అన్వేషించండి

Cool Drink Cans: టిన్స్ మీద టిన్స్ తాగేస్తున్నారా? ఈ కూల్ డ్రింక్ క్యాన్స్‌తో ఇలాంటి ప్రమాదం కూడా ఉందా?

బాటిల్ కంటే క్యాన్ తో కూల్ డ్రింక్స్ తాగేందుకు చాలా మంది ఇష్టపడుతారు. క్యాన్స్ ద్వారా కూల్ డ్రింక్స్ తాగితే అనేక రకాల సూక్ష్మక్రిములు, ఇన్ఫెక్షన్‌లకు గురి చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కూల్ డ్రింక్ టిన్స్ తాగేందుకు భలే స్టైలిష్‌గా ఉంటుంది కదూ. సాధారణంగా బాటిల్ లో కూల్ డ్రింక్ కన్నా కూడా అల్యూమినియం క్యాన్లో కూల్ డ్రింక్ చాలా రుచికరంగా ఉంటుందని, మరింత ఎక్కువగా చల్లదనం ఉంటుందని, అందులో గ్యాస్ కూడా లీక్ అవ్వదని.. అందుకే దాని రుచి ప్రత్యేకంగా ఉంటుందని చెబుతుంటారు. అయితే ఇలా తాగడం హానికరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్స్ మీ శరీరానికి అనేక రకాల సూక్ష్మక్రిములు, ఇన్ఫెక్షన్‌లకు గురి చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి ద్వారా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు సైతం సంభవించే అవకాశం ఉందట. అయితే క్యాన్లలో మీకు ఇష్టమైన పానీయం తాగేటప్పుడు ఇన్ఫెక్షన్లను నివారించడానికి కొన్ని సులభమైన చిట్కాలను తెలుసుకుందాం.

క్యాన్స్ తయారీ యూనిట్లో తయారు అవుతాయి. తరువాత వాటిని శీతల పానీయాల కంపెనీకి పంపుతారు. వాటిని ఆ కంపెనీ వారు  స్టోరేజీ రూములో నిలువ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా పానీయాన్ని ప్యాక్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ క్యాన్స్ లను వినియోగదారులకు అందించడానికి ముందు వాటిని శుభ్రం చేస్తారు. అయితే క్యాన్స్ నిల్వ చేసే సమయంలో వాటిని అపరిశుభ్ర వాతావరణంలో ఉంచే అవకాశం ఉంది. 

ఒక్కోసారి క్యాన్స్ ను నిల్వచేసినప్పుడు వాటిపై ఎలుకలు పరిగెత్తవచ్చు. వాటిపై  ఎలుక మలమూత్రాలు పడితే, అలాంటి క్యాన్స్ ను మీరు పొరపాటున తీసుకోవడం వల్ల లెప్టోస్పిరోసిస్ వ్యాధి వస్తుంది. లెప్టోస్పిరోసిస్ అనేది జంతువులతో పాటు  మనుషులను ప్రభావితం చేసే బ్యాక్టీరియా వ్యాధి. లెప్టోస్పిరోసిస్ లక్షణాల విషయానికి వస్తే ఇందులో తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పి, అతిసారం వస్తాయి.  మరోవైపు తీవ్రమైన సమస్యలు వచ్చినట్లయితే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి. తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. 

సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యాన్ల నుండి ఎలా త్రాగాలి:

3 సులభమైన చిట్కాలు:

- క్యాన్స్ ఓపెన్ చేసిన తర్వాత నేరుగా తాగకుండా, పానీయాన్ని ఒక గ్లాసులో పోసి, తాగండి.

- క్యాన్స్‌ను కడిగి తాగే ముందు శుభ్రమైన గుడ్డతో తుడవండి.

- క్యాన్స్ మూత తెరిచి, స్ట్రా వేసి సిప్ చేయండి.

లేదా దాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత నీటితో శుభ్రం చేసి తాగండి. తద్వారా మీకు ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. అలాగే క్యాన్ ను ఎప్పుడు ఫ్రీజర్ లోనే  భద్రపరచుకోండి. దానివల్ల దానిపై బ్యాక్టీరియా ఉత్పత్తి కాదు. ఈ పద్ధతులు పాటిస్తే.. మీకు ఎలాంటి రోగాలు రావు. దరిచేరవు కూడా. మరి తప్పకుండా పాటిస్తారు కదూ.

Also Read : ఉప్పు లేదా చక్కెర - వీటిలో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటో తెలుసా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Embed widget