Poha Vs Rice: అన్నం కంటే పోహా ఆరోగ్యానికి మంచిదా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు
బియ్యం కన్నా అటుకులే ఆరోగ్యకరమా ,ఏది మంచిదో తెలుసుకుందాం
భారతదేశంలో బియ్యం వాడకం చాలా అధికం. బియ్యంతో తయారు చేసే మరో పదార్థమే పోహా. తెలుగులో అటుకులు అని కూడా పిలుస్తారు. వీటిని చాలామంది సాధారణ బియ్యానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. అయితే రెండింటి పోషకాహార ప్రొఫైల్ లను పరిశీలిస్తే మాత్రం భిన్నంగా ఉంటాయి. పోహాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే బియ్యం కన్నా ఎక్కువ ఫైబర్ పోహాలో ఉంటుంది. అందుకే చాలామంది పోషకాహార నిపుణులు బియ్యం కన్నా పోహా చాలా ఆరోగ్యకరమైనది అని చెబుతారు.
బియ్యాన్ని పాలిష్ చేసి అమ్ముతారు. కానీ అటుకులను పాలిష్ చేయడం కుదరదు. వీటిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది ముందుంటుంది. అలాగే జీర్ణక్రియను మెరుగ్గా ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అటుకుల్లో ఇనుము కూడా సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు అటుకులను తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. అటుకులు ఇనుము శోషణను మెరుగుపరుస్తాయి. పోహాకు నిమ్మరసం జోడించి తింటే చాలా మంచిది. పోహా తినడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. ఇది ఒక ప్రో బయోటిక్ గా కూడా పనిచేస్తుంది. పొట్టలోని మంచి బాక్టీరియాను కాపాడడంలో ముందుంటుంది.
వండిన అన్నంతో పోలిస్తే పోహాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోహాతో ఏ వంట అయినా చాలా తక్కువ సమయంలోనే చేసేయొచ్చు. పెద్దగా ఉడికించాల్సిన అవసరం లేదు. అటుకులపై ఉండే ఒక పొర చెక్కుచెదరకకుండా ఉంటుంది. కాబట్టి దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొంచెం తిన్నా కూడా పొట్ట నిండిన భావన కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలవు. కాబట్టి మధుమేహం బారిన పడినవారు అటుకులతో చేసిన ఆహారాన్ని అధికంగా తినడం చాలా అవసరం. బరువు తగ్గాలనుకుంటున్న వారికి కూడా పోహా మంచి ఎంపిక.
అటుకులు తినడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అధికంగా ఉంటుంది. కాబట్టి ఎనీమియా వంటి రోగాల బారిన పడకుండా ఇది కాపాడుతుంది. ఐరన్ సప్లిమెంట్లు వాడుతున్న వారు వాటికి బదులు పోహాతో చేసిన ఆహారాన్ని అధికంగా తింటే మంచిది. దీన్ని అల్పాహారంగా వండుకుంటే చాలా తక్కువ సమయంలోనే బ్రేక్ ఫాస్ట్ రెడీ అవుతుంది. పోషక విలువలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వివిధ కూరగాయలు, మసాలా దినుసులను జత చేసి వండితే రుచి కూడా అదిరిపోతుంది.
Also read: సోలార్ ప్యానెళ్లకు దగ్గరగా ఉండే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ? పరిశోధనలు ఏం చెబుతున్నాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.