By: Haritha | Updated at : 28 Mar 2023 10:59 AM (IST)
(Image credit: Pixabay)
సోయాబీన్స్ ను ఉపయోగించి చేసే ఉత్పత్తి సోయా చంక్స్. వీటిని సోయా మీల్ మేకర్ అంటారు. వీటిని అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా దీన్ని శాఖాహార మాంసంగా పిలుస్తారు. దీనిని బిర్యానీలో వేసుకోవడమే కాదు కూరలు, ఫ్రైలు కూడా చేసుకుంటారు. రుచి అదిరిపోతుంది. సోయా గ్రాన్యూల్స్, సోయా నగ్గెట్స్, సోయా చంక్స్ ఇలా రకరకాల ఆకారాల్లో దొరుకుతాయి. సోయాబీన్స్ నుంచి నూనెను తయారు చేసేటప్పుడు మిగిలే పిండితో వీటిని తయారు చేస్తారు. అయితే వీటిని తినాలా వద్దా అనే విషయంలో కొన్ని వాదనలు వాడుకలో ఉన్నాయి.
సోయా చంక్స్‌ను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తూ ఉంటే, మరికొందరు హార్మోన్ అసమతుల్యతకు ఇవి కారణం అవుతాయని అంటుంటారు. వీటిలో ఎంతవరకు నిజమో పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సోయా ప్రోటీన్‌కు అద్భుత మూలం. 100 గ్రాముల సోయా మీల్ మేకర్‌ను తింటే 52 మిల్లీగ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. 100 గ్రాముల సోయా మిల్ మేకర్ ద్వారా 21 మిల్లీ గ్రాముల ఇనుము శరీరానికి అందుతుంది. అలాగే 10 గ్రాముల ఫైబర్ కూడా అందుతుంది. అందుకే శాఖాహారులు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో సోయా కూడా ఒకటి. ముఖ్యంగా ప్రోటీన్ లోపం రాకుండా చేయడంలో ఇది ముందుంటుంది. అంతేకాదు వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి.
మగవారు తినకూడదా?
చాలామంది మగవారిలో సోయా మీల్ మేకర్‌ను తినడం సురక్షితం కాదని భావన ఉంది. దీనికి కారణం ఏమిటంటే సోయాబీన్స్‌లో ఫైటో ఈస్ట్రోజన్ అని పిలిచే వివిధ రకాల మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజన్ హార్మోన్‌కు సమానమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈస్ట్రోజన్ అనేది స్త్రీ హార్మోన్. సోయా అధికంగా తినడం వల్ల మగవారి శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయని, దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు అని ఎంతోమంది భావన. అయితే ఇది శాస్త్రీయంగా ఇంతవరకు నిరూపణ జరగలేదు, కాబట్టి ఇది నిజమో కాదో చెప్పే అవకాశం కూడా లేదు.
మితంగా తీసుకుంటే...
ఏ ఆహారాన్నయినా మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. అలాగే సోయా మీల్ మేకర్ ను కూడా మితంగా తీసుకుంటే శరీరానికి ఆరోగ్యమే తప్ప అనారోగ్యం ఉండదు. వండే ముందు ఈ సోయా మీల్ మేకర్ లేదా చంక్స్‌ను నీళ్ళల్లో నానబెట్టి చాలాసార్లు పిండాలి. ఆ తర్వాత ఉడికించాలి. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమవుతాయి. కాబట్టి వీటిని తిన్నా కూడా సులభంగా జీర్ణం అవుతాయి.
Also read: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!
World No Tobacco Day: సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త!
WeightLoss: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? ధనియాల నీళ్లతో త్వరగా తగ్గొచ్చు
Relationships: నా కూతురు ముందే నా భర్త నన్ను కొట్టాడు, నేను అలానే చేయాలనుకుంటున్నాను
Black Apples: బ్లాక్ డైమండ్ ఆపిల్స్ గురించి విన్నారా? నల్ల వజ్రాల్లా మెరుస్తాయివి
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!