News
News
వీడియోలు ఆటలు
X

టీ నా? కాఫీ నా? ఆరోగ్యానికి ఏది మంచిది?

ఎన్ని కప్పుల కాఫీ టీలు తాగితే సేఫ్? అసలు మోతాదు ఎంత? ఇలాంటి విషయాల్లో అందరికీ అనుమానాలే. కాఫీ టీల్లో ఉండే కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్ల మోతాదులు తెలిస్తే ఇలాంటి అనుమాన నివృత్తి చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

మనలో చాలామందికి పొద్దున్న నిద్ర లేవగానే కాఫీ, లేదా టీ తాగనిదే రోజు మొదలవదు. చిన్న పిచ్చాపాటి మాటలు కావాలనుకున్నా కాఫీ కి కలుద్దామా? లేదా టీ తాగుదామా? అని ఆఫర్ చేస్తుంటారు. ఎవరైనా ఇంటికి వస్తే టీ తాగుతారా? కాఫీ తాగుతారా అని మర్యాదపూర్వకంగా కూడా ఆఫర్ చేస్తారు. ఇలా టీ కాఫీలు మన జీవితంలో, సంస్కృతిలో భాగంగా మారిపోయాయి.

కొంత మందికి కాఫీ ప్రియులైతే, మరి కొంత మందికి చాయ్ ఇష్టం. కొందరు చాయ్ మాత్రమే తాగితే కొందరు కాఫీ మాత్రమే తాగుతారు. చాయ్ తాగే వారు కాఫీ కంటే చాయ్ మేలు అంటారు. కాదుకాదు కాఫీ యే మంచిదని కాఫీ తాగేవారి వాదన. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, బుల్లెట్ కాఫీ, పాల చాయ్, పాలు కలపని లెమన్ టీ ఇలా రకరకాలుగా బ్రూస్ చేసి టీ, కాఫీలు లాగించేస్తారు. కానీ రెండింటిలోనూ కెఫిన్ ఉంటుంది. రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. మరి అలాంటపుడు ఎందులో ఎక్కువ తక్కువలు ఉన్నాయో మనలో ఎవరికైనా తెలుసా? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

  • కాఫీ, టీలను రకరకాల విధానాల్లో రుచిగా తయారు చేసుకుని తాగుతుంటారు. అన్ని కాఫీలతో పోలిస్తే టీలో కెఫిన్ తక్కువ ఉంటుంది.
  • కెఫిన్ సరిపడని వారు టీ ఎంచుకుంటే మంచిది. కాఫీ అయినా టీ అయినా మోతాదుకు మించకుండా చూసుకోవాలని నిపుణుల సూచన.
  • తయారు చేసే విధానాన్ని బట్టి 20 నుంచి 60 మిల్లీ గ్రాముల కెఫిన్ ఒక కప్పు టీలో ఉంటుంది. కప్పు కాఫీలో ఇంత కంటే ఎక్కువే ఉంటుందట. కెఫిన్ వినియోగం మోతాదుకు మించకూడదు.
  • కాఫీ, టీ రెండింటిలోనూ ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ల గురించి మాట్లాడుకున్నా కూడా టీ కే ఎక్కువ మార్కులు పడతాయి.
  • యాంటిఆక్సిడెంట్లు కూడా కాఫీ కంటే టీలోనే ఎక్కువ. అయితే టీని గ్రీన్ టీ, బ్లాక్ టీ రూపంలో తీసుకున్నపుడు ఎక్కువ యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువ.
  • కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యాలు, గుండె ఆరోగ్యానికి టీ కాఫీ లతో ప్రయోజనాలున్నాయి. అయితే ఈ ప్రయోజనాలు వాటిని తయారు చేసే విధానం, తయారీకి వాడిన పదార్థాల మీద ఆధారపడి ఉంటాయి.
  • టీ, కాఫీలకు అలవాటు పడే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. టీ తాగకపోతే రోజు మొదలవదు అనే వాళ్లంతా ఇలా అలవాటు పడినవారనే అర్థం. అతి ఎప్పుడూ మంచిది కాదు. ఏది మోతాదు మించినా దాని వల్ల జరిగే మంచి కంటే చెడే ఎక్కువ అని మరచిపోవద్దు.
  • టీ అయినా కాఫీ అయినా రోజులో రెండు కప్పులు మించకుండా చూసుకుంటే మంచిది. అంతకు మించి తీసుకున్నపుడు దాని వల్ల జరిగే మంచి కంటే చెడె ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 16 May 2023 10:00 AM (IST) Tags: Coffee Tea which is better

సంబంధిత కథనాలు

Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే

Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే

ఈ జీవులతో జాగ్రత్త - కరవడమే కాదు, చర్మంలో గుడ్లు కూడా పెట్టేస్తాయ్!

ఈ జీవులతో జాగ్రత్త - కరవడమే కాదు, చర్మంలో గుడ్లు కూడా పెట్టేస్తాయ్!

Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!

Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!

Diabetes: డయాబెటిస్‌‌ బాధితులకు వేసవి చాలా డేంజర్ - ఇలా అదుపులో ఉంచుకోండి

Diabetes: డయాబెటిస్‌‌ బాధితులకు వేసవి చాలా డేంజర్ - ఇలా అదుపులో ఉంచుకోండి

ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్‌ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!

ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్‌ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !