అన్వేషించండి

Buttermilk: రోజూ మజ్జిగ తాగొచ్చా? తాగితే శరీరంలో ఏం జరుగుతుంది?

పాలకి మంచి మజ్జిగ చక్కని ప్రత్యామ్నాయం. దీన్ని ప్రతిరోజూ మితంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

కొంతమంది పెరుగు తిన్నా తినకపోయిన తప్పనిసరిగా మజ్జిగ మాత్రం తీసుకుంటారు. శరీరానికి చలువ చేసే పదార్థాలలో మజ్జిగ కూడా ఒకటి. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారికి, బరువు తగ్గడంలో సహాయపడే వారికి మజ్జిగ ఉత్తమ ఎంపిక. డీహైడ్రేషన్ తో పోరాడేందుకు గొప్ప పానీయం. రక్తపోటుని తగ్గిస్తుంది. నిద్రలేమితో బాధపడే వారికి సహాయపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మజ్జిగ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అయితే దీన్ని ప్రతిరోజూ తీసుకోవచ్చా? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అని కొంతమందికి అనుమానం వస్తుంది. కానీ పల్చగా ఉండే మజ్జిగ డైలీ తీసుకున్నా ఎటువంటి సమస్యలు దరి చేరవు.

మజ్జిగ ప్రయోజనాలు

ఒక గ్లాసు మజ్జిగ తాగడం వాలల 99 కేలరీలు పొందుతారు. 2.2 గ్రాముల కొవ్వు అందిస్తుంది. ఇది మొత్తం పాల కంటే మెరుగైంది. శీతల పానీయాలకు చక్కని ప్రత్యామ్నాయం. ఇందులో పొటాషియం, విటమిన్ బి12, కాల్షియం కూడా ఉంటుంది.

జీర్ణశక్తి

జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారికి ఇది అద్భుతమైన పానీయం. ఇందులోని లాక్టిక్ ఆమ్లాలు, ప్రొబయోటిక్ కారణంగా పేగులని ఆరోగ్యంగా ఉంచుతుంది.

డిటాక్స్ చేస్తుంది

ఆహారంలో రోజూ ఏదో ఒక విధంగా మజ్జిగ తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలని డిటాక్స్ చేస్తుంది. విటమిన్ బి 2 స్థాయిలని మెరుగుపరుచుకోవచ్చు. ఇందులోని రిబోఫ్లావిన్ కాలేయంని వ్యర్థాలని బయటకి పంపిస్తుంది. హానిరకమైన వైరస్, బ్యాక్టీరియా శరీరంలో ఉండకుండా పారద్రోలుతుంది.

రిలాక్సింగ్ డ్రింక్

రాత్రి వేళ ఆయిల్ తో కూడిన ఆహారం తిన్న తర్వాత పొట్ట అంతా ఏదోగా అనిపిస్తుంది. అటువంటి సమయంలో మజ్జిగ తీసుకుంటే అద్భుతమైన రిలాక్సింగ్ డ్రింక్ గా ఉపయోగపడుతుంది. పొట్టని శుభ్రపరిచి హాయిగా ఉంచుతుంది. జిడ్డు కలిగిన ఆహారాలని ఇది శుభ్రం చేస్తుంది. జీర్ణవ్యవస్థని సులభతరం చేస్తుంది.

పాలకు ప్రత్యామ్నాయం

పాలకి ఇది చక్కని ప్రత్యామ్నాయం. ఇందులో తక్కువ మొత్తంలో కొవ్వులు, కేలరీలు ఉంటాయి. లాక్టోస్ అసహనం ఉన్న వారికి మజ్జిగ మంచిగా మేలు చేస్తుంది.

అధిక కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారికి మజ్జిగ సరైన పానీయం. ప్రతిరోజూ ఒక గ్లాస్ తీసుకుంటే కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవచ్చు.

బరువు తగ్గిస్తుంది

బరువు తగ్గేందుకు కండరాలు పెంచుకోవడానికి రోజువారీ డైట్లో మజ్జిగ చేర్చుకుంటే మంచిది. ఇందులోని పోషక విలువులు ఆరోగ్యవంతమైన శరీరాన్ని అందిస్తాయి. శక్తిని అందిస్తాయి. మజ్జిగ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది.

డీహైడ్రేషన్ పోగొడుతుంది

దాహం తీర్చి, డీహైడ్రేషన్ తో పోరాడేందుకు మజ్జిగ మంచి పానీయం. ఉప్పు, కాస్త కొత్తిమీర, కొద్దిగా మిరియాల పొడి జోడించుకుని తాగితే మరీ మంచిది. నిర్జలీకరణాన్ని పోగొడుతుంది.

చర్మానికి మేలు

చర్మ డ్యామేజ్ ని రిపేర్ చేయడంలో మజ్జిగ సహాయపడుతుంది. మచ్చలు, వయసు సంబంధిత సమస్యల్ని నయం చేస్తుంది. చర్మం బిగుతుగా ఉండకుండా చూస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: అద్భుతం, విజయవంతంగా గర్భాశయ మార్పిడి - చరిత్ర సృష్టించిన వైద్యులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget