఉంచుకోవాలి. ఎందుకంటే బిజీ లైఫ్ వల్ల తల, జుట్టు వర్షపునీటిలో తడిసి మురికిగా మారిన ప్రతిసారీ కడగడం అనేది కుదరకపోవచ్చు. అందుకే తలస్నానానికి బదులుగా డ్రై స్కాల్ప్, జిడ్డైన జుట్టుకు వ్యతిరేకంగా కొన్ని డ్రై షాంపూలను స్ప్రే చేసుకోవచ్చు, ఇవి అద్భుతంగా పని చేస్తాయి.
❂ జుట్టు చిట్లిపోతే దాన్ని కత్తిరించుకోవచ్చు. ఇది స్ప్లిట్ ఎండ్ నుంచి మీ జుట్టును రక్షిస్తుంది. అది కనుక అలాగే ఉంటే జుట్టు రాలే సమస్యకి కారణమవుతుంది. జుట్టు ఎక్కువగా ముడి పెట్టుకుని ఉండటం కూడా శ్రేయస్కరం కాదు. ఎందుకంటే జుట్టుని బలంగా లాగి ముడి పెట్టడం వల్ల నుదురు భాగంలో జుట్టు బలహీనంగా మారి బట్టతల వచ్చే అవకాశం ఉంది.
Also read: గుడ్ న్యూస్ గుండె పోటు తర్వాత గుండెని రక్షించేందుకు ఇంజెక్షన్ - శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
Also Read: పవన్ కళ్యాణ్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే, మీరు కూడా ట్రై చేయండి