By: Haritha | Updated at : 09 Jul 2022 05:04 PM (IST)
ఆప్టికల్ ఇల్యూషన్
ఒక్కోక్కరిది ఒక్కో వ్యక్తిత్వం ఉంటుంది. ఒకరు తక్కువగా మాట్లాడతారు, మరికొందరు అన్నీ బయటికే చెప్పేస్తారు. ఒకరి వ్యక్తిత్వం అనేదివారితో కొన్నేళ్లు ప్రయాణం చేస్తేనే తెలిసే విషయాలు. కానీ ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ద్వారా ఎవరు ఇంట్రావర్టో, ఎవరు ఎక్స్ ట్రావర్టో చెప్పేయచ్చు. ఈ బొమ్మను పది సెకన్ల పాటూ నిశితంగా చూడండి. ఇందులో మీ మెదడు మొదట గుర్తించిందేంటో చెప్పండి. మనిషి ముఖం, లేదా పర్వతాలు ... ఈ రెండింటిలో మీకు ఏది మొదట కనిపిస్తుందో చెప్పండి. దాన్ని బట్టి మీరెలాంటి వ్యక్తులో లేక మీకు కావాల్సిన వారు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోండి.
మనిషి ముఖం
ఈ బొమ్మను చూడగానే మీకు మనిషి ముఖం కనిపించదనుకోండి మీరు గలగల మాట్లాడేసే వ్యక్తులు. మీకు మనసులో ఏమీ ఉండదు. చాలా అడ్వెంచరస్ గా ఉండేందుకు ఇష్టపడతారు. మీ చుట్టూ ఎప్పుడూ మనుషులుండాలి. అందరితో చాలా త్వరగా కలిసిపోతారు. బాహ్య ప్రపంచంలో చాలా ఆనందంగా బతికేయగలరు.
పర్వతాలు
బొమ్మలో ఎగుడుదిగుడుల పర్వాతలు మీకు మొదట కనిపిస్తే మీరు అంతర్ముఖులని అర్థం. మీ కంఫర్ట్ జోన్లోనే ఉంటారు. అది దాటి బయటికి వచ్చేందుకు ఇష్టపడరు. తక్కువగా మాట్లాడతారు. ఎవరైనా మిమ్మల్ని మాట్లాడించినా కూడా ఒక్క ముక్క సమాధానంతో ఆపేస్తారు. మీలోనే మీరు అంతర్గత ప్రపంచాన్ని వెతుక్కుంటారు. ప్రజలు మిమ్మల్ని సోమరిగా అనుకునే అవకాశం ఉంది.
ఈ టెస్టును మీకు మీరు కాదు, ఇతరులకు కూడా ఓసారి ప్రయత్నించవచ్చు. వీటిని వ్యక్తిత్వ పరీక్షలు అంటారు. ఆప్టికల్ ఇల్యూషన్లలో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్ తో వాటిని ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు చిత్రకారులు.
ఇప్పుడు సోషల్ మీడియాలో వీటి హవా అధికంగా ఉంది. అన్ని చోట్ల ఇవే సర్క్యులేట్ అవుతున్నాయి. వీటిని గత వందల ఏళ్లుగా ప్రజలు ఆడుతూనే ఉన్నారు. వీటి వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కంటి చూపు, ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాదు కంటి చూపు, మెదడు సమన్వయంగా పనిచేస్తున్నాయో చెప్పే సాధనంగా ఆప్టికల్ ఇల్యూషన్ ను చెప్పుకోవచ్చు.
Also read: శిక్షణ పొందిన పైలెట్ అతను, కానీ జొమాటో డెలివరీ బాయ్‌గా మారిపోయాడు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Brain: మీ మెదడు త్వరగా ముసలవ్వకూడదనుకుంటే ప్రతిరోజూ వీటిని తినండి
Mehendi: మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?
World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!
Salt: మూడు రకాల ఉప్పుల్లో ఏది ఆరోగ్యానికి ఉత్తమమైందో తెలుసా?
Dengue: డెంగ్యూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాస్పిటల్‌లో ఎప్పుడు చేరాలి?
Chandrababu Naidu Arrest : చంద్రబాబు మాజీ పీఎస్ సస్పెండ్ - అమెరికాకు వెళ్లి తిరిగిరాలేదన్న ప్రభుత్వం !
మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్‌ఎస్- హింట్ ఇచ్చిన హరీష్
Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా
Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్
/body>