అన్వేషించండి

Red wine : రెడ్ వైన్ తాగడం నిజంగానే ఆరోగ్యానికి మంచిదా? దీని వెనుక ఉన్న అపోహలు ఇవే

Red wine : రెడ్ వైన్ తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. అయితే రెడ్ వైన్ పాటు ఏదైనా ఆల్కహాల్ తాగితే ఆరోగ్యం ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

తాగుడు అలవాటులేనివారు కూడా ఆరోగ్యానికి మంచిదని రెడ్ వైన్‌ను తాగడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే, అది క్రమేనా వ్యసనంగా మారుతోంది. పైగా, అది ఆరోగ్యానికి మేలు చేస్తుందనే భావనతో ఉంటారు. మరి ఇందులో నిజమెంతా? నిజంగానే రెడ్ వైన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా?

రెడ్ వైన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా?

వైన్‌ను పులియబెట్టిన ద్రాక్ష రసంతో తయారు చేస్తారనే సంగతి తెలిసిందే. వైన్ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయన్న విషయం గురించి ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. రోజుకో గ్లాస్ రెడ్ వైస్ తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. రెడ్ వైన్ అతిగా తీసుకుంటే గుండెజబ్బులు, టైప్ 2 మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆయుష్షు కూడా పెరుగుతుందని మునుపటి అధ్యయనాలు పేర్కొన్నాయి.

ఇది ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం మాత్రమే. రెడ్ వైన్ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. జామా నెట్ వర్క్ ఒపెన్ జర్నల్  2023లో ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం రెడ్ వైన్ తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. 5 మిలియన్ల మంది ప్రజలపై అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.

మోతాదు మించితే ప్రమాదమే

రోజుకు తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, మోతాదుకు మించి తీసుకున్నట్లయితే ప్రమాదం పెరుగుతుందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. జనవరి 2023లో మద్యం ఆరోగ్యానికి హాని చేస్తుందని తెలిపింది. ఆల్కహాల్‌లో అత్యంత ప్రమాదకరమైన ఆస్బెస్టాస్, రేడియేషన్, పొగాకు ఉన్నట్లు గుర్తించింది. దీన్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే రొమ్ము, పెద్దు పేగుతో పాటు ఏడు రకాల క్యాన్సర్ లకు కారణమయ్యే విష పదార్థాలు ఇందులో ఉన్నట్లు పేర్కొంది. 
 
మితంగా ఆల్కాహాల్ తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్ , క్యాన్సర్ ప్రమాదాన్ని అధిగమిస్తాయని నిరూపించే అధ్యయనాలు ఇప్పటివరకు లేవని డబ్య్లూహెచ్ ఓ తెలిపింది. అయితే రెడ్ వైన్ తీసుకుంటే ఎన్నో అనారోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ప్రచారంలో ఉంది. దాని వెనుకున్న వాస్తవాలేంటో.. అపోహలేంటో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

ట్రెండ్ ఇలా మొదలైంది

ఒక గ్లాసు రెడ్ వైన్ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని 1991లో 60నిమిషాల కథనం ప్రసారం అయ్యింది. ఫ్రెండ్ పారడాక్స్ అనే పదాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. అధిక కొవ్వుతో బాధపడేవారికి రెడ్ వైన్ మంచి ప్రయోజనాలను అందిస్తుందని అమెరికన్లతో పోలిస్తే ఇప్పటికీ తక్కువ గుండె సంబంధింత వ్యాధులు కలిగి ఉన్నారని తెలిపారు.

అంతేకాదు రెడ్ వైన్ శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని.. ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచించింది. ఆ ఎపిసోడ్‌ ప్రసారమైన తర్వాత రెడ్ వైన్ అమ్మకాలు భారీగా పెరిగాయని సైంటిఫిక్ స్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హీథర్ హౌసెన్‌బ్లాస్ తెలిపారు. కానీ రెడ్ వైన్ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.

ఆ మూలకం మంచిదే కానీ..

వైన్‌లో ఉండే రిస్వరటోల్ అనే మూలకం యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని, ఇది మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. అయితే ఈ మూలకం కేవలం రెడ్ వైన్ లో మాత్రమే కాదు ద్రాక్ష పళ్ళు, బ్లూబెర్రీలు, క్రాన్ బెర్రీలు, పల్లీలు, పిస్తా పప్పు వంటి వాటిలో కూడా పుష్కలంగా లభిస్తుంది కూడా. మరోవైపు చాలామంది తమ చెడు అలవాట్లను మంచి అలవాట్లుగా చిత్రీకరించుకునేందుకు ఇలాంటి వాదనలను ముందుకు తెస్తుంటారని చెబుతున్నారు.  

ఆల్కహాల్ పరిశ్రమకు ఇలాంటి వాదనలు బలం చేకూరుస్తాయని తద్వారా వారి బిజినెస్ బాగా సాగుతుందని చెబుతున్నారు. నిజానికి ఆల్కహాల్ వ్యసనం ఉన్న వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో తేలింది. ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగితే మీ నిద్ర కూడా చెడిపోతుందని నెమ్మదిగా ఆల్కహాల్ ఎఫెక్ట్ మీ శరీరంపై చూపిస్తుందని ఇది అంత మంచి అలవాటు కాదని పరిశోధకులు చెబుతున్నారు.

Also Read: ఆలుగడ్డ vs చిలగడ దుంప - వీటిలో ఏది ఎక్కువ ఆరోగ్యకరం?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget