అన్వేషించండి

Psyllium Husk : ఇసబ్‌గోల్ (Isabgol) తాగేందుకు బెస్ట్ టైమ్ ఏది? ఎలా తాగితే ఆరోగ్యానికి మంచిది?

Isabgol Uses : ఫిట్​నెస్ నిపుణుల నుంచి.. వైద్యుల వరకు ఎందరో సూచిస్తోన్న ఇసబ్​గోల్ ఎలా తీసుకోవాలో.. ఎప్పుడు తీసుకుంటే మంచిదో తెలుసా? అసలు దీనివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జీర్ణ సమస్యలకు ఇసబ్‌గోల్ సహజ పరిష్కారం, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
  • గోరువెచ్చని నీటితో రాత్రి లేదా ఉదయం తాగడం ఉత్తమం.
  • రోజుకు 1-2 టీ స్పూన్లు, నీళ్లు ఎక్కువగా తాగాలి.
  • ఇసబ్‌గోల్ బరువు తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

Isabgol Benefits in Telugu : జీవనశైలిలోని వివిధ అంశాలు జీర్ణ సమస్యలను పెంచుతాయి. దీంతో ఈ మధ్యకాలంలో చాలామంది మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారు. పెద్దల నుంచి పిల్లల వరకు ఈ సమస్య చాలా కామన్ అయిపోయింది. అయితే ఇలాంటి సమస్యలను దూరం చేసుకునేందుకు ఉన్న సహజమైన పరిష్కారాల్లో ఇసబ్‌గోల్ ఒకటి. దీనిని psyllium husk అంటారు. ఇసబ్​గోల్ అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థం. ఇది జీర్ణవ్యవస్థను సరిచేయడంలో సహాయపడుతుంది. అయితే దీనిని సరైన సమయంలో.. సరైన విధంగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనం అందుతుందని చెప్తున్నారు నిపుణులు. 

ఇసబ్‌గోల్ ఎప్పుడు తాగితే మంచిది

ఇసబ్​గోల్ రాత్రి పడుకునే ముందు తాగితే మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే దీనిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే ఉదయం సాఫీగా మల విసర్జన జరుగుతుంది. ఇది మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఉపశమనం ఇస్తుందని చెప్తున్నారు. అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే.. బాడీ డీటాక్స్ అవ్వడమే కాకుండా.. జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే మీ అవసరాన్ని బట్టి దానిని ఉదయం తాగాలా? లేదా సాయంత్రం తాగాలో ఫిక్స్ చేసుకోవాలని అంటున్నారు. 

ఇసబ్​గోల్ ఎలా తాగితే మంచిదంటే.. 

1 లేదా 2 టీ స్పూన్ల ఇసబ్‌గోల్ తీసుకోవాలి. రోజులో అంతకు మించి తీసుకోకూడదు. ఈ ఇసబ్​గోల్​ని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో కలిపి తాగాలి. కలిపిన వెంటనే తాగేస్తే మంచిది. లేదంటే అది జెల్‌లా మారుతుంది. ఇలా తాగిన వెంటనే మరో గ్లాస్ నీరు తాగితే ఇంకా మంచిది. లేదా ఒకసారి ఇసబ్​గోల్​ తాగితే.. తర్వాత వీలైనంత ఎక్కువ నీరు తాగాలని సూచిస్తున్నారు. లేదంటే బ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మజ్జిగలో కలిపి తాగితే జీర్ణక్రియకు ఇంకా మంచిదని చెప్తున్నారు. 

ఇసబ్‌గోల్ బెనిఫిట్స్.. 

ఇసబ్​గోల్ రోజూ తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండి బౌల్ మూవ్‌మెంట్ సులభం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు దూరమవుతాయి. బరువు తగ్గడంలో కూడా ఇది సహాయం చేస్తుందని చెప్తారు. అలాగే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచి ఆకలిని తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. గ్లూకోజ్ అబ్జార్ప్షన్‌ను కంట్రోల్ చేస్తుంది. 
అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గట్ హెల్త్ మెరుగుపరుస్తుంది.

గట్​లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే డయేరియాను తగ్గించి.. పేగులను స్థిరంగా ఉంచుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి.. అసిడిటీని తగ్గిస్తుంది. కడుపులో యాసిడ్స్ తగ్గించడంలో సహాయపడుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇసబ్​గోల్ ఆరోగ్యానికి మంచిదే అయినా రోజుకు 1–2 టీ స్పూన్లకు మించి తీసుకోకూడదు. తాగిన తర్వాత తప్పనిసరిగా నీరు ఎక్కువగా తాగాలి. ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరం రావచ్చు. దీనిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకుంటే మరీ మంచిది. ఇసబ్‌గోల్ సరైన విధంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. మొత్తం ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget