Ketchup: ఇంట్లో కెచప్ ఎక్కువగా వాడుతున్నారా... అయితే సమస్యలు తప్పవు
కెచప్ లేని ఇల్లు కనిపించడం ఇప్పుడు కష్టమే. ప్రతి ఇంట్లోని ఫ్రిజ్లో కెచప్ సీసా కనిపిస్తోంది.
ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, నగెట్స్, సమోసా... ఇలా కొన్ని రకాల ఆహారపదార్థాలకు కెచప్ మంచి జోడీగా మారింది. పిల్లలైతే కెచప్ లేనిదే కొన్ని ఆహారపదార్థాలు తినమని చెప్పేస్తున్నారు. టమోటా కెచప్ ను ప్రాచీన కాలంలో ఔషధంగా వాడేవారు. పరిమితికి మించి రోజూ దాన్ని తినడం అలవాటు చేసుకుంటే మాత్రం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.
1. కెచప్ లో పెద్దగా పోషకాలేవీ లభించవు. ప్రాచీనకాలంలో తయారుచేసిన కెచప్ తో పోలిస్తే ఇప్పటి కెచప్ తో అనర్థాలే ఎక్కువ. ఇందులో చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్స్, ఫ్రక్జోజ్ కార్న్ సిరప్ లు ఇలా ఎన్నో కలుపుతారు. వాటిని తరచూ తినడం వల్ల గుండెకు హానిచేసే ట్లైగ్లిజరైడ్స్ శరీరంలో చేరతాయి. బరువు పెరిగి ఊబకాయానికి దారితీయవచ్చు.
2. సూపర్ మార్కెట్లలో దొరికే కెచప్ లను అధికంగా ప్రాసెస్ చేస్తారు. దీనివల్ల కీళ్ల నొప్పులు మొదలవుతాయి. అలాగే శరీరంలో వాపు లక్షణాలు కూడా పెరుగుతాయి.
3. కెచప్ లో భారీ స్థాయిలో కెలోరీలు ఉండవు. కానీ దాన్ని ఫ్రెంచ్ ఫ్రైజ్, పిజ్జా, బర్గర్, రోల్స్ వంటి అధిక కెలోరీలున్న, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలతో కలిపి తిన్నప్పుడే హానికరంగా మారుతుంది. శరీరంలో సోడియం స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది.
4. కెచప్ అందరకీ పడుతుందని చెప్పలేం. కొందరిలో అలెర్జీలకు కారణం కావచ్చు. తుమ్ములు, దగ్గు, దురద వంటి సమస్యలు కలగవచ్చు.
ప్రిజర్వేటివ్స్ వేసి, అధికంగా ప్రాసెస్ చేసిన కెచప్ లు సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. వాటిని తినడం వల్లే ఇలాంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. అదే ఇంట్లోనే తయారుచేసుకుంటే కెచప్ రోజూ తిన్నా మేలు చేస్తుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: గోళ్లకు వచ్చే అరుదైన క్యాన్సర్... చెక్ చేసుకోవడం ఇలా
Also read: ఎట్టకేలకు డెంగూ జ్వరానికి ఔషధం... కనిపెట్టిన లక్నో శాస్త్రవేత్తలు
Also read: గంటలు గంటలు కూర్చుని నిద్రపోవడం.. ప్రాణానికే ప్రమాదమా?
Also read: మగవారికి గట్టి షాకిచ్చిన జైపూర్ రెస్టారెంట్... ఇప్పుడు ఎలా తింటారో చూద్దాం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి