News
News
X

Kareena kapoor: కరీనా అందం, ఫిట్నెస్ వెనుక రహస్యం ఏంటంటే...

ఇద్దరు పిల్లల తల్లయినా కరీనా సూపర్ ఫిట్ గా ఉండడమే కాదు, మరింత అందంగా కనిపిస్తోంది. ఆమె ఫిట్ నెస్ వెనుక రహస్యాన్ని చెప్పేసింది యోగా ట్రైనర్ అనుష్క పర్వాని.

FOLLOW US: 

కరీనా ఫిట్ నెస్ విషయంలో ఎక్కడా రాజీపడదు.  రెండో బాబు పుట్టి ఇంకా ఏడాది కూడా కాకముందే సూపర్ ఫిట్ గా మారి సినిమా షూటింగులకు సిద్ధమైపోయింది. కరీనా ఇంత త్వరగా మానసికంగా, శారీరకంగా ఫిట్ గా షూటింగులకు రెడీ అవ్వడం వెనుక కారణాన్ని ఆమె వ్యక్తిగత యోగా ట్రైనర్ అనుష్క నెటిజన్లతో పంచుకుంది. 

తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కరీనాను ఉద్దేశించి ‘నాకు నిన్ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది బెబో, చాలా తక్కువ సమయంలోనే 108 సూర్యనమస్కారాలు చేయగలిగావు. ఇది మనం కలిసి సాధించాం. శారీరకంగా ఇది చాలా కష్టమైన ప్రక్రియే కానీ ఇది నీ బలమైన సంకల్పశక్తి, క్రమశిక్షణతోనే సాధ్యమైంది. మనిద్దరం కలిసి మరిన్ని కొత్త లక్ష్యాలను చేరుకుంటామని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని పోస్టు పెట్టింది అనుష్క. 

Also read: కంగనా వేసుకున్న ఆ నగలు, చీర ఎప్పటివో తెలుసా...

108 సూర్యనమస్కారాలు చేయడం అంత సులువు కాదు. అందులోనూ రెండో ప్రసవం జరిగి ఇంకా ఏడాది కాకముందే కరీనా దీన్ని సాధించింది.  వీటిని చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తద్వారా అందం కూడా ఇనుమడిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీని వల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది. అంతర్గత అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. నరాల వ్యవస్థను క్లెన్సింగ్ చేస్తుంది. మానసికంగా మనిషిని దృఢముగా మారుస్తుంది. అయినా కరీనాకు బరువు తగ్గడం కొత్తేమీ కాదు. 2008లో జీరో సైజులోకి మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. 68 కిలోలుండే కరీనా 48 కిలోలకు చేరుకుంది. కేవలం వ్యాయామాలు, మీల్ ప్లాన్ ద్వారానే కరీనా జీరో సైజుని సాధించినట్టు అప్పట్లో చెప్పింది.

Also read: అంతులేని వ్యథ.. అవని గాథ.. ఆ ప్రమాదం ఆమెను కదలకుండా చేసింది, కానీ..

కరీనా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రెండో బాబుకు జన్మనిచ్చింది. 2016 లో తొలి బిడ్డ తైమూర్ అలీ ఖాన్ కు జన్మనిచ్చింది. పెళ్లికి ముందు జోరుగా సినిమాలు చేసిన కరీనా, పెళ్లి తరువాత మాత్రం కాస్త వేగం తగ్గించింది.  ప్రస్తుతం అమీర్ ఖాన్ ప్రధానపాత్రలో నటిస్తున్న ‘లాల్ సింగ్ ఛద్దా’లో నటిస్తుంది. ఆ సినిమా కోసమే డెలివరీ కొన్ని నెలలకే కరీనా బరువు తగ్గి, ఫిట్ గా తయారైంది. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్నారు. 

Also read: ఇన్‌స్టాగ్రామ్‌తో డబ్బులే డబ్బులు.. ఇదిగో ఇలా సంపాదించండి

Published at : 06 Sep 2021 02:07 PM (IST) Tags: Kareena Kapoor Fitness Freak Yoga Trainer suryanamaskaras

సంబంధిత కథనాలు

పెద్ద పేగు క్యాన్సర్ చాలా డేంజర్ - ఈ నాలుగూ పాటిస్తే సమస్యలు పరార్!

పెద్ద పేగు క్యాన్సర్ చాలా డేంజర్ - ఈ నాలుగూ పాటిస్తే సమస్యలు పరార్!

Weight Loss: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదని బాధపడుతున్నారా? అందుకు కారణాలివే!

Weight Loss: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదని బాధపడుతున్నారా? అందుకు కారణాలివే!

Mother Care Tips: కాబోయే అమ్మలకి ఆలియా ఆరోగ్య సూత్రాలు

Mother Care Tips: కాబోయే అమ్మలకి ఆలియా ఆరోగ్య సూత్రాలు

Type 2 Diabetes: మధుమేహులకి గుడ్ న్యూస్ - ఈ ప్రోటీన్ సప్లిమెంట్‌తో అదుపులోకి షుగర్ లెవల్స్

Type 2 Diabetes: మధుమేహులకి గుడ్ న్యూస్ - ఈ ప్రోటీన్ సప్లిమెంట్‌తో అదుపులోకి షుగర్ లెవల్స్

Viral News: వామ్మో, గిన్నిస్ రికార్డు కోసం కోడి కాళ్లను ఒక్క నిమిషంలో కసకస నమిలేసింది

Viral News: వామ్మో, గిన్నిస్ రికార్డు కోసం కోడి కాళ్లను ఒక్క నిమిషంలో కసకస నమిలేసింది

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!