అన్వేషించండి

Lion In Bush: అదుగో సింహం, జనాలు పరుగో పరుగు, సీన్ కట్ చేస్తే..

ఓ వ్యక్తి పొదల్లో సింహాన్ని చూసి భయపడ్డాడు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశాడు. దగ్గరకు వెళ్లి చూసి.. అధికారులు షాకయ్యారు. ఆ తర్వాత కడుపుబ్బా నవ్వుకున్నారు.

ఓ వ్యక్తికి పొదల్లో ఓ సింహం కనిపించింది. దీంతో అతడి కాళ్లు గజగజ వణికిపోయాయి. అటుగా వచ్చేవాళ్లను కూడా అప్రమత్తం చేసి.. దగ్గరకు వెళ్లొద్దని చెప్పాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన అక్కడికి చేరిన అధికారులు కూడా పొదల్లో నుంచి నక్కి నక్కి చూస్తున్న సింహాన్ని చూశారు. అది అక్కడి నుంచి కదలకుండా జనాలు చేస్తున్న హడావిడి అంతా చూస్తోంది. కనీసం రెప్ప కూడా వేయడం లేదు. దాన్ని పట్టుకోడానికి వచ్చిన సిబ్బంది కూడా దాని దగ్గరకు వెళ్లే సాహసం చేయలేదు. కొన్ని నిమిషాల తర్వాత వారు ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒట్టి చేతులతోనే దాన్ని సమీపించారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మీరు ఊహించలేరు. కెన్యాలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలిసి నెటిజనులు పగలబడి నవ్వుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

మౌంట్ కెన్యా నేషనల్ పార్క్‌కు సుమారు ఓ కిలోమీటరు దూరంలో ఓ రైతుకు పొదల్లో సింహం కనిపించింది. దీంతో అతడు అధికారులకు ఫిర్యాదు చేసి అప్రమత్తం చేశాడు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సింహాన్ని పట్టుకోడానికి సిద్ధమయ్యారు. అయితే, అది ఎంతకీ కదలకపోవడంతో దగ్గరకు వెళ్లి చూసి షాకయ్యారు.

ఇంతకీ అది సింహం కాదు. సింహం ఫొటో ప్రింట్ చేసివున్న బ్యాగ్. ఈ ఘటనపై ‘కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్’ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తే ఆ బ్యాగ్ అక్కడ పెట్టాడని తెలిసింది. అవకాడో మొక్కలు ఎండ వేడికి మాడిపోతాయనే ఉద్దేశంతో ఆ బ్యాగ్‌లో వేసి పొదల్లో పెట్టాడు.  

ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉండటంలో తప్పులేదు. ఒక వేళ అక్కడ నిజంగానే సింహం ఉన్నట్లయితే పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. నేషనల్ పార్క్‌ కూడా ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉంది. మన ఇండియాలో కూడా ఒక్కోసారి పులులు జనావాసాల్లోకి వస్తుంటాయి. ఇటీవల ఓ ఫారెస్ట్ అధికారి పోస్ట్ చేసిన వీడియో చూస్తే వణికిపోతారు. 

జనవాసాల్లోకి వచ్చిన ఓ పులి ఇంటి గేటు ముందుకు వచ్చి ఆహారం కోసం వెతకసాగింది. దానికి ఆ ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క కనిపించింది. అంతే.. అమాంతంగా గేటు దూకేసింది. దాన్ని చూడగానే కుక్క పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ, అప్పటికే ఆలస్యమైంది. పులి.. దాని పీకను నోటితో పట్టుకుని గోడ దూకి తీసుకెళ్లిపోయింది. పులి నుంచి తమ యజమానిని కాపాడే క్రమంలో ఆ కుక్క ప్రాణాలు కోల్పోయింది. 

Also Read: భూమి తిరగడం ఆగిపోతే అంత భయానకంగా ఉంటుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన ఖగోళ శాస్త్రవేత్త 

Also Read: అతడి అంగాన్ని చేతికి కుట్టేసిన వైద్యులు, కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

టాప్ హెడ్ లైన్స్

Morning Habits : ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కాఫీ, టీ లేకుండా మిమ్మల్ని ఎనర్జీటిక్​గా మార్చే 5 సింపుల్ అలవాట్లు ఇవే
ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కాఫీ, టీ లేకుండా మిమ్మల్ని ఎనర్జీటిక్​గా మార్చే 5 సింపుల్ అలవాట్లు ఇవే
Darker Mehndi Colour : మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే
మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
Besan Ladoo : దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget