అన్వేషించండి

International Day of Forests : అడవి మనుషులం తల్లీ.. నిన్ను నరుక్కుంటే అనర్థం మాకేనని అర్థం కాలేదు

Forest Day : అడవుల ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఏటా ఇంటర్నేషనల్​ డే ఆఫ్ ఫారెస్ట్స్​ను జరుపుతున్నారు. అయితే అడవుల నరికేయడం వల్ల మన ఆరోగ్యాలు ఎలా ప్రభావితమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

World Forest Day : అడవి మనిషిని తల్లి అర్థం కాలేదు అని ఓ సినిమాలో హీరో చెప్పినట్లు.. నిజంగా మనమంతా అడవి మనుషులమే. ఆ అడవి తల్లి నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందుతూ.. ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ.. మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే అడవుల ప్రాముఖ్యత గురించి చెప్తూ.. ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన ప్రపంచ అటవీ దినోత్సవం (International  Day of Forest)నిర్వహిస్తున్నారు. చెట్ల పెంపకం, అడవుల నరికివేతను అడ్డుకోవడం వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం కొత్త థీమ్​తో ముందుకు వస్తున్నారు. అడవుల నరికివేతను అడ్డుకోవాలంటూ.. అడవుల ప్రాముఖ్యతను చాటి చెప్తూ.. ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహించాలని 2012లో యూనెస్కో తీర్మానించింది. రాబోయే తరాలకు అడవులను అందించాలనే లక్ష్యంతో దీనిని నిర్వహిస్తుంది. 

అడవుల ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఏటా మార్చి 21వ తేదీన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అన్నిరకాల అడవుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారు. చెట్ల పెంపకం, అడవులతో కూడిన కార్యకలాపాలపై స్థానిక, జాతీయ, అంతర్జాతీయంగా అవగాహన సదస్సులు కల్పిస్తారు. అడవుల సంరక్షణలో భాగంగా అంతర్జాతీయ దినోత్సవం రోజు కొత్త థీమ్​(International Day of Forest Theme)ను ఎంచుకుంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్​ 2024కు గానూ.. అడవులు, ఆవిష్కరణ అనే థీమ్​తో ముందుకు వెళ్తున్నారు. అయితే మీకు తెలుసా? అడవులు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయట. అబ్బా ఎక్కడో ఉండే అడవులు మనపై ఎలా ప్రభావం చూపిస్తాయి.

వాతావరణంలో మార్పులకు కారణం

భూ ఉపరితలంలో దాదాపు మూడింట ఒక వంతు అడవులే ఉన్నాయి. అడవులంటే కేవలం పచ్చదనమే కాదు. పలు రకాల జాతులకు, జంతువులకు ఆవాసాలు. ప్రజలకు జీవనోపాధిని కలిగించే కర్మాగారాలు. అంతేకాదు ఆరోగ్యకరమైన అడవులు కార్బన్ సింక్​లుగా పనిచేస్తాయి. సంవత్సరానికి బిలియన్ల మెట్రిక్ టన్నుల కార్బన్​డయాక్సైడ్​ను ఇవి గ్రహిస్తాయి. ఇవే కాకుండా వాతావరణ మార్పులను కంట్రోల్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నరికివేయడం వల్ల వాతావరణంలో తీవ్రమార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి ఆరోగ్యంపై దుష్ప్రాభావాలను చూపిస్తాయి. 

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..

అడవులు వాతావరణంపై తీవ్రమైన మార్పులు చూపిస్తాయి. వాతావరణ మార్పుల కారణంగా పర్యావరణ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఇవి అలెర్జీ కారకాలను ఉత్పత్తి చేసే అటవీ జాతుల ఆవిర్భావానికి కారణం అవుతాయి. అంతేకాకుండా పలు వ్యాధుల ఆవిర్భావానికి ప్రధాన కారణమవుతాయి. ఉష్ణోగ్రతల్లోని తీవ్రమైన మార్పులు భూమిని కూడా సూర్యుడి మాదిరిగా వేడి పుట్టించేలా చేస్తాయి. ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలు మనుషులపై తీవ్ర ప్రభావాలు చూపిస్తున్నాయి. వేడి పెరిగితే మంచు కరిగి.. తీవ్రమైన వరదలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. తీవ్రమైన చలి, తీవ్రమైన ఎండలు ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తాయి. ఇప్పటికే ఈ మార్పులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. వర్షాలు పలు చోట్ల అతిగా కురుస్తుంటే.. మరో చోట అనా వృష్టిగా కురుస్తున్నాయి. ఇలా ప్రతి పాయింట్ కూడా మానవ ఆరోగ్యాన్ని ప్రభావం చేస్తున్నాయి. 

ఇన్నోవేషన్ పేరుతో నరికేస్తున్నాం.. 

ఔషధాల పేర్లతో, మూలికలు, బట్టలు, నిర్మాణ వస్తువులు, మందులు, అనేక రోజూవారీ వస్తువుల కోసం అడవులను ఉపయోగించుకుంటున్నాము. అయితే ఉపయోగించిన చెట్లకు బదులుగా ఎన్ని చెట్లను తిరిగి నాటుతున్నాము. అభివృద్ధి పేరుతో మరికొందరు చెట్లను నరికి అపార్ట్​మెంట్లు, కర్మాగారాలు నిర్మిస్తూ అటవీని నరికేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు చూసైనా మనం ఇకపై మారాలి అంటున్నారు పర్యావరణ హితులు. అడవులను పర్యవేక్షించడానికి, మంటలను గుర్తించి వాటిని కాపాడడానికి పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలను రూపొందించాలి. 

ఈ నేపథ్యంలోనే పలు దేశాలు అడవులను పరిరక్షించడంలో ముందుకు వస్తున్నాయి. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను కంట్రోల్ చేసే ఎన్నో ఇన్నోవేటివ్ థాట్స్​తో ముందుకు వస్తున్నాయి. అటవీ నిర్మూలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. 2030 నాటికి అటవీ నిర్మూలన, అటవీ క్షీణతను తగ్గించడం, అడవులను పునరుద్ధరించే విధంగా ముందుకు వెళ్తున్నాయి. మనం కూడా అడవి ప్రాముఖ్యతను గుర్తించి.. వాటితో పాటు.. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Also Read : 'మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించండి'.. డౌన్ సిండ్రోమ్ వ్యక్తుల ఆవేదన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Kakinada Port Case: కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ, సీఐడీ దూకుడు, వారికి మరోసారి నోటీసులు జారీ
కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ, సీఐడీ దూకుడు, వారికి మరోసారి నోటీసులు జారీ
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Kakinada Port Case: కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ, సీఐడీ దూకుడు, వారికి మరోసారి నోటీసులు జారీ
కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ, సీఐడీ దూకుడు, వారికి మరోసారి నోటీసులు జారీ
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
TollyWood: ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు - ఎంత వరకు సక్సెస్ అవుతాయి ?
ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు - ఎంత వరకు సక్సెస్ అవుతాయి ?
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
AP Rains Update: ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
Embed widget