ఇది హ్యాండ్ బ్యాగే కాదు గన్ కూడా, మహిళల ఆత్మరక్షణ కోసమే ప్రత్యేకం
మహిళలకు రక్షణ కరవవుతున్న కాలం ఇది. అందుకే ఆత్మ రక్షణకు కొత్త పరికరాలు వస్తున్నాయి.
ప్రేమ పేరుతో హింస, లైంగిక వేధింపులు, ఆకతాయిల అల్లర్లు... ఆధునిక అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో. వారు ధైర్యంగా ఉండడంతో పాటూ, తమను తాము కాపాడుకునే శక్తిని కలిగి ఉండాలి. ఇలా ఆలోచించిన ఓ వ్యక్తి మహిళ రక్షణ కోసం ఒక కిట్‌ను రూపొందించాడు. అందులో ఒక హ్యాండ్ బ్యాగ్, చెవి రింగులు, చెప్పులు వస్తాయి. ఈ మూడింటికీ టెక్నాలజీ సాయంతో ప్రత్యేకమైన శక్తిని అందించాడు. ఇవి దగ్గర ఉంటే ఆ స్త్రీ ఎక్కడ ఉన్న వెంటనే సహాయం అందేలా చేస్తాయి. వీటిని ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్యామ్ చౌరాసియా రూపొందించాడు. మహిళల స్వీయ రక్షణ కోసం ఆయన ఈ కిట్‌ను రూపొందించాడు.
A girls/women's safety weapon developed by Shyam Chaurasia.....Interesting. pic.twitter.com/at5FrOseYU
— Om M (@OxomiyaDhulia) July 18, 2020
చూసేందుకు ఈ కిట్ లోని హ్యాండ్ బ్యాగ్ చాలా అందంగా ఉంటుంది.కానీ లోపల ఇన్‌బిల్ట్ గన్ ఉంటుంది. పర్సుపై ఉన్న చిన్న రెడ్ బటన్ నొక్కడం వల్ల గన్ పేలుతుంది. మహిళలకు మరీ ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడినప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ఇది ప్రాణాలు తీసేంత శక్తివంతమైనది కాకపోయినా, గాయపరుస్తుంది. కాబట్టి కచ్చితంగా ఆ పరిస్థితుల నుంచి లేదా దుండగుడి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఈ కిట్ చెప్పులు, చెవిపోగులు కూడా సాయం చేసేందుకే ఉన్నాయి. చెవిపోగుల్లో జీపీఎస్ ఉంటుంది. అది మీ లొకేషన్ జీపీఎస్ ట్రాకింగ్ మెకానిజం ద్వారా ఇతరులకు తెలిసేలా చేస్తుంది. అంతేకాదు అత్యవసర సమయంలో కాల్ ఫీచర్ ను కూడా కలిగి ఉంది. చెప్పులు కూడా విద్యుత్ తరంగాలను కలిగి ఉంటాయి, ఎదుటివ్యక్తిని తన్నడం వల్ల వారికి కరెంట్ షాక్ తగులుతుంది.
దీని ధర రూ.2497. వీటిని రెండు వారాలకోసారి ఛార్జింగ్ పెట్టుకోవాలి. త్వరలో దీన్ని మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు. ప్రతి అమ్మాయి దగ్గర కచ్చితంగా ఉండాల్సిన ఆత్మరక్షణ కిట్ ఇది. సమాజంలో పరిస్థితులు బాగోలేవు. ఆడపిల్లలు ఆత్మరక్షణ పద్ధతులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
"The lipstick gun is especially for women's safety, not only for Indian women but wherever women are facing harassment" - Shyam Chaurasia, inventor. pic.twitter.com/ui9WanUDMe
— Al Jazeera English (@AJEnglish) April 20, 2020
Also read: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు పార్కిన్‌సన్స్ వ్యాధి? అందుకే ఆ వణుకుడు? అసలేంటీ వ్యాధి, ఎందుకొస్తుంది?
Also read: నల్ల నువ్వులతో ఇలా చేసుకుని తింటే అధిక రక్తపోటు అదుపులోకి వచ్చేస్తుంది
Also read: మీరు పెళ్లికి సిద్ధమయ్యే ముందు మీ కాబోయే భార్యని లేదా భర్తని కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలు ఇవే