By: ABP Desam | Updated at : 07 Jun 2022 04:00 PM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
డబ్బే ప్రపంచంగా మారిపోయిన కాలం ఇది. డబ్బు కోసమే ప్రపంచంలో రోజూ ఎన్నో దొంగతనాలు, దోపిడీలు. కానీ ఒక మహిళ తనకు దొరికిన డబ్బును కూడా వదులుకుంది. ఆ డబ్బు ఏ వ్యక్తికి చెందుతుందో ఆ వ్యక్తికి తిరిగి పంపించేసింది. దొరికిన డబ్బును ఎందుకు ఉంచుకోలేదు అని అడిగితే చాలా చక్కని సమాధానం చెప్పింది. ‘దేవుని దయ వల్ల నా జీవితం బావుంది. పిల్లలకు పెళ్ళిళ్లు అయ్యాయి. మనవలు పుట్టారు. మా అందరి ఆరోగ్యం బాగుంది. కోట్ల కోద్దీ డబ్బు, ఆస్తులు లేకపోయినా ఉన్నంతలో మా కుటుంబం సంతోషంగా ఉంది.మాకు ఇంకేం కావాలి? అందుకే పరాయి డబ్బు నాకు వద్దు’ అని వివరించింది. ఆమె చెప్పింది విన్నాక చాలా మంది ‘ఇంకా ఇలాంటి వాళ్లు ఉన్నారా’ అని ఆశ్చర్యపోతున్నారు. మరికొంత మంది ‘నిజాయితీ బతికే ఉంది’ అంటూ మెచ్చుకుంటున్నారు.
ఆ డబ్బెక్కడిది?
అమెరికాకు చెందిన విక్కీ ఆన్ లైన్లో సోఫాల కోసం వెతుకుతోంది. ఆ సమయంలో అనుకోకుండా ఉచితంగా ఇచ్చే సోఫాల జాబితాపై క్లిక్ చేసింది. అందులో ఒక సోఫా, రెండు మ్యాచింగ్ ఛైర్లు ఉన్నాయి. అవి చూసేందుకు చక్కగా ఉండడంతో ఆమెకు నచ్చాయి.అక్కడ ఇచ్చిన నెంబర్ కు ఫోన్ చేసింది. ఓనర్లు తమ ఇంట్లో సామాన్లు ఎక్కువైపోయాయని అందుకే ఎవరికైనా ఇలా ఉచితంగా సోఫాలు ఇచ్చేయడానికి ఆన్ లైన్లో పెట్టినట్టు చెప్పారు. దీంతో వారింటికి వెళ్లి విక్కీ ఆ సోఫాలను తెచ్చుకుంది.ఇంట్లో సోఫాలను అమర్చాక అవి ఎలా ఉన్నాయో చూసేందుకు చేత్తో నొక్కింది. అన్ని కుషన్లు బాగానే ఉన్నప్పటికీ ఓ కుషన్లో మాత్రం ఏవో వస్తువులు చేతులు తాకినట్టు అనిపించాయి. వెంటనే దాని జిప్ తీసి చూసేసరికి విక్కీకి షాక్ కొట్టినట్టు అయ్యింది.
నోట్ల కొట్టలు కవర్లలో పెట్టి బోలెడు ఉన్నాయి. వెంటనే తన పిల్లలను పిలిచి చూపించింది. వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. వాటిని లెక్క పెడితే 36000 డాలర్లు ఉన్నాయి. అంటే దాదాపు రూ.27 లక్షలు. అంత డబ్బును చూడడం ఆ కుటుంబానికి తొలిసారి. అయినా వారు ఆ డబ్బు కోసం ఆశపడలేదు. వెంటనే విక్కీ తమకు ఆ సోఫాను ఇచ్చిన వారికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు రాగానే ఆ డబ్బును అందజేశారు. విక్కీ చేసిన పని అక్కడ స్థానికంగా సంచలనంగా మారింది. నిజానికి విక్కీ కుటుంబానికి డబ్బు అవసరం ఉంది. అయినా ఇలా వేరే వాళ్లు తీసుకునేంత పరిస్థితిలో లేమని, తాము కష్టపడి బతుకుతున్నామని విక్కీ కుటుంబం చెబుతోంది. ఇక సోఫాల యజమానులు విక్కీ మంచితనానికి కరిగిపోయారు. వారికి ఫ్రిజ్ లేదని తెలుసుకుని 2,200 డాలర్లను అందించారు.
Also read: టైప్ 1 డయాబెటిస్ ఉందా? అయితే ఈ మార్గదర్శకాలు మీకే
Also read: ఉలవలు మెనూలో చేర్చుకోవాల్సిందే, డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది
Millets: ఆహారాలకే అమ్మలాంటివి చిరుధాన్యాలు - వీటిని మెనూలో చేర్చుకుంటే ఎంత ఆరోగ్యమో
Air Fryer: ఎయిర్ ఫ్రైయర్లో అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించొచ్చా? అలా చేస్తే ఇబ్బందులు వస్తాయా?
Rice Paper: రైస్ పేపర్ గురించి తెలుసా? స్ప్రింగ్ రోల్స్ కి చుట్టేసుకుని తినెయ్యచ్చు
పుట్టుమచ్చలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయా? జాగ్రత్త ప్రమాదరకమైన ఈ వ్యాధి సంకేతం కావొచ్చు
Kids Health: మీ పిల్లల దంతాలు కాపాడుకోవాలంటే, ఈ ఆహారాలను తగ్గించండి
Union Budget 2023 : విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.683 కోట్లు, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇవే!
AP Capital Vizag: ఏపీ క్యాపిటల్ అని గూగుల్ లో సెర్చ్ చేసినా విశాఖనే వస్తుంది: స్పీకర్ తమ్మినేని
Minister Gudivada Amarnath : అది ఫోన్ ట్యాపింగ్ కాదు కాల్ రికార్డింగ్, కోటంరెడ్డికి మంత్రి అమర్నాథ్ కౌంటర్
Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?